ముత్తారం(మంథని): సమీకృత వ్యవసాయానికి పా మాయిల్ దోహదం చేస్తాయని, ఈ సాగును పెంచా లని నాబార్డ్ డీడీఎం జయప్రకాశ్, మంథని, రామగుండం ఉద్యాన శాఖ అధికారి జ్యోతి అన్నారు. స ర్వారం, మైదంబండ గ్రామాల్లోని రైతులు గుజ్జుల రాజిరెడ్డి, ఎర్రం సమ్మయ్య సాగు చేస్తున్న పామా యిల్ తోటలను బుధవారం వారు పరిశీలించారు. జిల్లాకు 2,000 ఎకరాల లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించిందని, ఈ మేరకు మొక్కలు నాటాలని సూచించా రు. అవసరమైన రైతులు డీడీలతో వచ్చి నర్సరీ నుచి మొక్కలు తీసుకెళ్లి నాటుకోవాలని తెలిపారు. వరి కోతల అనంతరం పామాయిల్ సాగు చేయా లన్నారు. పామాయిల్ ద్వారా ఏడాదికి రూ.4,200 చొప్పున నాలుగేళ్లపాటు 16,800 రాయితీని ఉద్యా న శాఖ అందిస్తుందని తెలిపారు. పామాయిల్ ఏపు గా, ఆరోగ్యంగా పెరిగేందుకు శాస్త్రవేత్తల సలహా లు, సూచనలతోపాటు ఎరువులు, నీటి యాజమా న్య పద్దతులు, సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూ చించారు. ఆసక్తి గలరైతులు ఉద్యానశాఖ అధికారి 89777 14039 నంబరులో సంప్రదించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment