కోతుల పట్టివేత
మాచర్ల రూరల్: పట్టణంలో కోతుల బెడదతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. నివాసాల్లోకి వచ్చి నిత్యావసర వస్తువులు, ఇతర సామగ్రిని వానరాలు తీసుకెళుతున్నాయి. చిన్నారులను, పాదచారులను గాయపరుస్తూ స్థానికులను ఇబ్బంది పెడుతున్నాయి. కోతుల బెడదపై గత నెల 29వ తేదీన ‘సాక్షి’లో ప్రచురించిన కథనంతో పురపాలక అధికారులు స్పందించారు. మున్సిపల్ చైర్మన్ పోలూరి నరసింహారావు, కమిషనర్ ధూళిపాళ్ళ వేణుబాబు తగిన చర్యలు చేపట్టారు. సంబంధిత సిబ్బందిని పిలిపించి శుక్రవారం 70 కోతులకు పైగా పట్టుకొని అడవుల్లో విడిచిపెట్టేందుకు ఏర్పాట్లు చేశారు. పట్టణంలో ఎక్కడా కోతులు లేకుండా చర్యలు చేపడుతున్నట్లు కమిషనర్ చెప్పారు. కార్యక్రమంలో ఒకటవ వార్డు కౌన్సిలర్ గట్లా కోటిరెడ్డి, దస్తగిరి, శ్రీనివాసరావు తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment