అధిక యాంటీబయోటిక్స్ వినియోగం అనర్ధదాయకం
డెప్యూటీ డీఎంహెచ్‌వో పద్మావతి
నరసరావుపేట: డాక్టర్ల సలహా లేకుండా ఎవరూ యాంటిబయోటిక్స్ మందులు వినియోగించకూడదని డెప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ పద్మావతి పేర్కొన్నారు. శనివారం జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయ ఆవరణ నుంచి వరల్డ్ యాంటి మైక్రోబయాల్ రిసిస్టెన్స్ అవేర్‌నెస్ వీక్(డబ్ల్యుఏఏడబ్ల్యు) ర్యాలీ నిర్వహించారు. పద్మావతి మాట్లాడుతూ యాంటిబయోటిక్స్‌ను గుడ్డిగా తీసుకోవటం వలన సహజంగా దేశంలో ఉండే రిసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుందని హెచ్చరించారు. చిన్న జబ్బులకు సైతం యాంటిబయోటిక్స్ తీసుకోవటం ఏమాత్రం సముచితం కాదు అన్నారు. ప్రతి ఒక్కరూ ఆహారం తీసుకునేముందు చేతులు శుభ్రంగా చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ గీతాంజలి, ఎన్‌సీడీ పీవో ఎస్.రాజరాజేశ్వరి, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment