డిసెంబర్ 5న నీటి సంఘాలకు ఎన్నికల నోటిఫికేషన్
పార్వతీపురం: సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికల నిర్వహణకు కొత్త షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసిందని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలపై సంబంధిత అధికారులతో కలెక్టరేట్ నుంచి గురువారం టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కొత్త షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 5న నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. అదేరోజున సాధారణ సమావేశం నిర్వహించే ప్రదేశాన్ని తెలియజేస్తామన్నారు. 11వ తేదీన ఎన్నికల అధికారి నేతృత్వంలో నీటి పంపిణీ సంఘాల (డిస్ట్రిబ్యూటరీ) ఎన్నికల సమావేశం, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల నీటి వినియోగదారుల సంఘాల అధ్యక్షులకు, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నీటి పంపిణీ సంఘాల అధ్యక్షులకు నోటీసులు జారీ చేస్తామన్నారు. 14న మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల ఎన్నికల సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment