మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం
నేను బీటెక్ పూర్తి చేశాను. ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా రెండేళ్లు క ష్టపడి, చదివాను. మొదటి ప్ర యత్నంలోనే కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాను. రాతపరీక్ష కంటే ఫిజికల్ పరీక్షే కఠినంగా అనిపించి ంది. భవిష్యత్తులో ఎస్సై కొలువు సాధిస్తా. అమ్మానాన్న రేణుక–వెంకటేశ్వర్లు వ్యవసాయం చేస్తుంటారు.
– కడెం శ్రవణ్‌కుమార్, బోనగిరి, యాదాద్రి భువనగిరి
అమ్మానాన్న కోరిక నెరవేరింది
మా అమ్మానాన్న అనిత–కుమార్ కూలీ పనులు చేస్తూ నన్ను డిగ్రీ వరకు చదివించారు. నేను ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న వారి కోరిక నెరవేరింది. మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించడం సంతోషంగా ఉంది. భవిష్యత్తులో మరింత కష్టపడి, ఎస్సై ఉద్యోగం సాధించేందుకు ప్రయత్నిస్తా.
– కె.మహేశ్‌కుమార్, కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి
హైదరాబాద్‌లో పోస్టింగ్
మాది హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్. నాకు పోస్టింగ్ కూడా హైదరా బాద్‌లోనే వచ్చింది. చిన్న ప్పుడు పోలీస్ కావాలని అనుకునేవాన్ని. ఆ కోరిక ఈరోజు నెరవేరింది. నాన్న వ్యవసాయం చేస్తాడు. నాకు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో అమ్మానాన్న సంతోషంగా ఉన్నారు.
– కుమ్మరి శ్రీకాంత్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment