జిల్లాలో మహిళలను రక్తహీనత భయపెడుతోంది. ముఖ్యంగా 10 నుంచి 19 ఏళ్ల వయసు గల బాలికల్లో సగానికి సగం మందిలో రక్తహీనత నెలకొంది. గర్భిణుల్లోనూ ఇదే పరిస్థితి. సాధారణ మహిళలూ రక్తహీనతతో బాధపడుతున్నారు.
మహిళల్లో
పెరుగుతున్న
●రాకోడు పీహెచ్‌సీ పరిధిలోని పినవేమలి గ్రామానికి చెందిన ఓ గర్భిణికి హెచ్‌బీ 7.8 గ్రాములు ఉండడంతో పీహెచ్‌సీలో రక్తం పెరగడానికి ఆమెకు సుక్రోజ్ ఇంజక్షన్ వైద్య సిబ్బంది ఎక్కించారు.
●బొండపల్లి మండలంలోని ఓ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 15 ఏళ్ల బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా హెచ్‌బీ
8.5 గ్రాములు ఉన్నట్టు గుర్తించారు.
●గంట్యాడ మండలంలోని
ఓ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 14 ఏళ్ల బాలికకు వైద్య సిబ్బంది హిమోగ్లోబిన్ పరీక్ష ఇటీవల నిర్వహించారు. హెచ్‌బీ 8 గ్రాములు ఉన్నట్టు నిర్ధారించారు.
Comments
Please login to add a commentAdd a comment