పార్వతీపురం: దివ్యాంగులు, వయోవృద్ధుల సహా య ఉపకరణాల గుర్తింపు శిబిరాలను ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు నిర్వహిస్తామని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. భారత ప్రభుత్వం గుర్తించిన హైదరాబాద్‌కు చెందిన కృత్రిమ అవయవాల తయారీ కేంద్రం (అలీమ్‌కో) ద్వారా ఉపకరణాల సరఫరా జరు గుతుందన్నారు. 80 శాతం కంటే ఎక్కువ దివ్యాంగత్వం కలిగిన వారికి బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిళ్లు, మూడు చక్రాల సైకిళ్లు అందజేస్తామని తెలిపారు. వీల్ చైర్, చంక కర్రలు, కాలిపర్స్, స్మార్ట్ కేన్/చేతి కర్ర, బ్రెయిలీ కిట్, స్మార్ట్ ఫోన్స్, శ్రవణ యంత్రాలు తదితర పరికరాలు అందజేస్తామన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించే శిబిరాలకు సదరం ధ్రువీకరణపత్రం, ఆధార్ కార్డు, రెండు పాస్ ఫొటోలు, యూడీఐడీ కార్డు జిరాక్స్‌లను తీసుకుని రావాలన్నారు.
శిబిరాలు నిర్వహించే ప్రదేశాలు
ఈ నెల 26న సాలూరు మండల
ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణ
27న పాలకొండ మండల ప్రజాపరిషత్ కార్యాలయం
28న పార్వతీపురం మండల ప్రజాపరిషత్ కార్యాలయం
29న కురుపాం మండల ప్రజాపరిషత్ కార్యాలయం
Comments
Please login to add a commentAdd a comment