ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
● జేసీ ఎస్.ఎస్.శోభిక
పార్వతీపురం: జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రి యను వేగవంతం చేయాలని, బ్యాంకు గ్యారంటీ(బీజీ)ల ను తక్షణమే అందజేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్.శోభిక రైస్ మిల్లర్లను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రైస్ మిల్లర్లతో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో రూ.168 కోట్ల మేర బీజీలు రావాల్సి ఉందని, ఆశించినంత స్థాయిలో అందలేదన్నారు. బీజీలు అందజేసిన మిల్లులకు మాత్రమే ధాన్యాన్ని పంపిస్తామని ఆమె స్పష్టం చేశారు. జిల్లాలో 2లక్షల 20వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల న్నది లక్ష్యంగా వెల్లడించారు. సోమవారం నుంచి ధాన్యం సేకరణ జరుగుతుందని, ఈ లోగా మిల్లర్ల బిజీలు అందజేయాల్సిందేనని స్పష్టంచేశారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖా ధికారి కె.రాబర్ట్‌పాల్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ పి.శ్రీనివాసరావు, లీడ్‌బ్యాంక్ మేనేజర్ జేఎల్‌ఎన్ మూర్తి, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.
అడవితల్లి విగ్రహం వద్ద
గురువుల నిరసన
పార్వతీపురంటౌన్: సమస్యలు పరిష్కరించాలంటూ గిరిజన గురుకులాల్లో అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐటీడీఏ కార్యాలయం ఎదుట మూడో రోజు శుక్రవారం దీక్షలు కొనసాగించారు. అనంత రం అడవితల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశా రు. సమస్యలు పరిష్కరించేలా పాలకుల మన సు మార్చాలని అడవి తల్లికి ప్రార్థన చేశారు. ఉద్యోగ భద్రత కల్పించి, కనీస వేతనాలు వచ్చే లా దీవించాలని కోరారు. నిరసనకు గిరిజన, విద్యార్థి సంఘాల నాయకులు పాలక రంజిత్ కుమార్, రాజు, అఖిల్, సురేష్, లోవరాజు, రామకృష్ణ, చంద్రశేఖర్, దుక్క సీతారాం తదితరులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో అవు ట్ సోర్సింగ్ ఉపాధ్యాయ, అధ్యాపక సంఘం నాయకులు దివాకర్, రమేష్, వెంకట్, జగదీశ్, మురళి, తిరుపతిరావు, శ్రీను, జ్యోతి, ఉమా, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
కిశోర బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
● సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ
పార్వతీపురం: జిల్లాలోని కిశోర బాలికలను సంపూర్ణ ఆరోగ్య వంతులుగా తీర్చిదిద్దేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ చూపాలని సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ కోరారు. సీ్త్ర శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలోని పీజీఆర్‌ఎస్ మందిరంలో కిశోర బాలికల వికాసంపై శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి శిక్షకుల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కిశోర బాలికలు ఆరోగ్యకరంగా ఉంటేనే రేపటి తరం, సమాజం ఆరోగ్యకరంగా ఉంటుందని స్పష్టం చేశారు. జిల్లాలో రక్తహీనత, నిరక్షరాస్యత, బాల్య వివాహాలు, సికిల్‌సెల్ ఎనీమియా, గర్భిణుల్లో పౌష్టికాహార లోపం వంటి సమస్యలు ఉన్నాయని, వాటిపై అవగాహన కల్పించి జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా స్థాయిలో శిక్షణ పొందిన వారు మండల, గ్రా మ స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ ఎం.ఎన్.రాణి, డీసీపీఓ సత్యనారాయణ, సెర్ప్, ఐసీడీఎస్, ఇంటర్మీడియట్ విద్య, వైద్య ఆరోగ్యం, పంచాయతీ రాజ్, ఇతర శాఖాల అధికారులు, సిబ్బంది, ఎన్జీఓలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment