పక్కాగా వ్యయ రిజిస్టర్‌ నిర్వహణ | Sakshi
Sakshi News home page

పక్కాగా వ్యయ రిజిస్టర్‌ నిర్వహణ

Published Sat, Apr 20 2024 1:25 AM

- - Sakshi

అరకు పార్లమెంట్‌ వ్యయ పరిశీలకుడు గురుకరణ్‌సింగ్‌

పార్వతీపురం: షాడో వ్యయ రిజిస్టర్‌ను పక్కాగా నిర్వహించాలని అరకు పార్లమెంట్‌ నియోజకవర్గం వ్యయ పరిశీలకుడు గురు కరణ్‌సింగ్‌ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలో వ్యయ నమోదుపై సహాయ వ్యయ పరిశీలకులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల పోటీల్లో ఉన్న అభ్యర్థులు ప్రచారంలో భాగంగా నిర్వహించే ర్యాలీ లు, సమావేశాలు, ఇతర కార్యక్రమాలపై దృష్టి సారించాలని చెప్పారు. కాఫీ, టీ, తాగునీటి వంటి అంశాలతో సహా వాహనాల వినియోగం తదితరాలను పరిశీలించాలని స్పష్టం చేశారు. ఎక్కడా ఎలాంటి అశ్రద్ధ చేయరాదని ఆదేశించారు. అనుమతులు పొందిన వాహనాల వివరాలు నోడల్‌ అధికారి వద్ద ఉండాలని వివరించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌, అరకు పార్లమెంట్‌ నియోజకవర్గం సహా య రిటర్నింగ్‌ అధికారి ఎస్‌ఎస్‌ శోభిక, వ్యయవిభా గం నోడల్‌ అధికారి, జిల్లా సహకార అధికారి పి. శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

కంట్రోల్‌ రూమ్‌ సందర్శన

జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను అరకు పార్లమెంట్‌ నియోజకవర్గం వ్యయ పరిశీలకులు గురుకరణ్‌సింగ్‌ శుక్రవారం సందర్శించారు. కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి విభాగం, మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిట రింగ్‌ సెల్‌, సోషల్‌ మీడియా విభాగం, వ్యయ విభా గం, ఫిర్యాదుల విభాగం, చెక్‌పోస్టుల పర్యవేక్షణ, నియంత్రణ తదితర విభాగాలను పరిశీలించారు. కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ పనితీరును ఆయనకు జాయింట్‌ కలెక్టర్‌ వివరించారు. అనంతరం కలెక్టర్‌ చాంబర్‌లో కలెక్టర్‌, అరకు పార్లమెంట్‌ నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి నిషాంత్‌కుమార్‌ను వ్యయ పరిశీలకుడు గురుకరణ్‌ సింగ్‌ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ జి.కేశవనాయుడు, ఎన్‌సీసీ నోడల్‌ అధికారి ఎం.డి గయాజుద్దీన్‌, సోషల్‌ మీడియా నోడల్‌ అధికారి సాయికుమార్‌, ఎంసీఎంసీ నోడల్‌ అధికారి ఎల్‌.రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement