రైతు సంక్షేమంపై ఊరూరా ప్రచారం
● మంత్రి శ్రీధర్‌బాబు
బీజేపీ నాయకుల సంబురాలు
పెద్దపల్లిరూరల్: రైతు సంక్షేమానికి ప్రభుత్వం అమ లు చేస్తున్న పథకాలు, వాటితో లబ్ధిపొందిన రైతు లు, వివరాలతో కూడిన ఫ్లెక్సీలను ఊరూరా ఏర్పా టు చేయాలని మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం రాత్రి ధాన్యం కొనుగోళ్లు, రుణమాఫీ, సన్నరకాలకు బోనస్ చెల్లింపు తదితర అంశాలపై ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎ మ్మెల్యే విజయరమణారావుతో కలిసి కలెక్టర్ శ్రీహ ర్ష, అడిషనల్ కలెక్టర్ వేణు, అధికారులతో మంత్రి సమీక్షించారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం ఇస్తు న్న ప్రాధాన్యతను వివరించేలా సోషల్ మీడియాలో లబ్ధిదారులతో తీసిన వీడియో క్లిప్పింగ్‌లతో విస్తృతంగా ప్రచారం చేయాలని మంత్రి సూచించారు. డీఏవో ఆదిరెడ్డి, డీఎస్‌వో రాజేందర్, డీఎం శ్రీకాంత్‌రెడ్డి, డీఎంవో ప్రవీణ్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
గోదావరిఖని: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించడాన్ని స్వాగతిస్తూ స్థానిక ప్రధాన చౌరస్తాలో శనివారం సంబురాలు నిర్వహించారు. టపాసులు పేల్చి, మిఠాయి లు పంపిణీ చేశారు. బీజేపీకి మహారాష్ట్ర ప్రజలు ఏకపక్ష తీర్పు ఇచ్చారని నాయకులు అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర సభ్యుడు రావుల రాజేందర్, నాయకులు మామిడి రాజేశ్, గాలిపెల్లి తిరుపతి, మామిడి సంపత్, అడ్డురి రాజేశ్, సల్ల వేణురెడ్డి, వడ్లూరి రాము, వడ్డేపల్లి సదానందం, కాసిపేట శ్రీనివాస్, మేకల సతీశ్, మహిళలు పాల్గొన్నారు.
బీజేపీ బలోపేతానికి కృషి
నియోజకవర్గంలో బీజేపీని మరింత బలోపేతం చేస్తామని ఆ పార్టీ ఇన్‌చార్జి కందుల సంధ్యారాణి అన్నారు. ప్రధాన చౌరస్తాలో నిర్వహించిన విజయోత్సవాల్లో ఆమె మాట్లాడారు. నాయకులు మేర్గు హన్మంతుగౌడ్, పిడుగు కృష్ణ, జనగామ భూమన్న, కోడూరి రమేశ్, మిట్టపల్లి సతీశ్, కోమల మహేశ్, క్యాతం వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లిరూరల్: బీజేపీ పట్టణ, మండల శాఖ అధ్యక్షులు రాజ్‌గోపాల్, శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో జెండా కూడలిలో సంబురాలు ఘనంగా జరుపుకున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు సాధించిందని నాయకులు అన్నారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో నాయకులు దాడి సంతోష్, తంగెడ రాజేశ్వర్‌రావు, పోల్సాని సంపత్‌రావు, తిరుపతి, రమేశ్, రాకేశ్, ఉప్పు కిరణ్, సోడాబాబు, ముంజ రాజేందర్, పడాల శ్రీనివాస్, గుడ్ల సతీశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment