హాస్టల్ భవనం ప్రారంభించిన మంత్రి డోలా
వినుకొండ(నూజెండ్ల): గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి అన్నారు. శనివారం పట్టణంలోని ఎన్‌ఎస్‌పీ కాలనీలో గల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు. రూ.6 కోట్లతో నూతనంగా నిర్మించిన హాస్టల్ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్న ట్లు చెప్పారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ లో డిగ్రీ విద్యార్థుల కోసం గురుకుల కళాశా లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు చదలవాడ అరవింద్‌బాబు, జూలకంటి బ్రహ్మారెడ్డి, కలెక్టర్ అరుణ్‌బాబు పాల్గొన్నారు.
జాతీయ అదాలత్‌ను జయప్రదం చేయండి
నరసరావుపేటటౌన్: జాతీయ లోక్ అదాలత్ ను జయప్రదం చేయాలని 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి, మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్ ఎన్.సత్యశ్రీ కోరారు. శనివారం కోర్టు ప్రాంగణంలో పోలీస్ అధికారుల తో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. డిసెంబర్ 14న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌లో అధికసంఖ్యలో కేసులు పరిష్కా రమయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రాజీ పడ దగ్గ క్రిమినల్ కేసులతోపాటు సివిల్ కేసులు పరిష్కరించబడతాయన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకో వాలని కోరారు. న్యాయమూర్తులు ఎ.పూర్ణిమ, ఆశీర్వాదంపాల్, పల్లవి, సీఐ సీహెచ్ చరణ్, ఎస్‌ఐలు అశోక్, హరిబాబు పాల్గొన్నారు.
నాగార్జునకొండలో పర్యాటకుల సందడి
విజయపురిసౌత్: నాగార్జునకొండలో శనివారం పర్యాటకుల సందడి నెలకొంది. స్థానిక లాంచీస్టేషన్ నుంచి నాగార్జునకొండకు లాంచీలలో వెళ్లిన పర్యాటకులు కొండలోని వివిధ ప్రదేశాలను సందర్శించారు. ఎత్తిపోతల జలపాతాన్ని వీక్షించారు. శనివారం లాంచీల ద్వారా రూ.58,000 ఆదాయం పర్యాటక శాఖకు సమకూరినట్లు లాంచీ యూనిట్ అధికారులు తెలిపారు.
నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
సత్తెనపల్లి: నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించిన సంఘటన సత్తెనపల్లిలో శనివారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. అచ్చంపేట మండలం చిగురుపాడు గ్రామానికి చెందిన మేకల కీర్తన పట్టణంలోని వెంకటపతి నగర్‌లో గల సాంఘిక సంక్షేమ ఎస్సీ బాలికల కళాశాల వసతి గృహంలో ఉంటూ పట్టణంలోని గుంటూరు రోడ్‌లో గల వేద కళాశాలలో నర్సింగ్ ప్రథమ సంవత్సరం విద్యనభ్యసిస్తుంది. శనివారం ఉదయం కళాశాలకు వెళ్లిన విద్యార్థిని మెట్లు ఎక్కుతూనే అలసటకు గురికావడంతో వెంటనే కళాశాల ప్రిన్సిపల్ వసతి గృహ వార్డెన్ రాణెమ్మకు ఫోన్ చేశాడు. వార్డెన్ రాణెమ్మతోపాటు కీర్తన సోదరుడు కూడా వచ్చి వైద్యశాలకు తరలించారు. ఆహారం తీసుకోకుండా కడుపు నొప్పికి మాత్రలు వేసుకోవడం వలన అస్వస్థతకు గురైనట్లు పేరెంట్స్ తెలుపుతున్నారు. 20 వరకు మాత్రలు మింగగా కొన్ని శరీరంలో కలిసిపోయాయని, మరికొన్ని వైద్యులు కక్కించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆత్మహత్యాయత్నానికి వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు కారణమా? లేక మరేదైనా సమస్యలు ఉన్నాయా అనేది విద్యార్థిని వెల్లడించాల్సి ఉంది. సోదరుడికి సంబంధించిన వ్యక్తిగత వ్యవహారంలో మనస్థాపం చెంది ఆత్మహత్యకు యత్నించినట్లు మరో వాదన ఉంది. పట్టణ పోలీసులు వైద్యశాలకు చేరుకొని వివరాలను సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment