సీతంపేట: వందశాతం సబ్సిడీపై రైతులకు ఆయిల్‌పామ్ మొక్కలు సరఫరా చేయనున్నట్లు ఉద్యానవనాధికారి పేడాడ జయశ్రీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె సీతంపేట ఏజెన్సీలో ఈ పంటను మార్కెటింగ్ చేయడానికి శాంతి ఆయిల్‌పామ్ కంపెనీ వచ్చిందని పేర్కొన్నారు. 3 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఈ పంట పండుతుందని, నీటి సదుపాయం తప్పనిసరిగా ఉండాలన్నారు. ఇండియన్ వైరెటీ మొక్క రూ.133, ఎక్స్‌పోర్టెడ్ వైరెటీ ఽమొక్క ధర రూ.193 ఉంటుందన్నారు. అయితే సాగుచేసే రైతులకు పూర్తి ఉచితంగా మొక్కలను కంపెనీ సరఫరా చేస్తుందని స్పష్టం చేశారు. వాటిలో అంతర్‌పంటలు వేసుకోవడానికి ప్రభుత్వం రూ.2100 సహాయం చేస్తుందని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు తమ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment