పీజీఆర్‌ఎస్ జిల్లా నోడల్ అధికారిగా రామ్‌గోపాల్
పార్వతీపురం: సెట్విజ్ సీఈఓ బి.రామ్‌గోపాల్‌ను ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్) జిల్లా నోడల్ అధికారిగా నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు చేశారు. ప్రభుత్వం పీజీఆర్‌ఎస్‌కు ప్రత్యేక గుర్తింపు ఇన్న నేపధ్యంలో నోడల్ అధికారిగా తనపై కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతలను అప్పగించారని, అంకిత భావంతో పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చేందుకు కృషిచేస్తానని రామ్‌గోపాల్ ఈ సందర్భంగా తెలిపారు.
స్వచ్ఛ సుందరంగా పార్వతీపురం అభివృద్ధి
● కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్
పార్వతీపురం: జిల్లాకేంద్రం పార్వతీపురం పట్టణాన్ని స్వచ్ఛ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఆయన కలెక్టరేట్ నుంచి స్వచ్ఛ సుందర పార్వతీపురంపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిశుభ్రతకు మారుపేరుగా పార్వతీపురాన్ని నిలపాలని అధికారులకు సూచించారు. పరిశుభ్రతపై ప్రజలకు మరింత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. స్వచ్ఛ పార్వతీపురం కార్యక్రమానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అధికారులు పట్టణంలోని ఒక్కో కూడలిని దత్తత తీసుకుని సామాజిక బాధ్యతగా అభివృద్ధి చేయాలని సూచించారు. ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
21న జిల్లా దివ్యాంగుల
రాష్ట్ర క్రికెట్ జట్టు ఎంపిక
పార్వతీపురంటౌన్: ఈ నెల 21 జిల్లా దివ్యాంగుల రాష్ట్ర క్రికెట్ జట్టును ఎంపిక చేయనున్నట్లు దివ్యాంగుల క్రికెట్ క్రీడాభివృద్ధి రాష్ట్ర సెక్రటరీ నాగురు హుస్సేన్ రాజా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దివ్యాంగుల క్రికెట్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ తొలిసారిగా డిసెంబర్ 8వ తేదీ నుంచి 11 వరకు విశాఖపట్నంలోని గాజువాకలో గల హిందుస్థాన్ జింక్ మైదానంలో దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 21న పార్వతీపురం మన్యం జిల్లా జిల్లా జట్టు ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. జట్టు ఎంపికకు వచ్చే క్రీడాకారులు తెల్ల దుస్తులతో హాజరు కావాలని కోరారు. ఆసక్తి గల దివ్యాంగ క్రీడాకారులు పార్వతీపురంలో గల జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ప్రాంగణంలో 9 గంటలకు హాజరు కాగలరని తెలిపారు. ఆధార్ కార్డు, దివ్యాంగుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా తీసుకురావాలని తెలియజేశారు. ఆసక్తిగల క్రీడాకారులు మరిన్ని వివరాలకు ఫోన్ 85009 98512, 9959078682, 6374743730నంబర్లను సంప్రదించాలని సూచించారు.
గిరిజన హక్కులు
కాపాడాలి
● గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి
పార్వతీపురంటౌన్: జీఓ నంబర్ 3 పునరుద్ధరణ, 1/70,పీసా చట్టం పక్కాగా అమలు చేసి, గిరిజన చట్టాలు, గిరిజన హక్కులు కాపాడాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరుతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులకు నష్టం చేసే నిర్ణయాలు, ఆలోచనలు మానుకోవాలని కోరారు. జిల్లా ఏర్పాటైన తర్వాత పార్వతీపురం ఐటీడీఏ మనుగడ ప్రశ్నర్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. జీఓ నంబర్ 3 పునరుద్ధరణకు ముఖ్యమంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరారు.
‘అపార్’ నమోదులో అవస్థలు
ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న అపార్ ప్రక్రియ నమోదుకు గిరిజన విద్యార్థులు వారి తల్లిదండ్రులు అనేక అవస్థలు పడుతున్నారని, ఆ అవస్థలు తీర్చి ప్రక్రియ సులువుగా, సక్రమంగా జరిగేలా కలెక్టర్, ఐటీడీఏ పీఓలు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో గిరిజన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆర్థిక, సామాజిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అపార్ ప్రక్రియ గిరిజన విద్యాసంస్థల్లోనే నేరుగా జరిగే విధంగా ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment