మరుగుదొడ్డి వినియోగం ముఖ్యం
–8లో
కొమరాడ: ప్రతి ఇంటికి మరుగుదొడ్డిని ఏర్పాటు చేసి వినియోగించుకోవాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అన్నారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని కొమరాడ మండలంలోని విక్రంపురం గ్రామంలో నిర్వహించిన జిల్లాస్థాయి కార్యక్రమంలో కలెక్టర్ మంగళవారం పాల్గొన్నారు. ముందుగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు ఆనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ బహిరంగ మలమూత్ర విసర్జన దురాచారమని సమాజం నుంచి పర్యావరణం, ఆరోగ్యం కాపాడేందుకు దురాచారాన్ని విడనాడాలని కోరారు. బహిరంగ మలమూత్ర విసర్జన ద్వారా ఆరోగ్యం చెడిపోతుందని తద్వారా డబ్బులు ఖర్చు పెడుతున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరి ప్రవర్తనలో మార్పు రావలసిన అవసరం ఉందని హితవు పలికారు. అలాగే స్వచ్ఛ సుందర పార్వతీపురాన్ని తీర్చదిద్దడంలో అందరూ అలోచించాలని అందుకు గ్రామస్థాయిలో ప్రేరణ అవసరమన్నారు. దీనికోసం సామాజిక స్పృహ కలిగిన వ్యక్తులు బాధ్యత వహించాలని కోరారు. మహిళలు, ఆడపిల్లల ఆత్మగౌరవం కోసం కచ్చితంగా మరుగుదొడ్లు వాడుకోవాలని సూచించారు. కొత్త మరుగు దొడ్లు మంజూరు ప్రక్రియ బాధ్యతను గ్రామీణ నీటి సరఫరాశాఖ తీసుకుంటుందని చెప్పారు. ప్లాస్టిక్ వాడకం, చెత్త సముచిత నిర్వహణ, చేతులు కడుక్కోవడం క్రమం తప్పకుండా పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
విక్రంపురం భేష్
గ్రామస్తులు సందరీకరణ పనులు స్వచ్ఛందంగా చేపట్టడం అభినందనీయమని విక్రంపురం మోడల్ గ్రామంగా తయారు కావడానికి అన్ని గుణాలు కలిగి ఉందని ప్రశంసించారు. అనంతరం గ్రామంలో నూతనంగా మంజూరైన మరుగుదొడ్ల ప్రతాలను లబ్ధిదారులకు కలెక్టర్ అందజేశారు. గ్రీన్ అంబాసిండర్లను సన్మానించారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా చేతులు శుభ్రం చేసుకునే పోస్టర్‌ను కలెక్టర్ విడదల చేశారు. కార్యక్రమంలో గామీణనీటి సరాఫరా అధికారి ఒ.ప్రభాకర రావు, డీపీఓ కొండలరావు, ఆర్‌డబ్ల్యూఎస్ డిప్యూటీ ఇంజినీర్ నాగేశ్వరరావు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ టి.జగన్‌మోహన్‌రావు, సర్పంచ్ కళింగి శైలజ, ఎంపీపీ శెట్టి శ్యామల, జెట్పీటీసీ ద్వారపురెడ్డి లక్ష్మి, నాయకులు కళింగి మల్లేశ్వరరావు, డి.జనార్దన రావు, ఎంపీడీవో మల్లికార్జున రావు, ఎంఈఓ నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment