గుంటూరు వైద్య కళాశాలకు బస్సు వితరణ
1999 బ్యాచ్ వైద్య విద్యార్థుల ఉదారత
గుంటూరు మెడికల్: గుంటూరు వైద్య కళాశాల 1999 బ్యాచ్ వైద్య విద్యార్థులు కళాశాల ప్రగతికి తమవంతుగా ముందుకు వచ్చారు. ఈ బ్యాచ్‌లో బాహుబలి సర్జన్‌గా గుర్తింపు పొందిన ప్రముఖ న్యూరో సర్జన్, గుంటూరు బ్రింద హాస్పటల్ అధినేత డాక్టర్ భవనం హనుమ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థులు విరాళాలు ఇచ్చారు. వైద్య విద్యార్థులకు కళాశాల నుంచి హాస్టల్‌కు వెళ్లేందుకు అవసరమైన రూ. 40 లక్షలు ఖరీదు చేసే బస్సు కొనుగోలు నగదు సమకూర్చారు. శనివారం డాక్టర్ భవనం హనుమ శ్రీనివాసరెడ్డి, డాక్టర్ పుణ్యాల శ్రీనివాసరెడ్డి తండ్రి చంద్రారెడ్డిలు గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నాగార్జునకొండ వెంకటసుందరాచారిని కలిశారు. రూ. 40 లక్షల విలువైన చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. హనుమ శ్రీనివాసరెడ్డికి విద్యార్థుల సమస్య గురించి తెలియజేయగానే స్పందించి కేవలం 15 రోజులలో భారీ విరాళం అందించడం అభినందనీయం అన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ శ్రీధర్, డాక్టర్ ప్రభాకర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment