పోరాటానికి సిద్ధం
బొబ్బిలి: పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో యూటీఎఫ్ స్వర్ణోత్సవాల మహాసభ ఆదివారం జరిగింది. సభలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె.విజయగౌరి మాట్లాడుతూ విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు సవాళ్లుగా మారుతున్నాయని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితి నుంచి బయటపడేందుకు భవిష్యత్లో మరిన్ని పోరాటాలు సమష్టిగా చేసేందుకు సిద్ధమన్నారు. అనంతరం పలువురు ఉపాధ్యాయులను సత్కరించారు. మహాసభలో యూటీఎఫ్ కార్యవర్గ సభ్యుడు ఆనెం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి జేఏవీ ఈశ్వరరావు, జిల్లా సహాధ్యక్షుడు ప్రసన్నకుమార్, కార్యదర్శి కేశవరావు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment