‘ముక్కోటి’ ఆశలతో..
మంగళగిరి (తాడేపల్లిరూరల్): వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంగళగిరి నగరంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం ముక్కోటి ఉత్సవాలకు సుందరంగా ముస్తాబైంది. విద్యుద్దీప కాంతుల్లో ధగధగలాడుతోంది. శ్రీహరిని కొలిచేందుకు భక్తులు ముక్కోటి ఆశలతో సంసిద్ధులయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి స్వామి ఉత్తర ద్వారం నుంచి గరుడ వాహనంపై దర్శనభాగ్యం కల్పించనున్నారు. ఆలయ ఈఓ రామకోటిరెడ్డి మాట్లాడుతూ ముక్కోటికి తరలిరానున్న భక్తుల కోసం అన్ని ఏర్పాట్లూ చేశామని, సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిచ్చి స్వామి దర్శనంతో పాటు శంఖు తీర్థం ఎలాంటి ఇబ్బంది లేకుండా పంపిణీ చేసేలా చూస్తామని స్పష్టం చేశారు. రెండు రోజుల పాటు భక్తులకు శంఖు తీర్థం అంద జేస్తామని చెప్పారు.
ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు
ఉత్సవ ఏర్పాట్లను దేవదాయశాఖ రీజినల్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్, డెప్యూటీ కమిషనర్ లీలాకుమార్ ఆలయ కార్యనిర్వహణాధికారి రామకోటిరెడ్డితో కలిసి గురువారం పరిశీలించారు. సూచనలు చేశారు. గుంటూరు లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ రవికుమార్, డీఎస్పీ మురళీకృష్ణ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. బందోబస్తుకు 330 మంది పోలీస్ సిబ్బందిని కేటాయించినట్టు మంగళగిరి సీఐ వినోద్‌కుమార్ తెలిపారు. అలాగే కొలనుకొండ, అమరావతి కరకట్ట వెంబడి ఉన్న ఇస్కాన్ ఆలయాలతోపాటు పెనుమాకలోని వేకటేశ్వరస్వామి గుడి, సీతానగరం విజయకీలాద్రిలో ముక్కోటి వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
శ్రీహరిని కొలిచేందుకు సిద్ధమైన భక్తజనం ముస్తాబైన ఆలయాలు విద్యుద్దీప కాంతుల్లో ధగధగ
Comments
Please login to add a commentAdd a comment