చిన్న కాళ్వేరానికి రూ.571 కోట్లు
● నీటి పారుదల శాఖ సమీక్షలో నిర్ణయం
మంథని: దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హ యాంలో చేపట్టిన చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల ప థకం పూర్తికి ప్రభుత్వం రూ.571 కోట్లు కేటాయించింది. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన నీ టిపారుదల శాఖ సమీక్షలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. ఇందులో తీసుకున్న నిర్ణయంతో సుమారు 17 ఏళ్ల తర్వాత ప్రాజెక్టు నిర్మాణం పూర్తికి అవకాశం లభించింది. ని యోజకవర్గంలోని మహదేవపూర్ మండలం బీరాసాగర్ వద్ద 2007లో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. 63 గ్రామాల్లోని 45 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా నిర్దేశించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలువలను కూడా మరమ్మతు చేయాలని నిర్ణయించారు. చిన్నకాళేశ్వరంతోపాటు కాలువల పూడికతీతతో సాగునీటి కష్టాలు తీరుతాయి.
Comments
Please login to add a commentAdd a comment