సర్వేజనా సురక్ష..
–8లో
మిల్లు తిప్పి ఉపాధి కల్పించండి
అక్రమ లాకౌట్‌లో ఉన్న జూట్‌మిల్లును తిప్పి కార్మికులకు ఉపాధి కల్పించాలని కార్మిక సంఘాల నాయకులు కోరారు.
బుధవారం శ్రీ 20 శ్రీ నవంబర్ శ్రీ 2024
వరిపంట ధ్వంసం
కొమరాడ: మండల ప్రజలు, రైతులను గజరాజుల బాధలు వీడడం లేదు ఇటీవల కుమ్మరిగుంట, రాజ్యలక్ష్మీపురం, కందివలస తదితర గ్రామల్లో సంచరించి వాణిజ్య పంటలు ధ్వంసం చేసిన ఏనుగుల గుంపు సోమవారం అర్ధరాత్రి విక్రంపురం నుంచి డంగభద్ర గ్రామానికి వెళ్లే రహదారిపై సంచరించాయి. ఈ సందర్భంగా రహదారి పక్కనే పొలాల్లో కోసి ఉన్న వరికుప్పలను ధ్వంసం చేశాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తే ఇలా ఏనుగుల వల్ల నాశనం కావడంతో పంటను చూస్తూ వాపోతున్నారు. ఈ ప్రాంతం నుంచి గజరాజులు గుంపును ఒడిశా అడవుల్లోకి తరలించాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు. అటవీశాఖ అధికారులు కూడా ఏనుగుల సంచారంపై సమాచారం ఇస్తే పొలాల్లోకి వెళ్లకుండా జాగ్రతగా ఉంటామని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆధార్ అనుసంధానం తప్పనిసరి
విజయనగరం అర్బన్: కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 60 శాతం పోస్టు మెట్రిక్, ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్‌లను బ్యాంకు ఖాతాల్లో జమచేసేందుకు ఆధార్ అనుసంధానం తప్పనిసరని జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి రామానందం మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమీప గ్రామ/వార్డు సచివాలయాల వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్/వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు, పోస్టాఫీస్ వారిని సంప్రదించి ఎన్‌పీసీఐ అనుసంధానం చేసుకోవాలని సూచించారు. బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం కాకపోతే డబ్బులు జమకావన్నారు.
చెరకు టన్ను రూ.3151
● మద్దతుధర ప్రకటించిన సంకిలి ఈఐడీ చక్కెర కర్మాగారం
● ఈనెల 20 నుంచి క్రషింగ్ ప్రారంభం
రేగిడి: మండలంలోని సంకిలి ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారం యాజమాన్యం చెరకు రైతులకు తీపికబురు చెప్పింది. ఈ నెల 20 నుంచి చెరకు క్రషింగ్ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. కర్మాగారం వద్ద మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీనియర్ అసోసియేటివ్ వైస్ ప్రెసిడెంట్ వి.పట్టాభిరామిరెడ్డి మాట్లాడారు. ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారం 2024–25 క్రషింగ్ సీజన్‌కు సంబంధించి టన్ను చెరకకు రూ.3,151లు మద్దతు ధర చెల్లిస్తామని వెల్లడించారు. గత ఏడాది కంటే టన్నుకు రూ.71లు పెంచినట్టు పేర్కొన్నారు. క్రషింగ్ సీజన్ అనంతరం రైతులకు ప్రోత్సహకాలు అందజేస్తామని చెప్పారు. సమావేశంలో కేన్ డీజీఎం ఆర్.రమేష్ పాల్గొన్నారు.
స్వచ్ఛమైన గాలి నేడు పీల్చలేం. బలవర్థకమైన ఆహారం ప్రస్తుతం తీసుకోలేం. పూర్వపు రోజుల్లో చేసే కాయకష్టానికి మొగ్గు చూపలేం. జీవనశైలిలో వస్తున్న మార్పుల కారణంగా కాలుష్యంతో కూడిన గాలి..రసాయనాలు కలిసిన ఆహారం, కూర్చున్నచోట నుంచి కదలకుండా ఏసీ గదుల్లో ఉద్యోగాలు..వెరసి పిన్నవయస్సులోనే ప్రజలు ప్రాణాంతకమైన రోగాల బారిన పడుతున్నారు. అయితే ప్రాణాంతక వ్యాధులనైనా సరే ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి తగిన చికిత్స తీసుకుంటే పదికాలాల పాటు ఆరోగ్యంగా జీవించవచ్చని వైద్య నిపుణులు సూచి స్తున్నారు. అందులో భాగంగా దీర్ఘకాలిక వ్యాధులను గుర్తించి ప్రజలను ఆరోగ్యవంతులను చేసేందుకు వైద్యసిబ్బంది పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా ఎన్‌సీడీ–సీడీ 3.0 సర్వేను ఈ నెల
14న ప్రారంభించి నిర్వహిస్తున్నారు.
–సాక్షి, పార్వతీపురం మన్యం
● వ్యాధి ముందే గుర్తిస్తే.. చికిత్స సులువే!
● జిల్లావ్యాప్తంగా వైద్యసిబ్బంది చేపట్టిన క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు
● అసంక్రమణ, సంక్రమణ వ్యాధులపైనా సర్వే
● ఎన్‌సీడీ 3.0లో భాగంగా వివరాల నమోదు
జీవనశైలిలో వస్తున్న మార్పుల కారణంగా చిన్న వయస్సులోనే ప్రాణాంతకమైన వ్యాధులు కబళిస్తున్నాయి. 25 ఏళ్ల యువతకూ మధుమేహం, రక్తపోటు వంటివి వస్తున్నాయి. పట్టుమని పదేళ్లు కూడా లేని చిన్నారులను క్యాన్సర్ మహమ్మారి కలవరపెడుతోంది. క్యాన్సర్‌తోపాటు..ఇతర వ్యాధులను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి, తగిన చికిత్స అందిస్తే పది కాలాలు హాయిగా బతకవచ్చు.
18 ఏళ్లు దాటిన వారందరికీ...
నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్(ఎన్‌సీడీ) 3.0 సర్వేలో భాగంగా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్‌తోపాటు..వివిధ రకాల దీర్ఘకాలిక వ్యాధులను గుర్తించేందుకు ఇంటింటి సర్వే సాగుతోంది. వ్యాధులు తీవ్రమయ్యే వరకు గుర్తించలేని పరిస్థితి తలెత్తకుండా..18 సంవత్సరాలు నిండిన వారందరికీ పరీక్షలు చేస్తున్నారు. వ్యాధిగ్రస్తులను ప్రారంభంలోనే గుర్తించాలనే లక్ష్యంతో ఈ సర్వే సాగుతోంది. వైద్యసిబ్బంది గృహ సందర్శన చేసి మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్, మూర్ఛ, లెప్రసీ, టీబీ, సీవోపీడీ తదితర అసంక్రమణ, సంక్రమణ వ్యాధులను గుర్తిస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యాధులకు చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యాన్ని పరిశీలిస్తూ..ఏ మేరకు కుదుట పడుతున్నారనేది పరిశీలిస్తున్నారు. ప్రధానంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను అందరికీ జరపాలన్న లక్ష్యంతో ఉన్నారు. ప్రస్తుతం జిల్లాలో క్యాన్సర్ రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ లక్షణాలు త్వరగా గుర్తిస్తే వ్యాధి తీవ్రం కాకుండా జాగ్రత్త పడవచ్చని వైద్యాధికారులు చెబుతున్నారు.
7,47,991 మందికి పరీక్షల లక్ష్యం
జిల్లాలో 451 పంచాయతీలున్నాయి. వాటి పరిధిలో మొత్తం 2,98,902 గృహ సందర్శనలు చేసి..7,47,991 మందికి సర్వే ద్వారా తనిఖీలు చేపట్టనున్నామని ఎన్‌సీడీ ప్రొగ్రాం అధికారి డాక్టర్ పీఎల్ రఘుకుమార్ తెలిపారు. సర్వేలో వ్యక్తుల ఆరోగ్య వివరాలతోపాటు..ఎటువంటి ఆహారం తీసుకుంటున్నారు, ఎంత మోతాదులో తీసుకుంటున్నారు, జీవన శైలి, వ్యాయామం అలవాటుందా? వంటి వివరాలను సేకరించి ఏఎన్‌ఎంల ద్వారా ఎన్‌సీడీ మొబైల్‌యాప్‌లో నమోదు చేస్తున్నారు.
క్యాన్సర్ చికిత్స మనకు దూరమే..
ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధిని ముందుగానే గుర్తిస్తే..చాలావరకు ప్రాణాలను కాపాడవచ్చు. ఇదే సమయంలో పార్వతీపురం మన్యం జిల్లాలోగానీ, విజయనగరంలో గానీ క్యాన్సర్ చికిత్స అందుబాటులో లేదు. నిర్ధారణ పరీక్షలకు గానీ, చికిత్సకు గానీ విశాఖపట్నం వెళ్లాల్సిందే. ప్రస్తుతం జీవన శైలి కారణంగా ఎక్కువగా మహిళలు రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ బారిన పడుతున్నారు. మగవారిలోనూ నోటి క్యాన్సర్ వంటివి ఇటీవల కాలంలో ఎక్కువవుతున్నాయి. జిల్లా నుంచి అధిక సంఖ్యలో బాధితులు విశాఖకు వెళ్లి కీమో, రేడియేషన్ వంటి చికిత్సలను పొందాల్సి వస్తోంది. చికిత్స ఎక్కువ కాలం పట్టడం వల్ల ఆర్థికంగా, శారీరకంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో అందుకుతగ్గ వైద్యం అందుబాటులోకి వస్తే ఎంతో మందికి ప్రయోజనకరంగా ఉంటుంది.
ముందస్తు పరీక్షలు చేయించుకోవాలి..
జిల్లాలో ఎన్‌సీడీ సర్వే కొనసాగుతోంది. ప్రజలందరూ సహకరించి ముందస్తు పరీక్షలు చేయించుకోవాలి. అసంక్రమణ–సంక్రమణ వ్యాధులను గుర్తించేందుకు చేపడుతున్న సర్వేను వైద్యసిబ్బంది పక్కాగా నిర్వహించాలి. వ్యాధులను ముందే గుర్తిస్తే నివారణ చర్యలను సులువుగా చేపట్టవచ్చు.
– డాక్టర్ కె.విజయపార్వతి, డీఎంహెచ్‌ఓ
న్యూస్‌రీల్
గ్రామస్థాయిలో వైద్య సేవలు విస్తృతం చేయాలి
పాలకొండ రూరల్: గ్రామస్థాయిలో ఎన్‌సీడీ సర్వేను విస్తృతం చేయాలని, పక్కాగా వైద్యసేవలందించాలని డీఎంహెచ్‌ఓ కె.విజయపార్వతి అన్నారు. వ్యాధి లక్షణాలు ఉన్నవారిని గుర్తించి సరైన సేవలు అందించేలా చొరవ చూపాలని సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆమె పాలకొండ మండలంలోని ఎం.సింగుపురం పీహెచ్‌సీ పరిధిలో సర్వేను పరిశీలించి ఆరా తీశారు. ఈ సందర్భంగా అక్కడి గ్రామస్తులతో మాట్లాడి వారి ఆరోగ్య సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దీర్ఘకాలిక వ్యాధులు తీవ్రం కాకముందే జాగ్రత్తలు వహించాలని సూచించారు. 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికీ ఎన్‌సీడీ సర్వే ద్వారా వ్యాధి నిర్ధారణ చేయాలని, క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేపట్టాలని సూచించారు. ఆమె వెంట వైద్యాధికారి ఎస్.రవికుమార్, యోగీశ్వరరెడ్డి తదితరులు ఉన్నారు
Comments
Please login to add a commentAdd a comment