హామీలు నెరవేర్చేలా జీవోలు విడుదల చేయాలి
నరసరావుపేట: గతంలో సమ్మె సందర్భంగా అప్పటి సర్కారు ఇచ్చిన హామీల మేరకు కూటమి ప్రభుత్వం జీవోలు విడుదల చేయాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా గౌరవాధ్యక్షులు షేక్ శిలార్ మసూద్ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల ఎదుట చేపట్టిన రిలే దీక్షలలో భాగంగా స్థానిక మున్సిపల్ ఆఫీసు ఎదుట శిబిరాన్ని జిల్లా కోశాధికారి డి.శివకుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా మసూద్ మాట్లాడుతూ.. తమ డిమాండ్ల సాధనకోసం మున్సిపల్ కార్మికులు గత ప్రభుత్వంలో 17రోజుల పాటు సమ్మె చేస్తే అప్పటి అధికారులతో యూనియన్‌కు ఒప్పందం కుదిరిందన్నారు. ఈ మేరకు ప్రస్తుత జీవోలు విడుదల చేయాల్సి ఉందన్నారు. ఇంజినీరింగ్ విభాగంలో కార్మికులు కొద్ది జీతాలతో పనిచేస్తున్నారని తెలిపారు. వారికి జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. తాము చేసే డిమాండ్లు న్యాయమైనవి అన్నారు. ఈ ప్రభుత్వంలో చలనం లేదని, ఒకసారి గుర్తు చేయాలని రిలేదీక్షలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం చలించకపోతే సమ్మె చేయటానికై నా సిద్ధమేనని తెలిపారు. రాజకీయ వేధింపులు అధికమయ్యాయని, అక్రమ తొలగింపులు ఆపాలని కోరారు. సోమశేఖర్, ధూపం నాగభూషణం, షేక్ గౌస్‌బాషా, పిల్లి రమేష్, సత్తెనపల్లి నాగేశ్వరరావు, శివరాత్రి కోటేశ్వరరావు, షేక్ ఖాసిం, సయ్యద్ కరీం, షేక్ ఖాదర్, ఇంద్రయ్య, గూడ సామ్రాజ్యం, రమణ, షేక్ షైలు, కె.సమాధానం, ఏసుపోగు మల్లేశ్వరి దీక్షలో పాల్గొన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ ఎం. జస్వంతరావుకు వినతిపత్రం అందజేశారు. యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు షేక్ చిన్న అల్లా బక్షు, కార్మికులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment