
AP Elections Political Latest Updates Telugu..
08:36 PM, Feb 26th, 2024
నాదెండ్లకు నిరసన సెగ
- పశ్చిమగోదావరి జిల్లా జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌కు నిరసన సెగ
- పశ్చిమగోదావరిజిల్లా తాడేపల్లిగూడెంలో ఈ నెల 28న జరగబోయే జనసేన టీడీపీ ఉమ్మడి బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్ల పరిశీలనకు విచ్చేసిన జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.
- సోమవారం రాత్రి పెంటపాడు మండలం అలంపురంలోని జయా గార్డెన్స్‌లో బస చేసిన మనోహర్.
- మనోహర్ బస చేసిన ప్రాంతానికి చేరుకున్న తణుకు జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావు, నాయకులు, కార్యకర్తలు
- విడివాడ రామచంద్రరావుకు టికెట్టు కేటాయించకపోవడంతో మనోహర్ బస చేసిన గెస్ట్‌హౌస్ ఎదుట నిరసన.
- పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న విడివాడ రామచంద్రరావు అనుచరులు, పార్టీ శ్రేణులు
- తాడేపల్లిగూడెం డీఎస్పీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు, ఉద్రిక్తత వాతావరణం.
- జయా గార్డెన్స్‌కు చేరుకున్న జనసేన నాయకులు విడివాడ రామచంద్రరావు, బొలిశెట్టి శ్రీనివాస్, కందుల దుర్గేష్‌లు ఎంత సముదాయించిన మాట వినని విడివాడ
- నాకు టికెట్ ఇవ్వకపోతే ప్రాణం తీసుకుంటానంటున్న విడివాడ బెదిరింపులు.
07:58 PM, Feb 26th, 2024
ఏదో ఒక సీటు అయినా ఫర్వాలేదు!
- నెల్లూరు జిల్లాలో జనసేనకు ఒక స్థానం కూడా కేటాయించకపోవడంతో జిల్లా పార్టీ కార్యాలయం ఎదుట నేతలు కార్యకర్తలు ఆందోళన
- ఏదో ఒక సీటు కేటాయించాలని డిమాండ్
- జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి కామెంట్స్..
- జనసేన పార్టీ కోసం గత ఆరు సంవత్సరాల నుంచి నేతలు కార్యకర్తలు ప్రజా సమస్యల మీద పోరాడుతూనే ఉన్నారు
- ఈ పోరాటాలతోనే పార్టీని బలోపేతం చేసుకున్నాం
- కరోనా సమయంలో ఎవరూ చేయని విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించాము
- ఏడాదిన్నర కాలం నుంచి జనం కోసం జనసేన కార్యక్రమాన్ని కూడా చేపట్టాం
- కోట్లాది రూపాయల వ్యాపారాలను వదులుకొని పుట్టిన ఊరికి ఏదో మంచి చేయాలని వచ్చాను..ప్రజలు ఎంతో ఆదరించారు
- నెల్లూరు సిటీ నుంచి జన సేన కు పోటీ చేసే అవకాశం వస్తుందని భావించాను
- గతంలో పీఆర్‌పీ ఈ నియోజకవర్గంలో విజయం సాధించింది
- నెల్లూరు జిల్లాలో ఒక సీటు కూడా కేటాయించకపోవడంతో
- నేతలంతా తీవ్ర కలత చెందుతున్నారు
- పవన్‌తో మాట్లాడి జిల్లాలో ఒక సీటైనా కేటాయించేలా ప్రయత్నం చేస్తామంటున్న నేతలు
07:25 PM, Feb 26th, 2024
చింతలపూడి టీడీపీలో నాన్ లోకల్ చిచ్చు
- చింతలపూడి నియోజకవర్గ టీడీపీలో బయటపడ్డ వర్గ విభేదాలు
- జంగారెడ్డిగూడెంలో చింతలపూడి టిడిపి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ పరిచయ కార్యక్రమం లో రసాభాస
- నియోజకవర్గ పరిశీలికులు కోళ్ల నాగేశ్వరరావు, సొంగ రోషన్ కుమార్ ఎదుటే కుమ్ము లాడుకున్న తెలుగు తమ్ముళ్లు
- రోషన్ కుమార్ నాన్ లోకల్ అంటూ..నినాదాలు చేసిన రోషన్ వ్యతిరేక వర్గం
07:12 PM, Feb 26th, 2024
టీడీపీలో అసమ్మతి నేతల ‘సిద్ధం’!
- తిరుపతి సూళ్లూరుపేట తెలుగుదేశం పార్టీలో బయటపడ్డ అసమ్మతి
- మీడియా ముందు తన గోడును వివరించిన పరసా షాలినీ రత్నం
- పార్టీని నమ్ముకున్న తన తండ్రి పరసా రత్నానికి అన్యాయం జరిగిందని ఆవేదన
- గత 30 ఏళ్లుగా పార్టీ నమ్ముకొని పనిచేస్తున్నాము...నియోజకవర్గంలో పరసా అండలేకుండా టిడిపికి ఉందా..?
- తమను రాజకీయ గుర్తింపు ఇవ్వకపోతే దేనికైనా సిద్దం
06:30 PM, Feb 26th, 2024
టీడీపీలో బయటపడ్డ వర్గ విభేదాలు
- ఏలూరు జిల్లా: చింతలపూడి నియోజకవర్గ టీడీపీలో బయటపడ్డ వర్గ విభేదాలు
- జంగారెడ్డిగూడెంలో చింతలపూడి టీడీపీ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ పరిచయ కార్యక్రమంలో రసాభాస
- నియోజకవర్గ పరిశీలికులు కోళ్ల నాగేశ్వరరావు, సొంగ రోషన్ కుమార్ ఎదుటే కుమ్ము లాడుకున్న తెలుగు తమ్ముళ్లు
- రోషన్ కుమార్ నాన్ లోకల్ అంటూ.. నినాదాలు చేసిన రోషన్ వ్యతిరేక వర్గం
06:00 PM, Feb 26th, 2024
175 కి 175 గెలవబోతున్నాం.. ఎమ్మెల్సీ, లేళ్ల అప్పిరెడ్డి
- ఆ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి
- ఇప్పటికే మూడు ప్రాంతాల్లో సిద్ధం సభలు సక్సెస్ అయ్యాయి
- మార్చి 3వ తేదీన చివరి ‘సిద్ధం’ సభ జరగబోతోంది
- ఎన్నికలకు సమాయాత్తమవుతున్న సమయంలో రేపటి మీటింగ్ కీలకం కాబోతోంది
- రేపటి కీలక సమావేశంలో మా నాయకులు సీఎం జగన్ దిశా నిర్ధేశం చేస్తారు
- క్షేత్రస్థాయిలో ఎలా ముందుకు వెళ్లాలో వివరిస్తారు
- కీలకమైన నాయకులు, బూత్ లెవల్‌లో నాయకులంతా రేపటి మీటింగ్ హాజరవుతారు
- పార్టీ పరంగా వివిధ హోదాల్లో ఉన్న 2700 మందికి ఆహ్వానం పంపించాం
- ఎంతమంది కలిసి వచ్చినా మా విజయాన్ని ఎవరూ ఆపలేరు
విజయనగరం: చీపురుపల్లిలో టీడీపీకి షాక్
- చీపురుపల్లి టీడీపీ మాజీ జడ్పిటీసీ మీసాల వరాలు నాయుడు
- చీపురుపల్లి మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్ మీసాల సరోజిని
- 17 మంది మాజీ వార్డు సభ్యులు 1000 మంది కర్యకర్తలు
- మంత్రి బొత్స సత్యనారాయణ, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లానచంద్రశేఖర్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిక
05:20PM, Feb 26th, 2024
టీడీపీ-జనసేన పొత్తు అతుకుల బొంత: సజ్జల రామకృష్ణారెడ్డి
- టీడీపీ, జనసేన పార్టీలో అసంతృప్తులు మా పార్టీలోకి వస్తామంటున్నారు
- అవకాశం ఉన్న చోట వారిని చేర్చుకునే అంశాన్ని పరిశీలిస్తాం
- ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ జగన్ నెరవేర్చారు
- రేపటి సమావేశంలో సీఎం జగన్ ఎన్నికలకు దిశా నిర్దేశం చేస్తారు
- ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో ఎలా పనిచేయాలనేది చెబుతారు
- క్యాడర్‌కు సీఎం జగన్ దిశా నిర్దేశం చేస్తారు
- ప్రభుత్వం చేసిన మంచిని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేలా సీఎం సూచనలు చేస్తారు
- ఎన్నికలకు ముందు జరిగే ఆఖరి కీలక సమావేశం ఇది
- గడప గడపకూ కార్యక్రమంతో వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ ప్రజల చెంతనే ఉంది
- ఐదేళ్లుగా జరిగిన సంక్షేమ పాలనను ప్రజలకు వివరిస్తాం
- ఎన్నికలకు ముందు జరగబోయే ఆఖరు సమావేశం
- క్షేత్రస్థాయి.. మండల కార్యకర్తల సమావేశం ఇది
- సీఎం జగన్ మోహన్‌రెడ్డితో పాటు అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇంఛార్జులు పాల్గొంటారు
- ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో ఎంత అప్రమత్తంగా ఉండాలో సీఎం జగన్ దిశానిర్ధేశం చేస్తారు
- ప్రత్యర్ధులు అవకతవకలకు పాల్పడకుండా ఎలా చూడాలో చెప్తారు
- ప్రజల్లోకి మరింతగా పార్టీని ఎలా తీసుకెళ్లాలో వివరిస్తారు
- వైఎస్సార్‌సీపీ పార్టీ ఎప్పుడూ ప్రజల్లోనే ఉంది.. నాయకులెప్పుడూ ప్రజల్లోనే ఉన్నారు
- ప్రభుత్వం చేస్తున్న మంచిని.. పథకాలను ప్రజలకు చేరవేస్తూనే ఉన్నాం
- నాలుగున్నరేళ్లుగా ప్రజల అవసరాలను తెలుసుకుని తీరుస్తున్నాం
- ఎన్నికలకు అందరికంటే ముందే పోటీలోకి దిగే గట్టి టీమ్ను ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నాం
- ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో పూర్తి చేశాం
- బూత్ కమిటీలు కూడా రెడీ చేస్తున్నాం
- సమర్ధవంతమైన బూత్ కమిటీ మెంబర్లను ఎంపిక ఓరియంటేషన్ ప్రక్రియ రేపు జరగనుంది
- రేపటి సమావేశం తర్వాత మేం పూర్తిస్థాయిలో ఎన్నికలకు సిద్ధమవుతాం
- మా అభ్యర్ధుల్ని ఎంపిక చేస్తున్నప్పుడు ఏదో అయిపోతుందని మమ్మల్ని విమర్శించారు
- అసంతృప్తులెవరైనా ఉంటే పిలిచి మాట్లాడుతున్నాం.. అంతా సర్దుకున్నారు
- టీడీపీ, జనసేన సీట్ల సర్ధుబాటు అతుకుల బొంత
- పవన్ను ఘోరంగా అవమానించి 24 సీట్లు కేటాయించారు
- గంపగుత్తగా వస్తున్నారని మేం ఎవరిని పడితే వారిని చేర్చుకోం
- అలాంటి వారి వల్ల అనవసరమైన తలనొప్పులు.. పార్టీకి భారం
04:20PM, Feb 26th, 2024
పేదవాడు బాగుండాలంటే జగనే మళ్లీ రావాలి: : మంత్రి జోగి రమేష్
- చంద్రబాబు అధికారంలోకి వస్తే సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాలు రద్దు చేస్తా అంటున్నాడు
- అమరావతిలో అద్దాల మేడలు కడుతా అంటున్నాడు
- పేదవాడు బాగుండాలంటే మళ్లీ జగన్ ప్రభుత్వమే రావాలి
- ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ జగన్ నెరవేర్చారు
- కొలుసు పార్ధసారథి పై జోగిరమేష్ ఫైర్
- టిడ్కో ఇల్లు నిర్మించడంలో పార్థసారథి విఫలం చెందాడు
- బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తి చంద్రబాబు సమక్షంలో పచ్చ కండవా కప్పుకున్నాడు
04:20PM, Feb 26th, 2024
కర్నూలు టీడీపీలో అసంతృప్తి సెగలు
- టికెట్ రాకపోడంతో శనివారం ఆత్మహత్యాయత్నం చేసిన ఆకెపోగు ప్రభాకర్
- టికెట్ వస్తుందని ఎదురుచూసిన ఆకెపోగు
- కానీ బొగ్గుల దస్తగిరికి టికెట్ కేటాయించిన టీడీపీ
- దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం
- పురుగుల మందు తాగిన ఆకెపోగు
- ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స.. కోలుకున్న ఆకెపోగు
03:45PM, Feb 26th, 2024
పెత్తందార్లపై సీఎం జగన్ యుద్ధం చేస్తున్నారు: కురసాల కన్నబాబు
- ప్రతి రూపాయి పేదల అకౌంట్‌లో వేసి పారదర్శక పాలన చేస్తున్నారు
- చంద్రబాబు అండ్ కో దుష్ర్పచారాలను మనం తిప్పికొట్టాలి
యుద్ధానికి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు సిద్ధం: ఎంపీ సత్యవతి
- రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరాలి
- రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం సభకు విశేషమైన స్పందన లభిస్తుంది
దేహి అనుకుంటూ టీడీపీ, జనసేన ఒకరితో మరొకరు పొత్తులు: మంత్రి గుడివాడ అమర్నాథ్
- ఫలితాల తర్వాత కోల్డ్ స్టోరేజ్‌కు ప్రతిపక్షాలు వెళ్లిపోతాయి
- లోకేష్‌కు అనకాపల్లి సరిహద్దులు కూడా తెలియవు
03:15PM, Feb 26th, 2024
నెల్లూరు:
వచ్చే ఎన్నికల్లో టీడీపీ సింబల్‌పై నేనే పోటీ చేస్తా: కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి
- వచ్చే ఎన్నికల్లో పోటీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు
- వచ్చే ఎన్నికల్లో పార్టీ సింబల్ పైనే పోటీ చేస్తానన్న మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి
- రెండు రోజుల్లో తన నిర్ణయం ప్రకటిస్తానని అభిమానులకు విష్ణువర్ధన్ రెడ్డి వెల్లడి
- రెండు రోజులుగా కార్యకర్తలతో చర్చలు జరుపుతున్న మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి
- రెండు రోజులు క్రితమే కావలి టిడిపి అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డిని ఖరారు చేసిన చంద్రబాబు
02:50PM, Feb 26th, 2024
జనసేనకు చెందిన వందమంది యువకులు వైఎస్సార్‌సీపీలో చేరిక
- తణుకు నియోజకవర్గం అత్తిలిలో షాదీఖానా భవనంలో అత్తిలి మండలం వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించిన మంత్రి కారుమూరి
- అత్తిలి మండలంలో జనసేన పార్టీకి చెందిన వంద మంది యువకులు వైఎస్సార్‌సీపీలో చేరిక
- యువకులకు వైఎస్సార్‌సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కారుమూరి
02:45PM, Feb 26th, 2024
సిద్ధం సభకు వచ్చే జనాన్ని చూసి ప్రతిపక్షాల వెన్నులో వణుకు: అనిల్ కుమార్ యాదవ్
- వచ్చే నెల మూడో తేదీన జరిగే సిద్ధం సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలి
- దాదాపు 15 లక్షల మందికి పైగా సిద్ధం సభకు ప్రజలు వస్తారని భావిస్తున్నాం
- మేము సీట్లు సర్దుబాటు చేసుకుంటే చంద్రబాబు నాయుడు అవాకులు చవాకులు పేలాడు
- మొన్న లిస్టు అనౌన్స్ చేసిన తర్వాత ఆయన ఇంటి దగ్గర ఎలాంటి పరిస్థితి ఉందో అందరికీ తెలుసు
- జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ చంద్రబాబు కాళ్ళ దగ్గర పెట్టాడు
- కాపులందరినీ తీసుకెళ్లి చంద్రబాబుకు కట్టపెట్టాడు పవన్ కళ్యాణ్
సిద్ధం సభకు వస్తున్న జనాన్ని చూసి ప్రతిపక్షాలకు నిద్రపట్టట్లేదు: పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
మూడో తేదీ నిర్వహించే సిద్ధం సభ చరిత్రలో నిలిచిపోతుంది
నా పాలనలొ మీకు మంచి జరిగిందని భావిస్తేనే నాకు ఓటేయండి అని చెబుతున్న ఏకైక మగాడు జగన్‌మోహన్‌రెడ్డి
సిద్ధం లాంటి సభల ద్వారా ఈ ఐదేళ్ల ఈ ఐదేళ్ల కాలంలో మా ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు చెప్తున్నాం
కానీ ప్రతిపక్షాలు వాళ్ళ సభల ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు
02:40PM, Feb 26th, 2024
బుద్ధప్రసాద్‌ను కాదని జనసేనకు ఇస్తే సహించేది లేదు
- అవనిగడ్డ అసెంబ్లీ సీటు టీడీపీకే ఇవ్వాలని పట్టుబడుతున్న టీడీపీ కార్యకర్తలు
- అవనిగడ్డ సీటు జనసేనకు కేటాయిస్తారని ప్రచారం
- తీవ్ర అసంతృప్తిలో టీడీపీ శ్రేణులు
- తొలిజాబితాలో తన పేరు లేకపోవడంపై ఇప్పటికే అసహనం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత మండలి బుద్ధ ప్రసాద్
- అవనిగడ్డ అసెంబ్లీ సీటు మండలి బుద్ధ ప్రసాద్‌కి కేటాయించాలని టీడీపీ శ్రేణుల డిమాండ్
- మోపిదేవిలో అవనిగడ్డ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం
- సమావేశంలో టిడిపి కార్యకర్తల ఏకగ్రీవ తీర్మానం
- అవనిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిత్వం మండలి బుద్ధప్రసాద్‌కు కేటాయించాలని డిమాండ్
02:15PM, Feb 26th, 2024
కుప్పం సభలో సీఎం జగన్ కామెంట్స్..
- 675 కిలోమీటర్ల దూరం నుంచి కృష్ణాజలాలు కుప్పం ప్రవేశించాయి
- కుప్పం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను
- చంద్రబాబు హయాంలో లాభాలు ఉన్న పనులు మాత్రమే చేశారు
- కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేస్తామని చెప్పి చేసి చూపించాం
- కృష్ణాజలాల నిల్వ కోసం మరో రెండు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాం
- అందుకోసం పరిపాలన పరమైన అనుమతులు కూడా ఇచ్చాం
- కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 110 చెరువులను నింపుతాం
- కృష్ణా జలాల నిల్వ కోసం మరో రెండు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాం
- అందుకోసం పరిపాలన పరమైన అనుమతులు కూడా ఇచ్చాం
- రూ. 530 కోట్లతో రెండు రిజర్వాయర్లు నిర్మిస్తున్నాం
- చంద్రబాబు హయాంలో లాభాలు ఉన్న పనులు మాత్రమే చేశారు
- కుప్పం నియోజకవర్గానికి 35 ఏళ్లుగా చంద్రబాబు ఎమ్మెల్యే
- 14 ఏళ్లు సీఎం గా కూడా పనిచేశారు
- 35 ఏళ్లలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు చేయలేకపోయారు
- కుప్పంకు ప్రయోజనం లేని చంద్రబాబుతో రాష్ట్రానికి సీఎం ప్రయోజనం
- 2 లక్షల మంది ప్రజలకు మంచినీరు, సాగునీరు అందించాలన్న కుప్పం బ్రాంచ్ కెనాల్ ను నిధులు పారే ప్రాజెక్టుగా చంద్రబాబు అంచనాలు పెంచి అయినవాళ్లకు కాంట్రాక్టులు కట్టబెట్టారు
- మీ బిడ్డ ప్రభుత్వం కుప్పం ప్రజల కల సాకారం చేసింది
- చంద్రబాబును ఇంతకాలం భరించిన కుప్పం ప్రజల సహనానికి జోహార్లు
- చంద్రబాబు వల్ల కుప్పానికి మంచి జరిగిందా
- మీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాక మంచి జరిగిందా
- కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకొచ్చింది మీ జగన్
- కుప్పాన్ని మున్సిపాలిటీగా మార్చింది మీ జగన్
- కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకొచ్చింది మీ జగన్
- కుప్పానికి రెవెన్యూ డివిజన్ తెచ్చింది మీ జగన్
- చిత్తూరు పాల డెయిరీ ని పునః ప్రారంభించింది మీ జగన్
- కుప్పం ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూశాం
- కులం మతం, ప్రాంతం పార్టీతో సంబంధం లేకుండా సంక్షేమాన్ని కుప్పం ప్రజలంతా మా వాల్లేనని గర్వంగా చెబుతున్నా
- చంద్రబాబు హయాంలో ఒక్క రూపాయి ఐనా బ్యాంకుల ఖాతాల్లో వేశారా
- మీ బిడ్డ ప్రభుత్వంలో 57 నెలల కాలంలో ఎన్ని లక్షలు అందుకున్నారో
- పెన్షన్ల కోసం క్యూలైన్ల లో నిల్చోవాల్సిన అవసరం లేకుండా చేశాం
- ప్రతి నెలా ఇంటికే వచ్చి వాలంటీర్లు పెన్షన్ అందిస్తున్నారు
- కుప్పంలో కేవలం 31 వేల మందికి మాత్రమే చంద్రబాబు పెన్షన్ ఇచ్చారు
- రూ. 3 వేలకు పెన్షన్ పెంచి 45,374 మందికి పెన్షన్ ఇస్తున్నాం
- ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా పెన్షన్ అందిస్తున్నాం
- చంద్రబాబు హయాంలో రైతు భరోసా అనే కార్యక్రమమే లేదు
- కుప్పంలో 44,640 మంది రైతులకు రూ. 214 కోట్ల రైతు భరోసా ఇచ్చాం
- కుప్పం నియోజకవర్గంలో 1400 వాలంటీర్ల తో సేవలు అందిస్తున్నాం
- కుప్పం నియోజకవర్గంలో 76 విలేజ్ క్లినిక్ లు ఏర్పాటు చేశాం
- పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు మోసం చేశారు
- వైఎస్సార్ ఆసరా కింద రాష్ట్రంలో రూ. 26 వేల కోట్లు అందించాం
- కుప్పంలో 44,888 మహిళలకు రూ. 175 కోట్లు ఇచ్చాం
- కుప్పంలో 35,951 మంది తల్లులకు జగనన్న అమ్మఒడి అందించాం
- కుప్పంలో 15,727 మందికి ఇళ్లపట్టాలు ఇచ్చాం
- ఈ నెలలో మరో 15 వేల ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నాం
- వైఎస్సార్ చేయూత ద్వారా 19,921 మందికి రూ. 85 కోట్లు ఇచ్చాం
- నిర్వీర్యమైన ఆరోగ్యశ్రీని పునరుజ్జీవింప చేశాం
- కుప్పంలో కొత్త 108 వాహనాలు అందించాం
- కుప్పంలో ఆరోగ్యశ్రీ ద్వారా 17,552 మందికి ఆరోగ్య సేవలు అందించాం
- బాబు హయాంలో అరకొర ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చారు
- ఇప్పుడు ప్రతి విద్యార్థి వందశాతం ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లిస్తున్నాం
- ఏ ఒక్కరూ మిస్ అవకుండా అందరికీ ప్రయోజనం చేకూరుస్తున్నాం
02:12PM, Feb 26th, 2024
వసంత ఎలా వస్తాడో మేం చూస్తాం: టీడీపీ కార్యకర్తలు
- వసంత కృష్ణప్రసాద్ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మైలవరం(ఎన్టీఆర్ జిల్లా) చండ్రగూడెం తెలుగుదేశం పార్టీ కార్యకర్త లక్కింశెట్టి పుల్లారావు గుండెపోటుతో మృతి
- దేవినేని ఉమాకు టిక్కెట్ రాదనే వార్తలు వల్లే పుల్లారావుకు గుండెపోటు వచ్చిందంటున్న టీడీపీ కార్యకర్తలు
- పుల్లారావు అంతిమయాత్రలో పాల్గొన్న దేవినేని ఉమా
- ఉమా సమక్షంలో వసంత కృష్ణప్రసాద్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన టీడీపీ కార్యకర్తలు
- టీడీపీ కార్యకర్తలు వసంతను మేం టీడీపీలోకి ఆహ్వానించడం లేదు
- ఆయన రావడాన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం
- టీడీపీలోకి ఎలా వస్తాడో.. వచ్చి ఇక్కడ ఎలా తిరుగుతాడో చూస్తాం
- తప్పుడు సర్వేలతో మా మనోధైర్యాన్ని దెబ్బతీసిన వ్యక్తి వసంత కృష్ణప్రసాద్
- ప్రైవేట్ సర్వేలతో మమ్మల్ని అయోమయానికి గురిచేశారు
- మమ్మల్ని ఆర్ధికంగా, మానసికంగా కుంగదీసిన వ్యక్తి వసంత
- అలాంటి వ్యక్తి వచ్చి మా భుజాల పై స్వారీ చేస్తామంటే ఒప్పుకోం
02:06PM, Feb 26th, 2024
తప్పుడు ప్రచారాల్ని తిప్పి కొట్టాలి: వైఎస్సార్‌సీపీ నేతలు
అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ ఆధ్వర్యంలో సిద్దం సభ..
సభకు హాజరైన వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మంత్రి అమరనాథ్ , ఎంపీ సత్యవతి, జిల్లా అధ్యక్షుడు బొడ్డేటి ప్రసాద్..
వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ..
- ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయి.
- తప్పుడు ప్రచారంను వైఎస్సార్సీపీ నాయకులు తిప్పి కొట్టాలి..
- యువతకు పార్టీలో సీఎం జగన్ పెద్ద పీట వేస్తున్నారు..
- పార్టీకి 30 ఏళ్లకు సరిపడ యువతను ప్రోత్సహిస్తున్నారు.
- రాష్ట్రంలో దోపిడి దారులకు, పేదలకు మద్య యుద్ధం జరుగుతుంది.
- అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని చంద్రబాబు లూటీ చేశారు..
- సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలంటే మళ్ళీ సీఎంగా జగన్ గెలవాలి.
- రానున్న రెండు నెలలు ప్రతి కార్యకర్త ఒక సైనికుడుగా పని చేయాలి.
- ఇంటింటికి వెళ్లి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలి..
మంత్రి అమరనాథ్ మాట్లాడుతూ..
- దేహి అనుకుంటూ టీడీపీ జనసేన ఒకరితో మరొకరు పొత్తులు పెట్టుకున్నారు..
- ఫలితాలు తరువాత ప్రతి పక్ష పార్టీల నేతలు కోల్డ్ స్టోరేజ్ కు వెళ్ళిపోతారు..
- లోకేష్ కు అనకాపల్లి సరిహద్దులు కూడా తెలియవు..
- అనకాపల్లి లో సభ అని చెప్పి పక్క నియోజక వర్గంలో సభ పెట్టారు..
ఎంపీ సత్యవతి మాట్లాడుతూ..
- యుద్ధానికి సిద్దంగా వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.
- రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజక వర్గాల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగరాలి
- రాష్ట్ర వ్యాప్తంగా సిద్దం సభలకు విశేషమైన స్పందన లభిస్తుంది..
01:59PM, Feb 26th, 2024
పవన్ చెప్పు చూపిస్తే.. నేను బూటు చూపిస్తున్నా
- పవన్ కల్యాణ్ పై సంచలన ఆరోపణలు చేసిన వైఎస్సార్‌సీపీ కాపు జేఏసీ నేత రామ్ సుధీర్
- పవన్ కల్యాణ్ 2018లో చంద్రబాబును అబుదాబిలో కలిశాడు
- చంద్రబాబు వద్ద నుంచి కోట్లాది రూపాయలను తీసుకున్నాడు
- పవన్ కల్యాణ్ 2019 తరువాత చార్టర్ ఫ్లైట్ కొన్నారు
- పవన్‌కు వేల కోట్ల రూపాయల డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి
- పవన్ చెప్పు చూపిస్తే.. నేను బూటు చూపిస్తున్నా
- నాదెండ్ల లింగమనేని ఇద్దరు కలిసి టికెట్ల డిసైడ్ చేస్తున్నారు
- జనసేన పార్టీ పేరుతో సభలు పెట్టి రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నారు
- నిన్ను నమ్మి మోసపోయిన నాకు నువ్వు సమాధానం చెప్పాలి
- పార్టీ పెట్టి కాపులను పవన్ కల్యాణ్ మోసం చేశారు
- నాదెండ్ల మనోహర్ తో కలిసి జనసేన పార్టీ నాయకులను పవన్ రోడ్డున పడేశారు
- పార్టీ సభ్యత్వాల పేరుతో స్కాం కు తెరలేపారు
- టీడీపీకి హోల్ సేల్ గా పవన్ జనసేన పార్టీని అమ్మేశాడు
- ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాలని అడుగుతున్నారు
- 25 కోట్లతో కార్లు కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి
- రబ్బరు చెప్పులు వేసుకునే వాళ్లతో రాజకీయాలు చేయిస్తానని ఇప్పుడు మాట మార్చారు
- డబ్బున్న వాళ్ళని మాత్రమే జన సేన పార్టీ నాయకులను చేస్తుంది
01:50PM, Feb 26th, 2024
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ టీడీపీలో రచ్చ
- పెనుకొండ టీడీపీలో సవిత వర్సెస్ బీకే పార్థసారధి
- సవితకు టికెట్ కేటాయించడంపై బీకే పార్థసారథి వర్గీయుల నిరసన
- నిన్న టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలు దగ్థం చేసిన బీకే వర్గీయులు
- టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు బలోపేతానికి కృషి చేశా: బీకే పార్థసారధి
01:10PM, Feb 26th, 2024
దేవినేని ఉమాకు మైలవరం టిక్కెట్‌పై ఆశలు గల్లంతు
- దేవినేని ఉమాను పెనమలూరు పంపించే ఆలోచనలో చంద్రబాబు
- పెనమలూరులో ఐవీఆర్ఎస్ కాల్స్ కలకలం
- కార్యకర్తల అభిప్రాయాన్ని సేకరిస్తున్న టీడీపీ
- దేవినేని ఉమా మీకు కావాలా అంటూ చంద్రబాబు పేరుతో ఐవీఆర్ఎస్ కాల్స్
- ఐవీఆర్ఎస్ కాల్స్ తో ఆందోళనలో పెనమలూరు టీడీపీ ఇంఛార్జి బోడే ప్రసాద్
- కృష్ణాజిల్లా టీడీపీ నేతలతో చంద్రబాబు నివాసానికి వచ్చిన బోడే ప్రసాద్
12:50PM, Feb 26th, 2024
రక్తదానం చేసినా సీటివ్వలేదు : బుద్ధా వెంకన్న
- ఆత్మీయ సమ్మేళనంలో బుద్ధా వెంకన్న వ్యాఖ్యలు
- విజయవాడ వెస్ట్ సీటును నాకు ఇస్తారని అనుకున్నా
- దేశంలో ఏ నాయకుడు నాలాగా రక్తాభిషేకం చేయలేదు
- అయినా నాకు విజయవాడ వెస్ట్ టికెటివ్వలేదు
12:25PM, Feb 26th, 2024
జనసేన కొత్తపేట ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ అలక
- కొత్తపేట టికెట్ టీడీపీకి కేటాయించడంతో అసంతృప్తి
- పవన్ కల్యాణ్ పునరాలోచన చేయాలి
- జనసేనకు కేటాయిస్తే అత్యధిక మెజార్టీతో గెలుస్తాం
12:20PM, Feb 26th, 2024
కాకినాడ: పిల్లి అనంతలక్ష్మి ఇంటి దగ్గర ఉద్రిక్తత
- టీడీపీ ఫ్లెక్సీలు చించి తగలబెట్టిన కార్యకర్తలు
- టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ఇంటికి భారీగా చేరుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు
- పొత్తులో భాగంగా కాకినాడ రూరల్ టికెట్ జనసేనకు కేటాయింపు
- పిల్ల అనంతలక్ష్మికి మద్దతుగా కార్యకర్తల నినాదాలు
- అనంతలక్ష్మికి న్యాయం జరగకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని హెచ్చరిక
- పిల్లి దంపతులు పార్టీకి రాజీనామా చేయాలని డిమాండ్
- ఇండిపెండెంట్ గా పోటీ చేయాలంటూ ఒంటిపై డీజిల్ పోసుకున్న టీడీపీ కార్యకర్త
- కార్యకర్తపై నీళ్ళు పోసి సర్ధి చెప్పిన అనంతలక్ష్మి
- భవిష్యత్త్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్న అనంతలక్ష్మి దంపతులు
- వచ్చే నెల 3న నిర్ణయం తీసుకుంటానంటున్న పిల్లి అనంతలక్ష్మి
12:10PM, Feb 26th, 2024
ఉండవల్లి చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత
- చంద్రబాబు నివాసం వద్ద ధర్నాకు దిగిన టీడీపీ నేతలు
- తంబళ్లపల్లె టికెట్ శంకర్ యాదవ్‌కు ఇవ్వాలని డిమాండ్
- తంబళ్లపల్లె టికెట్‌ను జయచంద్రారెడ్డికి కేటాయించడాన్నివ్యతిరేకిస్తున్న శంకర్, ఆయన వర్గం
11:50AM, Feb 26th, 2024
నమ్మిన వ్యక్తుల్ని మోసం చేయడం చంద్రబాబు నైజం: దేవినేని అవినాష్
- జనసేన పార్టీకి సీట్ల కేటాయింపులో చంద్రబాబు తన జిత్తులమారితనం ప్రదర్శించారు
- చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు పవన్ చాటిన కృతజ్ఞత సైతం విస్మరించిన చంద్రబాబు
- సీట్ల పంపకంలో జరిగిన అన్యాయంపై జనసేన నేతలే రోడ్డెక్కి ప్రశ్నిస్తున్నారు
- కృష్ణలంక ప్రాంతంలో ఇళ్లపట్టాల సమస్య ను పరిష్కరించిన జగన్ ప్రభుత్వం
- గడపగడపకు పర్యటనలో ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోంది
- వైఎస్సార్ ఆశీర్వాదం, ప్రజల ఆశీస్సులు ఉన్నంతవరకు జగన్ గెలుపును ఎవరూ ఆపలేరు
11:40AM, Feb 26th, 2024
సీఎం జగన్ వదిలిన కృష్ణా జలాల్లో చంద్రబాబు రాజకీయ భవిష్యత్తు కొట్టుకుపోతుంది: మంత్రి ఆర్కే రోజా
- కృష్ణమ్మ పరవళ్లలో చంద్రబాబు కనపడకుండా పోతారు
- 35 ఏళ్లుగా కుప్పం ప్రజలకు వెన్నుపోటు పొడిచారు
- ఎలాంటి అభివృద్ధి, సంక్షేమం లేకుండా వారిని రోడ్డున పడేశారు
- కుప్పానికి అభివృద్ధి అంటే ఏంటో జగన్ చేసి చూపించారు
- నిరంతరం భయంతో బతికే వ్యక్తి చంద్రబాబు
- జైల్లో ఉన్నప్పుడు ఆయన కుర్చీలో బాలకృష్ణ కూర్చోగానే వెంటనే పవన్ కల్యాణ్‌ని దించారు
- పొత్తులు అంటూ జైలు దగ్గర ప్రకటించారు
- మొన్న కుప్పం నుంచి పోటీ చేస్తానని భువనేశ్వరి చెప్పగానే నిన్న తన సీటును తానే ప్రకటించుకున్నారు
- కుప్పం ప్రజలు వాస్తవాలను గ్రహించారు
- వచ్చే ఎన్నికలలో కుప్పం ప్రజల తీర్పు చంద్రబాబుకు చెంపపెట్టు అవుతుంది
11:35AM, Feb 26th, 2024
కాకినాడ రూరల్ టీడీపీలో అసమ్మతి సెగ
- సీటు జనసేనకు కేటాయించడంపై టీడీపీ కార్యకర్తల ఆగ్రహం
- మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి రాజీనామా చేయాలని డిమాండ్
- ఒంటిపై పెట్రోల్ పోసుకున్న టీడీపీ కార్యకర్త
- మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతున్న టీడీపీ నేతలు
11:22AM, Feb 26th, 2024
అనకాపల్లి జనసేన లో బైట పడ్డ అసంతృప్తి.
- అనకాపల్లి ఎమ్మెల్యే సీటు రాకపోవడంపై పరుచూరి భాస్కర్ రావు ఆవేదన..
- కన్నీటి పర్యంతమైన పరుచూరి భాస్కరరావు..
- అనకాపల్లి జనసేన ఇంచార్జిగా వ్యవహరిస్తున్న భాస్కర్ రావు.
- భాస్కరరావు స్థానంలో కొణతాల రామకృష్ణకు సీటు కేటాయింపు
11:20AM, Feb 26th, 2024
టిడ్కో ఇళ్ల పేరుతో ప్రజాధనాన్ని చంద్రబాబు దోచుకున్నారు: వెల్లంపల్లి శ్రీనివాస్
- అమరావతి స్థలాలు చట్ట ప్రకారమే పేద ప్రజలకు ఇవ్వడం జరిగింది.
- చంద్రబాబు కోర్టులో స్టే తెచ్చిన అంతిమంగా మేమే గెలుస్తాం.
- అమరావతి స్థలాల్లో కచ్చితంగా పేద ప్రజలకు ఇల్లు కట్టిస్తాం.
10:50AM, Feb 26th, 2024
సీట్ల కేటాయింపు తర్వాత టీడీపీలో అసంతృప్త జ్వాలలు
- అసంతృప్త నేతలకు చంద్రబాబు బుజ్జగింపులు
- అలక పాన్పు ఎక్కిన నేతలకు సర్దిచెబుతున్న బాబు
- ఉమా, ఆలపాటి, గంటా, రమణ, పీలాతో మంతనాలు
10:20AM, Feb 26th, 2024
పవన్ ప్రకటించిన మొట్టమొదటి సీటు లాక్కున్న చంద్రబాబు
- ఆరిమిల్లి రాధాకృష్ణ కోసం జనసేనకి ఎర్త్ పెట్టిన చంద్రబాబు
- విడివాడ రామచంద్రరావుకి హ్యాండ్ ఇచ్చేసిన పవన్ కల్యాణ్
- వారాహి యాత్రలో క్షమాపణ చెప్పి సీటు ప్రకటించిన పవన్
- ఇప్పుడు మళ్లీ రెండోసారి హ్యాండ్ ఇచ్చిన పవన్ కల్యాణ్
- చంద్రబాబు ఎలా చెప్తే అలా తలాడిస్తున్న పవన్ కల్యాణ్
- భీమిలి సీటు కూడా మళ్లీ టీడీపీకే
- గంటా కోసం జనసేన సీటు లాక్కంటున్నచంద్రబాబు
- భీమిలి సీటులో పంచకర్ల సందీప్‌కి షాక్ ఇవ్వనున్న పవన్
- చంద్రబాబు ఏం చెప్పినా అంగీకరిస్తున్న పవన్
- పవన్ పూర్తిగా పార్టీని చంద్రబాబు చేతుల్లో పెట్టేశారని జనసేన నేతల మండిపాటు
10:05AM, Feb 26th, 2024
చిత్తూరులో బీసీలు ఆగ్రహం
- చిత్తూరు అసెంబ్లీ స్థానాన్ని ఆశించిన బీసీ నేత సీఆర్ రాజన్‌కు టీడీపీ మొండిచేయి
- మండిపడుతున్న బీసీ సామాజిక వర్గం
- శ్రీకాళహస్తి నుంచి కుప్పం వరకు బస్సు యాత్ర నిర్వహించి బీసీలను చైతన్యం చేయాలని నిర్ణయం
- మరొకవైపు బెంగళూరు నుంచి దిగుమతి చేసుకున్న గురజాల జగన్‌మోహన్ నాయుడుకు చిత్తూరు టికెట్ ఇవ్వడంపై కాపు నేతలు ఆగ్రహం
10:00AM, Feb 26th, 2024
టీడీపీ-జనసేన పొత్తుతో భగ్గుమంటున్న నేతలు
- పలుచోట్ల నిరసనలు, ర్యాలీలు
- ఆగ్రహంతో రగిలిపోతున్న సీట్లు దక్కని నేతలు
- పొత్తులతో అవకాశం కోల్పోయిన అసంతృప్తులు కూడా ఇదే దారి
9:20AM, Feb 26th, 2024
బీసీలంటే చంద్రబాబుకు చిన్నచూపు:
బీసీ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు
- జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు కేవలం 18 సీట్లే ఇచ్చి టీడీపీ అవమానించింది
- వైఎస్సార్‌సీపీ 50 శాతం బీసీలకు ఇచ్చింది
- బీసీలకు పెద్దపీట వేస్తున్నామని చంద్రబాబు చెప్పటం హాస్యాస్పదం
- వైఎస్సార్సీపీ బీసీలకు 50 శాతం సీట్లు ఇచ్చింది
- టీడీపీ కూడా 50 శాతం సీట్లు ఇవ్వాలి
9:00AM, Feb 26th, 2024
స్కిల్ కేసుపై నేడు విచారణ
- నేడు సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంపై విచారణ
- చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు విచారణ
- విచారణ జరుపనున్న జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం
8:15AM, Feb 26th, 2024
బాబు పల్లకీ మోసే కాపు ఎవరైనా పాపాత్ముడే..!
మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు
రంగాను చంపినా..
ముద్రగడను అవమానించినా..
బాబు పల్లకీ మోసే..
కాపు ఎవరైనా ఆపాత్ముడే.
రంగా ను చంపిన
— Ambati Rambabu (@AmbatiRambabu) February 26, 2024
ముద్రగడను అవమానించిన
బాబు పల్లకీ మోసే
కాపు ఎవరైనా పాపాత్ముడే! pic.twitter.com/3w7jbsFpyA
7:40AM, Feb 26th, 2024
చంద్రబాబుకు కేశినేని నాని కౌంటర్..
- సీఎం జగన్ నియమించిన సర్నాల తిరుపతిరావే మైలవరం అభ్యర్థి
- తిరుపతిరావుని మారుస్తారని ఎలాంటి అపోహ పెట్టుకోవద్దు
- సర్నాల తిరుపతిరావు పోటీ చేస్తున్నాడు.. గెలుస్తున్నాడు.. చరిత్ర తిరగరాయబోతున్నాడు
- వసంత కృష్ణ ప్రసాద్, దేవినేని ఉమాలే కాదు
- చంద్రబాబు, పవన్ నేరుగా కలిసిపోటీచేసినా గెలుపు తిరుపతిరావుదే
- తిరుపతిరావు 25వేల ఓట్ల మెజారిటీతో గెలవడం ఖాయం
- సాధారణ కార్యకర్తను నాయకుడు చేయగలిగిన ఒకే ఒక్కడు జగన్
- చంద్రబాబు 23 మంది కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చానని చెప్పుకుంటున్నాడు
- కానీ చంద్రబాబు అవకాశం ఇచ్చింది వాళ్ల డబ్బును చూసి మాత్రమే..
- 2014, 2019 ఎన్నికలకు భిన్నంగా 2024 ఎన్నికలు ఉండబోతున్నాయి
- 2014లో నమ్మి గెలిపిస్తే చంద్రబాబు ప్రజలను మోసం చేశాడు
- 2019లో ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించిన ప్రజలకు జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు
- సంక్షేమ పథకాలతో ప్రజలకు సీఎం జగన్‌పై నమ్మకం రెట్టింపు అయ్యింది
- ప్రజలు మళ్ళీ జగన్ ను సీఎంగా గెలిపించుకుంటారు
- ఈనాడు, టీవీ-5, ఏబీఎన్, టీడీపీ సోషల్ మీడియా ఫేక్ ప్రచారం చేస్తున్నాయి.
- రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన చంద్రబాబు మోసం చేసేందుకు పవన్‌తో కలిసి మళ్లీ వస్తున్నాడు
- అభివృద్ధిలేదన్న వారికి చెప్పండి.. మా ఊర్లో సచివాలయం ఉంది అని.
- పెన్షన్ నుంచి పథకాల వరకూ ఇళ్లకే వస్తున్నాయని చెప్పండి
- ముఖ్యమంత్రి జగన్ మన పిల్లలకు ఇంగ్లీష్ మీడియం తెచ్చారని చెప్పండి
7:15AM, Feb 26th, 2024
పవన్.. జీ హుజూర్..
- చంద్రబాబు ఎన్ని సీట్లిచ్చినా, ఏ సీట్లిచ్చినా పవన్ జీ హుజూర్
- జనసేన జుట్టును పూర్తిగా చేతిలోకి తీసుకున్న టీడీపీ
- గత ఎన్నికల్లో పవన్ పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చిన సీట్లూ టీడీపీకే.. అప్పట్లో జనసేనకు అరకొర ఓట్లు వచ్చిన సీట్లే ఇప్పుడు ఆ పార్టీకి
- 2019 ఎన్నికల్లో 15 స్థానాల్లో జనసేనకు 30 వేలకు పైగా ఓట్లు
- వాటిలో ఒకే ఒక్కటి ఇప్పుడు జనసేనకు... పి.గన్నవరం వంటి సీట్లూ హుళక్కే
- విజయవాడలోనూ జనసేన స్థావరాల్లోకి టీడీపీ చొరబాటు.. ఇక్కడ జనసేనకు ఎక్కువ ఓట్లు వచ్చిన రెండు సీట్లూ టీడీపీకే
- పవన్ కల్యాణ్ తీరుపై రగిలిపోతున్న పార్టీ వర్గాలు.. ఇలాగైతే ఓట్ ట్రాన్స్‌ఫర్ సాధ్యం కాదని బాహాటంగానే వ్యాఖ్యలు
7:00AM, Feb 26th, 2024
అనకాపల్లి టీడీపీలో అసంతృప్తి సెగలు
- అనకాపల్లి సీటు కొణతాలకు కేటాయించడంతో భగ్గుమన్న టీడీపీ నేతలు
- నల్ల బ్యాడ్జీలతో టీడీపీ కార్యకర్తల నిరసన
- పీలా గోవింద్ సత్యనారాయణకు సీటు ఇవ్వకపోవడంపై నిరసన
- గెలిచే సీటును టీడీపీకి కేటాయించలేదంటూ ఆ పార్టీ శ్రేణుల ఆగ్రహం
- పార్టీ నిర్ణయం కోసం సాయంత్రం వరకు గడువచ్చిన కార్యకర్తలు
- హై కమాండ్ స్పందించకపోతే తిరుగుబాటు చేస్తామని హెచ్చరిక
6:45 AM, Feb 26th, 2024
టీడీపీ, జనసేన పొత్తుపై మండిపడుతున్న కాపు నేతలు
- జనసేనకు 24 సీట్లే ఇవ్వడం బాధాకరం
- జనసేనను భూస్థాపితం చేయాలనే చంద్రబాబు కుట్ర
- 2009లో చంద్రబాబు ప్రజారాజ్యాన్ని భూస్థాపితం చేశారు
- తప్పుడు సమాచారంతో చిరంజీవిని ఎదగకుండా చేశారు
- రంగా సీఎం అయిపోతాడనే భయంతో హత్య చేయించారు
- నోటితో నవ్వి.. నొసటితో వెక్కిరించే వ్యక్తి చంద్రబాబు
- చంద్రబాబు తేనెపూసిన కత్తి లాంటివాడంటూ మండిపడుతున్న కాపు నేతలు
6:30 AM, Feb 26th, 2024
మైలవరం టీడీపీ టిక్కెట్ పై తేలని పంచాయతీ
- వసంత కృష్ణప్రసాద్ మైలవరం నుంచి టీడీపీ పోటీచేస్తారన్న ప్రచారం నేపధ్యంలో తనకే టిక్కెట్ కావాలంటున్న బొమ్మసాని సుబ్బారావు
- కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన బొమ్మసాని సుబ్బారావు
- మైలవరం టికెట్ పై ప్రజలు ఆందోళనలో ఉన్నారు
- ఇప్పటివరకు పార్టీ ఏ పిలుపునిచ్చినా కార్యక్రమాలు చేశా
- ధర్నాలు ...ర్యాలీలు చేసి ఎన్నో కేసులు పెట్టించుకున్నా పార్టీ గుర్తించలేదు
- జి.కొండూరులో కేసుల విషయంలో 35 రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉన్నా
- నియోజకవర్గం మొత్తం తిరగడం చేతకాక కాదు ... హైకమాండ్‌ను గౌరవించి తిరగలేదు
- 1990 నుండి రాజకీయాల్లో ఉన్నా పార్టీ పెద్దలు అర్ధం చేసుకోవాలి
- ఒక ఎమ్మెల్యే పార్టీ మారినంత మాత్రాన పార్టీకు ఉపయోగం ఉండదు
- నా సేవలు గుర్తించి చంద్రబాబు నాకు ఈసారికి టిక్కెట్ ఇవ్వాలి
Comments
Please login to add a commentAdd a comment