పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రతిపాదనలు
విజయనగరం అర్బన్: జిల్లాలోని పర్యాటక ప్రదేశాల్లో వసతుల కల్పనకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలు రూపొందించే అంశంపై జిల్లా ముఖ్యప్రణాళిక అధికారి పి.బాలాజీ, పర్యాటక అధికారి లక్ష్మీనారాయణ, తదితరులతో కలెక్టర్ మంగళవారం సమీక్షించారు.
రామతీర్థంలో వసతుల కల్పన, రామనారాయణం వద్ద ఉన్న కోనేరు అభివృద్ధికి ప్రతిపాదనలు రూపొందిస్తే పర్యటక శాఖ క్యాదర్శికి అందజేస్తానని చెప్పారు. రామతీర్థంలో మ్యూజియం, ప్యూపాయింట్, రోప్‌వే, లైటింగ్, సమీపంలోని బౌద్ధ ప్రదేశాల వద్ద వసతులు, కోనేరు, రోడ్డు విస్తరణ వంటి పనులకు ప్రతిపాదనలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సముద్రతీర పర్యాటకం అభివృద్ధిలో భాగంగా చింతపల్లి బీచ్ వద్ద ఉన్న ప్రస్తుత కాటేజీల స్థానంలో కొత్తగా పది కాటేజీల నిర్మాణం, రెస్టారెంట్, చిల్డ్రన్ పార్క్, ల్యాండ్ స్కేప్ వంటి వసతుల కల్పనకు ప్రతిపాదించాలన్నారు. తాటిపూడిలో బోట్లను నడిపేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, కాటీజీల వరకు రోప్ బ్రిడ్జి నిర్మాణం, అక్కడ ఉన్న పది ఎకరాల స్థలంలో కేఫ్‌టేరియా, బర్డ్ పార్కు, కన్వెన్షన్ హాల్, ఎంఫీథియేటర్ తదితర సౌకర్యాల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధంచేయాలన్నారు.
రామతీర్థం, చింతపల్లి, తాటిపూడిలో పర్యాటక వసతుల కల్పన
కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
Comments
Please login to add a commentAdd a comment