బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం
● సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసులు
పెద్దపల్లిరూరల్: బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, చిన్నతనంలోనే ఆడపిల్లలకు వివాహాలు చేస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసులు అన్నారు. స్థానిక జెడ్పీ హైస్కూల్ లో బుధవారం బాల వివాహ ముక్త్‌భారత్ సదస్సు నిర్వహించారు.జూనియర్ సివిల్ జడ్జి మంజులతో కలిసి జడ్జి శ్రీనివాసులు మాట్లాడారు. 18ఏళ్ల వయ సు నిండిన ఆడపిల్లలు, 21 ఏళ్లు నిండిన యువతకే వివాహాలు చేయాలని సూచించారు. బాల్య వివాహాల సమాచారాన్ని సమీపంలోని తహసీల్దార్, పోలీసులు, లేదా టోల్‌ఫ్రీ నంబరు15100కు ఫోన్‌చేసి సమాచారం అందించాలని జడ్జి సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు అరుణ, ప్రభుత్వ ప్లీడర్ డీవీఎస్ మూర్తి, ప్రతినిధులు శ్రీనివాస్, సంకీర్తన తదితరులు పాల్గొన్నారు.
బాల్య వివాహాలతో అంధకారం
గోదావరిఖనిటౌన్: బాల్య వివాహాలతో భవిష్యత్ అంధకారమవుతుందని జిల్లా అదనపు న్యాయమూ ర్తి శ్రీనివాసరావు అన్నారు. స్థానిక కోర్టులో జరిగిన బాల్ వివాహ్ ముక్తి భారత్ కార్యక్రమంలో జడ్జి మా ట్లాడారు. చదివే వయసులో చిన్నారులకు వివా హం చేయడం చట్టరీత్యా నేరమన్నారు. లోక్ అదా లత్ సభ్యురాలు చందాల శైలజ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment