నేడు గుంటూరుకు సీఎం చంద్రబాబు
గుంటూరు వెస్ట్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశామని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. గురువారం స్థానిక స్తంభాలగరువులోని చేబ్రోలు హనుమయ్య కంపెనీ ప్రాంగణంలో ఎస్పీ సతీష్ కుమార్, జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ శుక్రవారం నరెడ్కో ప్రాపర్టీ షోకు ముఖ్యఅతిథిగా సీఎం హాజరవుతున్నారని వెల్లడించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, అడిషనల్ ఎస్పీ సుప్రజా, ఆర్‌అండ్‌బి ఎస్‌ఈ శ్రీనివాసరావు, ఈఈ విశ్వనాథరెడ్డి పాల్గొన్నారు.
పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): సీఎం పర్యటన దృష్ట్యా పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సతీష్‌కుమార్ సూచించారు. హెలిపాడ్ నుంచి చేబ్రోలు హనుమయ్య కంపెనీ సభ ప్రాంగణం వరకు ట్రయల్ కాన్వాయ్‌లో ప్రయాణించి భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. ఏఎస్పీలు కె.సుప్రజ (క్రైం), హనుమంతు (ఏఆర్), ఎస్‌బీ డీఎస్పీ బి.సీతారామయ్య పాల్గొన్నారు.
సిబ్బందికి కమిషనర్ ఆదేశాలు
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): చేబ్రోలు హనుమయ్య కంపెనీ ప్రాంగణంలో శుక్రవారం జరిగే నరెడ్కో ప్రాపర్టీ షో ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హాజరుకానున్న నేపథ్యంలో హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు నగరపాలక సంస్థ చేపట్టాల్సిన పారిశుద్ధ్య పనులను, రోడ్ల ప్యాచ్ వర్క్‌లను పక్కాగా చేపట్టాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రజారోగ్య, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం కమిషనర్ హెలిప్యాడ్ నుంచి సభ జరిగే హనుమయ్య కంపెనీ వరకు అధికారులతో కలిసి పర్యటించారు. తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. సీఎం పర్యటన మార్గంలో విధుల నిర్వహణకు ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించాలని ఆయా విభాగాధిపతులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్‌ఈ నాగమల్లేశ్వరరావు, సిటీ ప్లానర్ రాంబాబు, సీఎంఓహెచ్ డాక్టర్ అమృత పాల్గొన్నారు.
కలెక్టర్ నాగలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment