సర్కారు ఆస్పత్రిలో ల్యాపరోస్కోపీ సర్జరీ
● జీజీహెచ్‌లో తొలిసారి ఆపరేషన్
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో తొలిసారి ల్యాపరో స్కోపీ ఆపరేషన్ సేవలను బుధవారం వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. కడుపునొప్పితో బాధపడుతున్న కె.అశ్విత్(12)ను కుటుంబ సభ్యు లు ఇటీవల జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. అపెండిసైటిస్ సమస్యతో అశ్విత్ బాధపడుతున్నాడని సీనియర్ సర్జన్ శ్రీనివాస్ నిర్ధారించి ల్యాపరోస్కోపి ఆపరేషన్ చేశారు. సర్జన్లు గౌతం, అనిల్, అవినాష్, అనెస్తీషియా నర్సయ్య, భాను సాయంతో శస్త్రచికి త్స విజయవంతంగా నిర్వహించారు. జీజీహెచ్‌లో ల్యాపరోస్కోపీ సర్జరీలు అందుబాటులోకి రావడంతో నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆపరేషన్ సక్సెస్ చేసిన వైద్యులను సూపరింటెండెంట్ దయాల్‌సింగ్, సిమ్స్ ప్రిన్సిపాల్ హిమబింద్ సింగ్, హెచ్‌వోడీ అరుణ, ఆర్‌ఎంవోలు అప్పారావు, చంద్రశేఖర్ తదితరులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment