
AP Elections Political Latest Updates Telugu..
6:49PM, Feb 23rd, 2024
రాజధాని కడతానంటూ గ్రాఫిక్స్‌తో చంద్రబాబు దొంగ నాటకాలు" కొడాలి నాని
- దేశంలో ఉన్న రాష్ట్ర రాజధానులన్నీ వందల ఏళ్ల క్రితం ఏర్పడి.... ఇప్పుడు మెగా సిటీలుగా మనకు దర్శనమిస్తున్నాయి.
- సొల్లు చంద్రబాబు రాజధాని నిర్మిస్తా అని ఎలా చెబుతాడు
- పొలాల్లో రాజధాని ఎలా కడతాం
- రాజధాని రైతులు ఏం త్యాగం చేశారు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప
- మద్రాస్, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ కోల్ కత్తా ఏ రాజధానిలో అయినా 150 ఎకరాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయి
- మిగిలిన 99శాతం ప్రైవేట్ ఆస్తులుగా ఉంటాయి
- 33 వేల ఎకరాలు తీసుకున్న చంద్రబాబు... పిట్టల దొర కబుర్లు చెబుతున్నాడు
- ప్రజల సమస్యలు నేరుగా పరిష్కారమయ్యే వ్యవస్థనుక్రియేట్ చేసిన జగన్ గొప్పవాడా...?
- రాజధాని కడతానంటూ గ్రాఫిక్స్ తో దొంగ నాటకాలు ఆడిన చంద్రబాబు గొప్పవాడా...?
- దేశంలో రాజధాని కట్టిన నేత ఎవరైనా ఉన్నారా....?
- ఒక్కడే రాజధాని కట్టడం అనేది సాధ్యం కాదు
- 25 లక్షల జనాభా.... పోర్టు.... అన్ని రకాల హంగులు ఉన్న వైజాగ్ లో ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన భూమి సేకరిస్తే.... మహానగరంగా అయ్యి తీరుతుంది
- వైజాగ్‌ను వ్యాపార, వర్తక, వాణిజ్య రాజధానిగా అభివృద్ధి చేస్తే..... వచ్చే సంపద ద్వారా పేద ప్రజలకు మరింత మేలు చేయొచ్చని జగన్ ఆలోచిస్తున్నారు
- ప్రజలకు మేలు చేస్తే సహించలేని చంద్రబాబు అండ్ కో ఇక్కడే రాజధాని ఉండాలని కోర్టులకు వెళ్లి స్టే తెచ్చారు
- సీఎం జగన్ రెండు లక్షల 57వేల కోట్ల రూపాయలు ...120 సార్లు బటన్ నొక్కి పేద ప్రజల ఖాతాల్లో వేశారు
- చంద్రబాబు, పవన్ కళ్యాణ్ , బీజేపీ వెయ్యి సార్లు బటన్ నొక్కి డబ్బంతా చంద్రబాబుకు చెందిన రాజదాని రైతులు ఖాతాల్లో జమ చేసేవారు
- కోట్లాదిమంది ప్రజలు ఏమైపోయినా వారికి అనవసరం
- నేనైతే సంపద సృష్టించే వాడిని, జగన్‌కు అది చేత కావడం లేదని చంద్రబాబు అంటున్నాడు
- జగన్ రాజకీయ నాయకుడి కంటే కూడా...ఓ సక్సెస్ ఫుల్ బిజినెస్ మెన్
- రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో A టు Z తెలిసిన వ్యక్తి సీఎం జగన్
06:20PM, Feb 23rd, 2024
తాడేపల్లి
కాకినాడలో టీడీపీ, జనసేన రచ్చకెక్కిన విభేదాలు
- తమకు చెప్పకుండా జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించడం పై టీడీపీ ఫైర్
- సీటు ప్రకటించకుండా కార్యాలయం ఎలా ప్రారంభిస్తారు
- చంద్రబాబు, టీడీపీకి జనసేన ఊపిరి పోసిందని ఓ అసామి మాట్లాడారు
- అలాంటి వ్యాఖ్యలు చేస్తే మేం చేతగాని వాళ్లలా చూస్తూ ఊరుకోవాలా?
- జనసేనకు బీసీల ఓట్లు అవసరం లేదా?
- కాకినాడ రూరల్ సీటును టీడీపీ ఎప్పటి నుంచో బీసీలకు కేటాయిస్తోంది
04: 44 PM, Feb 23rd, 2024
వచ్చే నెల 3 న నిర్వహించే సిద్ధం సభపై సమీక్ష
- సమీక్ష నిర్వహించిన రీజనల్ కో ఆర్డినేటర్ విజయసాయి రెడ్డి
- గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లా ఎమ్మెల్యేలు, అధ్యక్షులు, పార్టీ నేతలతో సమీక్ష
02: 55 PM, Feb 23rd, 2024
అందరూ ఆరోగ్యంగా ఉండాలి అనేది సీఎం జగన్ ఆకాంక్ష: మంత్రి జోగిరమేష్
- ప్రజలు బాగుండాలని జగన్ ఆలోచిస్తారు
- ప్రతిపక్షాలు పొత్తులు ఎలా పెట్టుకోవాలో ఆలోచిస్తున్నాయి.
- సీట్లు ఎలా పంచుకోవాలో చంద్రబాబుకి,పవన్ కళ్యాణ్ కి అర్థం కావడం లేదు.
- 2014 లో మోసం చేసినట్లు 2024 లో మళ్ళీ మోసం చేస్తారు
- సిద్ధం సభతో ప్రజలందరినీ సన్నద్ధం చేశాం
- వచ్చే ఎన్నికల్లో వార్ వన్ సైడే
- 175 సీట్లు కైవసం చేసుకుంటాం
- ప్రతిపక్షాలను కృష్ణా నదిలో కలిపేస్తాం
02: 50 PM, Feb 23rd, 2024
టీడీపీ నేత కొల్లు రవీంద్రపై పేర్ని నాని ధ్వజం
- కొల్లు రవీంద్రకు ఓటమి భయం పట్టుకుంది
- ఇంగితజ్ఞానం లేకుండా కొల్లు రవీంద్ర అబద్ధాలు చెప్తున్నారు
- పేదలకు మూడు సెంట్ల స్థలం ఇస్తానని మోసం చేశారు
- ఐదేళ్లు మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్రం ఒక్కరికీ మేలు చేయలేదు
- కొల్లు రవీంద్రలా నాటకాలాడటం మాకు రాదు
- నవయుగ సంస్థను అడ్డుపెట్టుకుని కోర్టులో అడ్డంకులు సృష్టించింది మీరు కాదా
- 2004లో పోర్టు నిర్మాణం కోసం ప్రయత్నం చేసిన వ్యక్తిని నేను
- మోసం చేసే కుటుంబం ఎవరిదో ప్రజలకు తెలుసు
- మీరు మెడికల్ కాలేజ్ తెస్తే...మేము కట్టామనడం దారుణం
- విజయవాడ నుంచి మచిలీటప్నం వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం కాదు
- కళ్లుతెరిచి అభివృద్ధిని చూడు ఒకసారి
- నీలాంటి స్థాయిలేనివాడితో...గతిలేనివాడితో నేను చర్చకు రావడమేంటి
- ఏనాడైనా పేదవాడికి మేలు చేయడానికి చంద్రబాబును కలిశావా
- మీలా దొంగ శంకుస్థాపనలు చేయడం మా వల్ల కాదు
- మీ కుటుంబం కోసం నేను మాట్లాడను...నాకు సభ్యత ఉంది
- నీకు చేతనైతే పేర్ని కృష్ణమూర్తిలా ఒక్కరోజు బ్రతికి చూపించు
- మత్స్యకార గ్రామాలను దగా చేసిన మోసగాడు కొల్లు రవీంద్ర
- ఈ డ్రామా కోర్ ఒట్టి మోసగాడు
- దళితుల పై కపట ప్రేమ చూపిస్తున్నాడు
- మా కుటుంబం గురించి వేలెత్తి చూపించే అర్హత నీకు లేదు
- మీ తప్పుడు ఆలోచనలు మచిలీపట్నంలో సాగవు
- రైతులకు భూ హక్కు కల్పించడానికి యజ్ఞం చేస్తున్న రెవిన్యూ సిబ్బందికి జగన్ అండగా ఉంటారు
- ఉడత ఊపులకు చింతకాయలు రాలవు
02: 43 PM, Feb 23rd, 2024
అమలాపురం అసెంబ్లీ సెగ్మెంట్‌లో తలలు పట్టుకుంటున్న టీడీపీ-జనసేన
- టీడీపీ-జనసేన పొత్తుతో అమలాపురం సీటు పై రాని స్పష్టత టీడీపీ
- జనసేన ఉమ్మడి అభ్యర్థి పై కొనసాగుతున్న కసరత్తు
- టీడీపీలో టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు
- టీడీపీ టికెట్ రేసులో జీఎంసీ బాలయోగి తనయుడు హరీష్ మాధుర్
- టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే చిర్ల జగదీశ్వరి, పడమట శ్యామ్, నాగబత్తుల శ్రీనివాసరావు
- అమలాపురం అసెంబ్లీ టికెట్ తమకేనని ప్రచారం చేసుకుంటున్న జనసేన
- జనసేన టికెట్ కోసం పోటీపడుతున్న శెట్టిబత్తుల రాజబాబు, డీఎంఆర్ చంద్రశేఖర్
02:33 PM, Feb 23rd, 2024
కాకినాడ రూరల్‌లో టీడీపీ వర్సెస్ జనసేన
- కాకినాడ : జనసేన తీరును తప్పుపట్టిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి భర్త సత్యనారాయణ
- నిన్న కాకినాడ రూరల్లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన జనసేన
- టికెట్ కేటాయించకుండానే పార్టీ ఆఫీస్ తెరవడం పై టీడీపీ అభ్యంతరరం
- జనసేనకు టికెట్ ఇస్తే సహకరించబోమని నిన్న టీడీపీ నేతల ప్రకటన
- ఆ ప్రకటన పై సారీ చెబుతూనే జనసేన తీరును తప్పుపట్టిన పిల్లి సత్యనారాయణ
- తమ ఇష్టం వచ్చినట్లుగా కార్యక్రమాలు చేస్తే ఎలా అంటున్న పిల్లి వర్గం
- తమ కుటుంబం పై తప్పుగా చెప్పి టికెట్ రాకుండా దుష్టశక్తులు కుట్ర చేశాయన్న పిల్లి సత్యనారాయణ
02:26 PM, Feb 23rd, 2024
జనసేనను ఓడించాలన్న ఆలోచన మాకు రాకూడదని దేవుడ్ని కోరుతున్నాం
- కాకినాడలో జనసేనపై మాజీ ఎమ్మెల్యే జంట ఫైర్
- జనసేన వైఖరిపై ఫైర్ అవుతున్న మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మీ దంపతులు.
- సీటు ప్రకటించకుండా.. మమ్మల్ని కలుపుకోకుండా జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించింది.
- జనసేన తీరు వల్లే మా క్యాడర్ నిన్న రియాక్ట్ అయ్యారు
- తెలుగు దేశం పార్టీకీ.. చంద్రబాబు కు మా జనసేన ఊపిరి పోసిందని ఓ ఆసామీ మాట్లాడారు.
- ఆ వాఖ్యలకు మేము చేతకాని వాళ్లలా ఊరుకోవాలా?
- పవన్ కాకుండా చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికా? మేము వచ్చామని మా దగ్గర అంటే ఊరుకుంటామా?
- జనసేనను ఓడించాలన్న ఆలోచన మాకు రాకూడదని భగవంతున్ని కోరుకుంటున్నాను.
మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మీ భర్త పిల్లి సత్యనారాయణ వ్యాఖ్యలు
01:55 PM, Feb 23rd, 2024
బీసీలకు జనసేన సీటెక్కడ?
- బీసీలను పక్కన పెట్టి ఓసీలకు సీటు ఇస్తామంటే నియోజకవర్గంలో బీసీలు ఒప్పుకోవడం లేదు
- ఎప్పటీ నుండో టీడీపీ కాకినాడ రూరల్ సీటు బీసీలకు కేటాయిస్తోంది
- బీసీగా ఇప్పుడు నాకు సీటు ఇవ్వరూ
- మరి బీసీలకు జనసేన ఎక్కడ నుండి సీటు ఇస్తారు?
- బీసీలకు ఓట్లు లేవా.. ఈ నాయకులను(జనసేన) బీసీలు నెగ్గించవద్దా?
- మేమేదో తప్పు చేశామని సీటు రానివ్వమని జనసేన నేతలు చెప్పడం తప్పు.
కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మీ వ్యాఖ్యలు
01:39 PM, Feb 23rd, 2024
ఎన్నికల షెడ్యూలపై లేటెస్ట్ అప్‌డేట్
- మార్చి 13 తర్వాత ఏ క్షణానైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల
- ఎన్నికల ఏర్పాట్లపై చివరి దశకు చేరుకున్న ఎన్నికల కమిషనర్ల రాష్ట్రాల పర్యటన
- మార్చి 12, 13 న జమ్ము కశ్మీర్ పర్యటన అనంతరం షెడ్యూల్ విడుదల చేసే అవకాశం
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డివిజన్లో ఏర్పాటుచేసిన ఎన్నికల సంఘం
- దేశవ్యాప్తంగా 7 విడతల్లో పోలింగ్ నిర్వహించే అవకాశం
01:23 PM, Feb 23rd, 2024
ఎమ్మిగనూరులో బీసీల షాక్
- కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టిడిపికి బీసీలు షాక్
- ఎమ్మిగనూరు ఎమ్మెల్యే టీడీపీ టికెట్ బీసీ అభ్యర్థి డాక్టర్ మచ్చని సోమ్‌నాథ్‌కే ఇవ్వాలని పట్టు
- బీసీల ఆత్మీయ సమ్మేళనంలో బీసీ కులాల తీర్మానం
- వైఎస్సార్సీపీ బీసీలకు టికెట్ ఇచ్చి సామాజిక న్యాయం చేసిందని గుర్తు చేసిన బీసీలు
12:58 PM, Feb 23rd, 2024
చంద్రబాబు రాజకీయ రాక్షసుడు: సీఎం జగన్
- ఒంగోలు పేదల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబుపై సీఎం జగన్ ఫైర్
- చంద్రబాబు తన హయాంలో పేదలకు సెంట్ స్థలం ఇవ్వలేదు
- ఈ ప్రభుత్వం పేదలకు ఇళ్లు ఇస్తుంటే కోర్టులకెళ్లి అడ్డుకుంటున్నాడు
- ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తుంటే 1191 కేసులు వేయించాడు
- అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇస్తే.. కులాల మధ్య సమతుల్యత దెబ్బతింటుందన్నారు
- చంద్రబాబు కుట్రలు అధిగమించి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాం
- చంద్రబాబు లాంటి వారితో రాజకీయాలు భ్రష్టు పట్టాయి
- వంద సినిమాల్లో ఉండే విలన్ల దుర్మార్గం కంటే.. చంద్రబాబు దుర్మార్గం ఎక్కువ
- మనం సిద్ధం అంటుంటే.. చంద్రబాబు సతీమణి సిద్ధంగా లేం అంటున్నారు
- కుప్పం నుంచే బైబై బాబు అంటున్నారు
- చంద్రబాబును కుప్పం ప్రజలు కూడా నమ్మట్లేదు
- చంద్రబాబు 650 హామీలిచ్చి.. 10 కూడా నెరవేర్చలేదు
- నిస్సిగ్గుగా ఇప్పుడు కొత్త మేనిఫెస్టోతో వస్తున్నాడు
- చంద్రబాబులా నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ మద్దతు నాకు లేదు
- బాబులా దళారులను, బ్రోకర్లను నేను నమ్ముకోలేదు
- నేను నమ్ముకుంది దేవుడు.. ప్రజల్ని
- మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు తోడుగా నిలబడండి
12:32 PM, Feb 23rd, 2024
టీడీపీతో అభివృద్ధిపై చర్చకు నేను రెడీ: ఎంపీ నాని
- ప్రజల వద్దకే పాలన కల్పన జగన్ తోనే సాధ్యం అయింది
- విలేజ్ క్లినిక్ ల ద్వారా ప్రజా ఆరోగ్యం భద్రత కల్పించిన జగన్
- వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటివద్దకే సంక్షేమ పథకాలు అందించిన జగన్ ప్రభుత్వం
- మానవ అభివృద్ధి కావాలి.. గ్రాఫిక్స్ అభివృద్ధి ప్రజలకు ఏందుకు
- రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి పై టీడీపీ తో చర్చకు నేను సిద్ధం.
- బీసీలకు సముచిత స్థానం కల్పించడం జగన్ కే సాధ్యమైంది
- టీడీపీలోనే బీసీలకు ఏం న్యాయం చేశారో చెప్పగలరా?
విజయవాడ ఎంపీ కేశినేని నాని కామెంట్లు
12:10 PM, Feb 23rd, 2024
అంతా అసత్య ప్రచారం: దేవినేని అవినాష్
- ప్రతీ డివిజన్ లో 20కోట్ల పై బడి అభివృద్ధి జరిగింది
- టిడిపి హయాంలో గతుకుల రోడ్లు, నిండిన డ్రైనేజీ లు వుండేవి
- కొండ ప్రాంత లో రైలింగ్, మెట్ల నిర్మాణం చేసిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానిది
- ఓటు వేసినా వేయక పోయినా సంక్షేమం, అభివృధి ఆపొడ్డు అని జగన్ చెప్పారు
- ఎల్లో మీడియా ద్వారా టీడీపీ అసత్య ప్రచారం చేయటం బాధాకరం
- గత 10సం టీడీపీ ఎమ్మెల్యే గా వుండి గద్దె ఏం అభివృద్ధి చేశారు
- మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజక వర్గంలో కూడా అనేక అభివృధి, సంక్షేమ పథకాల అమలు చేసిన జగన్
- రానున్న ఎన్నికల్లో టిడిపిని తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
- ఎన్టీఆర్ జిల్లా లోని 7 నియోజకవర్గాలలో వైసిపి జెండా ఎగుర వేస్తాం
విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్‌ఛార్జి దేవినేని అవినాష్ కామెంట్లు
12:01 PM, Feb 23rd, 2024
వచ్చి చూస్తే మీకే తెలుస్తుంది: పేర్నికిట్టు
- టీడీపీ నేత కొల్లు రవీంద్రకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మచిలీపట్నం వైఎస్సార్‌సీపీ ఇంఛార్జి పేర్నికిట్టు
- అభివృద్ధి జరుగుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నారు
- బందరు అభివృద్ధి పై కొల్లురవీంద్రతో చర్చించేందుకు నేను సిద్ధం
- పగటి వేషగాళ్లు జనాల్లో సిగ్గులేకుండా తిరుగుతున్నారు...ప్రజలు వారిని నమ్మొద్దు
- 2014 నుండి 2019 వరకు అధికారంలో ఉండి ప్రజలకు ఏం చేశారు .. ఏం ఉద్ధరించారు
- కరోనా సమయంలో ప్రజలకు ఏం చేశారని ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు
- రోడ్డు శంఖుస్థాపనలు బూటకం అని అబద్ధాలు మాట్లాడుతున్నారు
- అబద్ధమో.. నిజమో వచ్చి చూస్తే మీకే తెలుస్తుంది
- లేదా ఓ పదిరోజులు ఇక్కడే ఉండి జరిగే పనులు చూడండి
- అవసరమైతే అద్దె డబ్బులు కట్టి మీకోసం ఓ ఇల్లు ఏర్పాటు చేస్తాం
- పదిరోజులకు సరిపడా ఖర్చులకు డబ్బులు వేయమంటే వేస్తాం
- మీ నోటికి ఎంత మాట వస్తే అంత మాట్లాడటం ప్రజలు గమనిస్తున్నారు
- సరైన సమయంలో ప్రజలు మీకు బుద్ధి చెబుతారు
11:54 AM, Feb 23rd, 2024
చంద్ర మాయ గురించి అందరికీ తెలుసు: వెల్లంపల్లి
- బోండా ఉమ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ప్రజల వద్దకు వస్తున్నాడు
- ప్రజలు చెప్తున్నారు బోండా ఉమాకి ఓటేస్తే రౌడీయిజం, కబ్జాలు పెరుగుతాయని
- బోండా ఉమాను ప్రజలు అసహ్యించుకుంటున్నారు
- షర్మిల.. నేను తెలంగాణ కోడలు అని చెప్పి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసింది
- షర్మిల ఓటు తెలంగాణలో ఉండి.. ఆంధ్ర ప్రజల సమస్యలు ఎలా తెలుస్తాయి
- షర్మిలను చంద్రబాబు పంపితేనే వచ్చింది
- చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రానికి ఏం చేశాడు
- భువనేశ్వరి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి
- భువనేశ్వరి.. చంద్రబాబుని పక్కన పెట్టి రంగంలోకి దిగారు
- భువనేశ్వరికి పోటీ చేయాలని ఉంది
- కానీ చంద్రబాబు పోటీ చేయనివ్వడు
- మీ అబ్బాయి లోకేష్ పోటీ చేసినా గెలవలేడు
- మీకు పేద ప్రజల సమస్యలు అవసరంలేదు...పెత్తందారులే కావాలి
- చంద్రబాబు మాయ గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు
- భువనేశ్వరి మాటలు రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు
చంద్రబాబుపై ఎమ్మెల్యే వెల్లంపల్లి సెటైర్లు
11:38 AM, Feb 23rd, 2024
పదవి మోజుతోనే కాంగ్రెస్‌లో చేరారా?.. షర్మిలకు కౌంటర్
- పేదల తలరాత మార్చాలనే ఆలోచనతో సీఎం జగన్ నిరంతరాయంగా కృషి చేస్తున్నారు
- వైఎస్ఆర్ పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ., సీఎం జగన్ ను జైల్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ
- ఏం కష్టము వచ్చిందో తెలియదు షర్మిల కాంగ్రెస్ లోకి వెళ్లిపోయింది
- తెలంగాణలో పోటీ చేస్తామని తెలంగాణ వైఎస్‌ఆర్ టీపీ పెట్టింది
- మరెందుకు ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిందో తెలియదు
- అధ్యక్షురాలి పదవి మోజుతో కాంగ్రెస్ గూటికి చేరింది
- టీడీపీ., కాంగ్రెస్., బీజేపీ పార్టీలను గతంలో తిట్టిన షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్లడం హాస్యాస్పదం
- అన్ని విధాలా జగన్ పేద ప్రజలను ఆదుకుంటున్నారనే కడుపు మంట ప్రతిపక్షాలకు
- పదవి వద్దు అనుకుంటే అన్నతో కలసి పనిచేయాలి
- రాజశేఖర్ రెడ్డి విలువలను కాంగ్రెస్ కాళ్ల దగ్గర షర్మిల పెట్టింది
- నవరత్నాల వల్ల లాభం లేదు అనే విమర్శలు తగదు
- షర్మిల గురించి ఇంకా మాట్లాడాలని అనుకోవడం లేదు.. ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా
- జగన్ ను సీఎం కుర్చీ నుంచి దించేయాలని ప్రతీ పార్టీ కంకణం కట్టుకుని ఉన్నాయి
- వాళ్లు ఏం చేస్తారో ప్రజలకు చెప్పారు .
- వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ప్రజలే బుద్ధి చెప్తారు
- పవన్ కల్యాణ్ మతాన్ని., కులాన్ని రెచ్చ గొడుతున్నారు
- చంద్రబాబును తిట్టి… ఇప్పుడు చంద్రబాబే సీఎం కావాలని పవన్ కోరుకుంటున్నారు
తిరుమలలో ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వ్యాఖ్యలు
10:50 AM, Feb 23rd, 2024
వైసీపీ గూటికి తిరిగి ఆర్కే.. షర్మిల స్పందన
- కాంగ్రెస్‌ను వీడి తిరిగి సొంత గూటిలో చేరిన ఆళ్ల రామకృష్ణారెడ్డి
- ఎమ్మెల్యే ఆర్కే పార్టీని వీడటంపై స్పందించిన ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల
- ఎవరినీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయడానికి నాకు కారణాల్లేవ్
- ఆర్కేకు నాకు మధ్య రాజకీయాలు లేవు
- ఆర్కే నాకు దగ్గర మనిషి
- ఆర్కే ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకున్నా
- ఆర్కే తనపై ఉన్న ఒత్తిళ్ల మేరకు వైఎస్సార్‌సీపీలోకి వెళ్లి ఉండొచ్చు!
10:33 AM, Feb 23rd, 2024
బాబు-కాంగ్రెస్ నాటకంలో పావుగా షర్మిల: మంత్రి ఆర్కే రోజా
- చంద్రబాబు నాయుడు 1998, 2008,2018 లో ఇవ్వాల్సిన డీఎస్సీలను.. సీఎం జగన్ ఇచ్చి 17వేల పోస్టుల భర్తీ చేశారు
- 6,100 భర్తీలకు సీఎం జగన్ నోటిఫికేషన్ విడుదల చేశారు
- షర్మిలకు రాజకీయ అవగాహన లేదని నిన్న చేసిన హడావిడి చూస్తే అర్థం అయింది
- నాలుగున్నరేళ్లు ఏపీలో లేకుండా తెలంగాణ బిడ్డను అని చెప్పుకుంది
- ఇప్పుడు వచ్చి జగన్ పై షర్మిల విషం చిమ్ముతూ ఆరాటాలు., పోరాటాలు చూసి ప్రజలు నవ్వుతున్నారు
- చంద్రబాబు., కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకంలో షర్మిలను పావుగా వాడుకుంటున్నారు
- వాళ్లు ఎంత మంచోళ్ళో.. వాళ్ల కుటుంబానికి పవన్ చెప్పాల్సి ఉంది
- పిచ్చి మాటలు మాట్లాడటం పవన్ మానుకోవాలి
- జగన్., షర్మిలకు సమానంగా పేరు ప్రఖ్యాతలు., ఆస్తులు పంచి పెట్టారు
తిరుమలలో ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా వ్యాఖ్యలు
10:27 AM, Feb 23rd, 2024
అంబేద్కర్ ఆశయాల్ని అమలు చేస్తున్న సీఎం జగన్
- సామాజిక న్యాయం సీఎం జగన్ తోనే సాధ్యం
- ఒక దళితునికి రాజ్యసభ సీటు ఇవ్వడం సాధారణ విషయం కాదు.
- బడుగు బలహీన వర్గాల వారికి పదవుల్లో సీఎం జగన్ పెద్దపేట వేశారు.
- చంద్రబాబు రాజ్యసభ సీట్లును వందల కోట్లకు అమ్ముకున్నారు..
- రూపాయి తీసుకోకుండా దళితుడైన బాబురావుకి సీఎం జగన్ రాజ్యసభ సీటు ఇచ్చారు
- డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను సీఎం జగన్ అమలు చేస్తున్నారు
రాజాం(విజయనగరం) ఎమ్మెల్యే కంబాల జోగులు వ్యాఖ్యలు
10:10 AM, Feb 23rd, 2024
సీఎం జగన్‌కు రుణపడి ఉంటాను: ఎంపీ గొల్ల బాబురావు
- రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన తరువాత తొలిసారిగా విశాఖ చేరుకున్న గొల్ల బాబురావు.
- విశాఖ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు.
- గొల్ల బాబురావు కామెంట్స్..
- దళితులకు గొప్ప పదవులు ఇచ్చిన గొప్ప నేత ముఖ్యమంత్రి జగన్
- ఒక దళితుడికి రాజ్యసభ సీటు ఇవ్వడం సామాన్యమైన విషయం కాదు.
- బాబురావుకి కాదు దళితులందరికీ రాజ్యసభ సీటు జగన్ సీఎం ఇచ్చారు.
- సీఎం జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటాను.
- రాజ్యసభ సీటు పేరు చెప్పి వర్ల రామయ్యను చంద్రబాబు మోసం చేశారు.
- దళితుడికి ఇవ్వాల్సిన రాజ్యసభ సీటును తన సామాజిక వర్గానికి చెందిన నేతకు ఇచ్చుకున్నారు
9:30 AM, Feb 23rd, 2024
పొత్తులపై చర్చలు..
- పొత్తులపై కాంగ్రెస్, వామపక్ష పార్టీ నేతల భేటీ
- కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్రరత్నభవన్‌లో చర్చలు
- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలతో భేటీ అయిన సీపీఐ నేతలు
8:30 AM, Feb 23rd, 2024
షర్మిలకు ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కౌంటర్
- అత్యంత పారదర్శకంగా సచివాలయ ఉద్యోగ నియామక ప్రక్రియ జరిగింది
- సచివాలయ ఉద్యోగులకు, వలంటీర్ ఉద్యోగాలకు తేడా తెలీదా?
- కాంగ్రెస్, టీడీపీలతో జతకట్టి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై విమర్శలా?
- వాస్తవాలు తెలుసుకుని షర్మిల మాట్లాడాలి.
- లేకపోతే రానున్న కాలంలో ప్రజలే బుద్ది చెబుతారు.
7:15 AM, Feb 23rd, 2024
గంటాకు షాకిచ్చిన చంద్రబాబు..
- సీనియర్ నేత, మాజీ మంత్రి గంటాపై చంద్రబాబు అసహనం
- చీపురుపల్లి వద్దని.. భీమిలిలోనే పోటీ చేస్తానని చెప్పినందుకు ఆగ్రహం
- తాను చెప్పినట్లు చెయ్యకపోతే బయటకు పొమ్మన్న చంద్రబాబు
- తనను ఓడించేందుకే ఇలా చేస్తున్నారని వాపోయిన గంటా శ్రీనివాసరావు
- బయటకు వచ్చాక మాత్రం... సాధ్యాసాధ్యాలు చూశాకే నిర్ణయమని వ్యాఖ్య
6:55 AM, Feb 23rd, 2024
బాబుకు బీసీలు బైబై
- వెన్ను విరిచిన చంద్రబాబును తరిమేందుకు బీసీ బిడ్డలు సిద్ధం
- సమాజానికి వెన్నెముకగా తీర్చిదిద్దిన వైఎస్సార్‌సీపీ వెంట పయనం
- భీమిలి, దెందులూరు, రాప్తాడు సభలతో ప్రస్ఫుటితమైందంటున్న పరిశీలకులు
- ‘బీసీ గర్జన’ కంటే మిన్నగా మంచి చేస్తున్న సీఎం జగన్
- రాజకీయ, సామాజిక సాధికారతతో బలహీన వర్గాలు బలోపేతం
- కుప్పం స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 65,351 ఓట్ల మెజార్టీ
- గత ఎన్నికల్లో 30,722 ఓట్ల ఆధిక్యతతో బయటపడ్డ బాబు
- బీసీల గడ్డలో మళ్లీ పోటీకి వెనుకంజ.. సురక్షిత స్థానం కోసం అన్వేషణ
- సొంత సామాజిక వర్గం ప్రాబల్యం ఉండే ప్రాంతాలపై కన్ను
6:50 AM, Feb 23rd, 2024
పొత్తులపై పురంధేశ్వరి కామెంట్స్..
- పొత్తులపై పార్టీ అధిష్టానం చూసుకుంటుంది.
- ఎన్ని సీట్లల్లో పోటీ చేస్తామనేది కూడా హైకమాండే నిర్ణయిస్తుంది.
- పార్టీ బలోపేతంపైనే మేం ఫోకస్ పెట్టాం.
- కార్యకర్తలు ఉత్సాహంగా పని చేస్తున్నారు.
- బీజేపీ ప్రజా సేవకు అంకితమైన పార్టీ.
- ప్రజా సేవ చేసి.. అధికారంలోకి రావాలనేది బీజేపీ ఉద్దేశ్యం.
- రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయం.
- వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 370 సీట్లు వస్తాయి.
- 370 అనేది బీజేపీకి నంబర్ కాదు.. సెంటిమెంట్.
6:40 AM, Feb 23rd, 2024
చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది: మంత్రి అంబటి
- ఓట్లు కొనాల్సిందేనని పవన్ మాటలతో అర్థమవుతోంది
- చంద్రబాబుతో పొత్తు అంటే బీజేపీ జాతీయ నేతలు ఎందుకు తిట్టకుండా ఉంటారు
- బీజేపీతో పొత్తులో ఉండి చంద్రబాబుతో పొత్తు ఏంటి?
- రానున్న రోజుల్లో పవన్ మరిన్ని చివాట్లు తింటారు
- ఓట్లు కొనాల్సిందేనని పవన్ మాటలతో అర్థమవుతోంది
- టీడీపీ, జనసేన పార్టీలు గందరగోళంలో ఉన్నాయి
- ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో తెలీదు
- ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో కూడా తెలీదు
- చంద్రబాబు, పవన్ రెస్ట్ తీసుకోవాల్సిన టైం వచ్చింది
- పార్టీలు మారిన వ్యక్తులు మాపై పోటీ చేస్తున్నారు
- ఇద్దరు విశ్వాస ఘాతకులు నాపైనా, అనిల్‌పైనా పోటీ చేస్తున్నారు
- విశ్వాసఘాతకులను తరిమికొట్టాలని సత్తెనపల్లె ప్రజలను కోరుతున్నా
- భువనేశ్వరి వ్యాఖ్యలను చంద్రబాబు ఖండించలేదు
- కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారని తేలిపోయింది
- చంద్రబాబు బాటలోనే పవన్ నడుస్తున్నాడు
- చంద్రబాబు, పవన్‌లకు రెస్ట్ ఇచ్చేందుకు ప్రజలు సిద్ధం
6:30 AM, Feb 23rd, 2024
టీడీపీ సీటు విషయంలో గంటా గరం గరం..
- సీటుపై గంటా శ్రీనివాస్ గరం గరం
- నాకు విశాఖ జిల్లాలోనే పోటీ చేయాలని ఉంది
- నేను విశాఖ నార్త్ నుండి పోటీ చేయడం లేదు
- విశాఖ నార్త్‌లో వేరే ఇన్‌ఛార్జ్‌ను పెట్టమన్నాను.
- నన్ను చీపురుపల్లి వెళ్లమని పార్టీ చెప్పింది
- కానీ చీపురుపల్లిపై నేను నిర్ణయం తీసుకోలేదు
- నేనైతే ఈ జిల్లాలోనే పోటీ చేయాలని అనుకుంటున్నాను
- నన్ను ఈ జిల్లా నుండి పంపేద్దాం అనుకుంటున్నారా?
- పార్టీ నాయకులకు నా అభిప్రాయాలు చెప్తాను
- ఇంకా టీడీపీ, జనసేన సీట్ల లెక్క తేలలేదు
- కేవలం నాలుగు సీట్లపై మాత్రమే స్పష్టత వచ్చింది
- నేను ప్రతీ ఎన్నికల్లోనూ నియోజకవర్గం మారుతున్నా
- కానీ విశాఖ జిల్లాలోనే పోటీ చేస్తున్నాను
- ఇప్పుడు కూడా విశాఖ జిల్లాలోనే పోటీ చేయాలని ఉంది
Comments
Please login to add a commentAdd a comment