అమూల్ పాల కేంద్రాన్ని సందర్శించిన ప్రిన్సిపల్ సెక్రటర
అమరావతి: జూపూడి అమూల్ పాలవెల్లువ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన అమూల్ పాల కేంద్రాన్ని గురువారం రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.ఎం.నాయక్ సందర్శించారు. ప్రస్తుతం ఎన్ని లీటర్ల పాల సేకరణ జరుగుతుందని, గతం కంటే ఎంత పెరిగిందని పాల కేంద్రం నిర్వాహకులను ప్రశ్నించారు. గతంలో కాస్త తక్కువగా ఉన్నా ప్రస్తుతం 3 వందల లీటర్ల పాలు సేకరిస్తున్నామని తెలిపారు. పశువుల పెంపకం, మేత, దాణా లభ్యత గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ అడిషనల్ డైరెక్టర్ కోటిరత్నం, అసిస్టెంట్ డైరెక్టర్ వెంకట్రామయ్య, పశు వైద్యాధికారి చరణ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment