రక్తహీనత నివారణకు ప్రత్యేక చర్యలు
● కలెక్టర్ శ్యామ్ ప్రసాద్
పార్వతీపురం: రక్తహీనత నివారణకు ప్రత్యేక చర్య లు తీసుకుంటున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్‌ప్రసాద్ అన్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌లో ‘కేంద్ర ప్రభుత్వ పరిపాల నా సంస్కరణలు, ప్రజా సమస్యల విభాగం – సుపరిపాలన విధానాలపై’ నిర్వహించిన ప్రాంతీ య సదస్సులో కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ పాల్గొన్నా రు. గురు, శుక్రవారాల్లో (రెండు రోజుల పాటు) నిర్వహించిన ప్రాంతీయ సదస్సులో ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, అస్సాం, పంజాబ్, మేఘాలయ, ఏపీ, తదితర రాష్ట్రాల నుంచి కలెక్టర్లు పాల్గొనగా.. ఆంధ్రా నుంచి పార్వతీపురం మన్యం కలెక్టర్‌కు అవ కాశం దక్కడం విశేషం. పార్వతీపురం మన్యం జిల్లాలో చేపడుతున్న రక్తహీనత నివారణ కార్యక్రమంపై (ప్రిజం 10) కలెక్టర్ వివరించారు. గ్రామస్థాయిలో రక్తహీనత నివారణ కమిటీలు ఏర్పాటు చేయడం.. రక్తహీనత గల చిన్నారులు, గర్భిణిలు, బాలింతలను దత్తత తీసుకోవడం.. సమయాను సారం రక్తహీనత బాధితులకు పౌష్టికాహారం, మందులు సరఫరా చేయడం వల్ల మెరుగైన ఫలితాలు సాధించామని చెప్పారు. స్వచ్ఛ సుందర పార్వతీపురం, మన బడి – మన తోట, తదితర కార్యక్రమాలపై వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment