ఊసరవెల్లికి మించి..!
మాచర్ల నియోజకవర్గంలో ఓ ఎస్సై ఊసరవెల్లికి మించి రంగులు మారుస్తున్నాడు. 2009 బ్యాచ్‌కు చెందిన ఆయన ఎప్పుడో ఉద్యోగోన్నతి పొందాలి. అవినీతి ఆరోపణలు, అక్రమాల వల్ల సీఐ కాలేకపోయాడు. ఉద్యోగోన్నతికి తీవ్రమైన చార్జి మెమో అడ్డంకిగా ఉంది. దాన్ని తొలగించాలంటే అధికార పార్టీ ఎమ్మెల్యే రెకమెండేషన్ అవసరం. దానికోసం పడరాని పాట్లు పడుతున్నాడు. సంబంధంలేని కేసుల్లోనూ తలదూరుస్తున్నాడు. ఎక్కడో మారుమూల స్టేషన్‌లో పనిచేసే ఆయన మాచర్ల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసుల్లో ముద్దాయిలను అరెస్ట్‌లు చేస్తున్నాడు. ఇదంతా ఉన్నతాధికారులకు తెలియకుండా ప్రజాప్రతినిధి మెప్పు కోసం చేస్తున్నాడట. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావును తానే అరెస్ట్ చేశానంటూ గత ప్రభుత్వంలో అడిగినవారికి, అడగనివారికి చెప్పుకున్నాడు. ఆ ప్రభావం తన పోస్టింగ్‌లపై ఉండకూడదని, ఇప్పుడు వైఎస్సార్ సీపీ వారిపై ఇష్టానుసారంగా వేధింపులకు పాల్పడుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment