●చివరి ప్రయత్నం
కుమ్మరిగుంటలో టమాటో, అరటి తోటల్లో సంచరిస్తున్న ఏనుగుల గుంపు
కొమరాడ: ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తే చేతికి వచ్చే సమయంలో గజరాజుల గుంపు సంచారంతో పంటనాశనం అవుతోందని రైతులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. పగలంతా ఏనుగులు ఆర్తాం కొండపైకి వెళ్తాన్నాయి. రాత్రిపూట పంటపొలాల్లో సంచరిస్తున్నాయి. పదిహేను రోజులుగా కుమ్మరిగుంట, కందివలస గ్రామాల్లో ఏనుగులు సంచరిస్తున్నాయి. అయితే కొమరాడ మండలంలోని కుమ్మరిగుంట, గంగిరేగువలస, స్వామినాయుడు, కందివలస, కళ్లికోట, దుగ్గి, గుణానుపురం తదితర గ్రామల్లో కూరగాయల సాగు ఎక్కువగా ఉంది టమాటో, క్యాబేజీ, చిక్కుడు, వంగతో పాటు జామ, బొప్పాయి, అరటి లాంటి వాణిజ్యి పంటలు పండుతున్నాయి. పంట చేతికి వచ్చే సమయంలో గజరాజులు పొలాల్లో సంచరించడం వల్ల పంటలు నాశనమవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి గజరాజులను తరలించే ఏర్పాట్లు అధికారులు చేయాలని కోరుతున్నారు.
పట్టించుకోని అటవీశాఖ సిబ్బంది
ఆందోళన వ్యక్తం చేస్తున్న అన్నదాత
Comments
Please login to add a commentAdd a comment