12 కేసుల్లో నిందితుడిపై పీడీయాక్ట్
విజయనగరం క్రైమ్: గడిచిన మూడేళ్లలో 12 కేసుల్లో నిందితుడిగా అరెస్ట్ అయిన 22 ఏళ్ల బండి రాజీవ్ అలియాస్ డాడీపై కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ఎస్పీ వకుల్ జిందాల్ పీడీయాక్ట్ అమలుచేశారు. ఈ విషయాన్ని ఆదివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. చట్టాన్ని తరచూ ఉల్లంఘిస్తూ, ప్రజాశాంతికి భంగం కలిగిస్తూ, సమాజానికి ప్రమాదకరంగా మారుతూ, భౌతిక దాడులకు పాల్పడుతూ, పలు కేసుల్లో నిందితుడిగా అరెస్ట్ అయిన పట్టణశివారు పూల్‌బాగ్ కాలనీకి చెందిన బండి రాజీవ్ అలియాస్ డాడీ అనే 22 ఏళ్ల వ్యక్తిపై పీడీయాక్ట్ ప్రయోగించి ముందస్తు నేర నియంత్రణ చర్యల్లో భాగంగా నిర్బంధించి, విశాఖ కేంద్ర కారాగారానికి తరలించామని ఎస్పీ తెలిపారు. చెడువ్యసనాలకు అలవాటు పడి, ప్రజల పట్ల అహంకారంతో దురుసుగా ప్రవర్తిస్తూ, ఇతరులకు హానికలిగించే విధంగా చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ, భౌతిక దాడులకు పాల్పడుతూ, గత మూడేళ్లలో విజయనగరం వన్‌టౌన్, టూటౌన్, రూరల్ పోలీసుస్టేషన్‌ల పరిధిలో 12 కేసుల్లో నిందితుడిగా అరెస్ట్ అయ్యాడని వివరించారు. నేరాల నియంత్రణకు జిల్లా పోలీసుశాఖ చేపడుతున్న ముందస్తు చర్యల్లో భాగంగా పీడీయాక్ట్‌ను అమలుచేయాలని కోరుతూ టూటౌన్ పోలీసులు జిల్లా పోలీసు కార్యాలయానికి ప్రతిపాదనలు పంపించారన్నారు. వాటిని సిఫార్స్ చేస్తూ కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు ప్రతిపాదనలు పంపామన్నారు. వివిధ క్రిమినల్ కేసుల్లో అరెస్టు చేసిన నిందితులపై నిరంతరం నిఘా ఉంటుందని, ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టప్రకారం కఠినచర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
ఎస్పీ వకుల్ జిందాల్
Comments
Please login to add a commentAdd a comment