
AP Elections Political Latest Updates Telugu..
10:05 PM, Feb 28th, 2024
అది వాళ్లిద్దరి ఖర్మ: హరిరామ జోగయ్య
- చంద్రబాబు , పవన్ పై సంచలన కామెంట్ చేసిన మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు హరిరామజోగయ్య
- తెలుగుదేశం జనసేన బాగు కోరి నేనిచ్చే సలహా అధినేతలిద్దరికీ నచ్చినట్లు లేదు
- అది వారి ఖర్మ
- ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు
8:45 PM, Feb 28th, 2024
ఏసీబీ కోర్డు: స్కిల్ స్కాంలో లక్ష్మీనారాయణ పిటీషన్‌పై ముగిసిన వాదనలు
- లక్ష్మీనారాయణ పిటీషన్‌పై తదుపరి విచారణ మార్చి5 కి వాయిదా... అదే రోజు ఆదేశాలిస్తామన్న ఏసీబీ కోర్టు
- స్కిల్ స్కామ్ కేసులో అప్రూవర్‌గా మారడానికి అనుమతి కోరుతూ ఏసీబీకోర్టులో ఏసీఐ ఎండీ చంద్రకాంత్ షా పిటీషన్
- చంద్రకాంత్ షా పిటిషన్‌పై చంద్రబాబు కౌంటర్ దాఖలు చేయకుండా ఏ-2 నిందితుడు లక్ష్మీనారాయణచే పిటిషన్
- చంద్రకాంత్ షా పిటీషన్లో జతచేసిన డాక్యుమెంట్లు ఇవ్వాలని పిటీషన్‌లో పేర్కొన్న లక్ష్మీనారాయణ
- స్కిల్ కేసులో తాను కూడా ముద్దాయిగా ఉన్నందున డాక్యుమెంట్లు ఇవ్వాలని లక్ష్మీనారాయణ తరపు న్యాయవాదుల వాదనలు
- పిటీషన్‌లో చంద్రకాంత్ షా జతచేసిన డాక్యుమెంట్లు లక్ష్మీనారాయణకి ఇవ్వాల్సిన అవసరం లేదని వాదనలు వినిపించిన సీఐడీ అదనపు పీపీ జ్యోతి
- ఈ దశలో చంద్రకాంత్ షా స్టేట్ మెంట్ రికార్డు చేయకుండా అడ్డుకునే ప్రయత్నాలలో భాగమే లక్ష్మీనారాయణ పిటీషన్ అన్న అదనపు పీపీ
- చంద్రకాంత్ షా పిటీషన్లో జతచేసిన డాక్యుమెంట్లు ఇవ్వాలంటూ ఏ2 నిందితుడు, మాజీ ఐఎఎస్ లక్ష్మీనారాయణ పిటీషన్ చెల్లదని సీఐడీ తరపు వాదనలు
- ఇరువర్గాల వాదనలు ముగియడంతో మార్చి 5న తదుపరి ఆదేశాలు జారీచేస్తామన్న ఏసీబీ కోర్టు
- బోగస్ ఇన్వాయిస్‌లతో నిధులు స్వాహా చేశారని ఆధారాలతో సహా ఇప్పటికే పిటీషన్‌లో పేర్కొన్న చంద్రకాంత్ షా
- స్కిల్ కేసులో చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడైన ఏ-22 నిందితుడు యోగేష్ గుప్తా నిధుల అక్రమ తరలింపులో కీలక పాత్రగా పేర్కొన్న చంద్రకాంత్ షా
- స్కిల్ కేసులో ఏ-26 నిందితుడు సావన్ కుమార్ జజూతో కలిసి యోగేష్ గుప్తా 2016 లో తనని కలిసారన్న చంద్రకాంత్ షా
- డిజైన్ టెక్, స్కిల్లర్ కంపెనీలకి సాఫ్ట్ వేర్ సమకూర్చినట్లుగా బోగస్ ఇన్వాయిస్‌లు ఇవ్వాలని వారు కోరినట్లు పేర్కొన్న చంద్రకాంత్ షా
- ఏసీఐ కంపెనీ తరపున స్కిల్లర్ కంపెనీకి 18 బోగస్ ఇన్వాయిస్‌లు, డిజైన్ టెక్‌కి రెండు బోగస్ ఇన్వాయిస్‌లు ఇచ్చానన్న చంద్రకాంత్ షా
- బోగస్ ఇన్వాయిస్‌లు ఇచ్చినందుకు రూ.65 కోట్లు తన కంపెనీ ఖాతాలో నిధులు జమచేశారని వాంగ్మూలం
- అవే నిధులని సావన్ కుమార్ చెప్పిన పలు డొల్ల కంపెనీలకి మళ్లించానని చంద్రకాంత్ షా పిటీషన్
- ఆ రూ.65 కోట్ల నిధులనే టీడీపీ ఖాతాలోకి చేరినట్లుగా ఇప్పటికే సీఐడీ గుర్తింపు
6:44 PM, Feb 28th, 2024
లోకేష్ రెడ్ బుక్ బెదిరింపుల కేసు.. మరోసారి వాయిదా
- ఏసీబీ కోర్టులో లోకేష్ రెడ్ బుక్ బెదిరింపుల కేసు విచారణ మరోసారి వాయిదా
- కౌంటర్ దాఖలు చేయడానికి మళ్లీ సమయం కోరిన టీడీపీ లాయర్లు
- మార్చి 11 కి విచారణ వాయిదా
- గత రెండు నెలలగా ఏసీబీ కోర్టులో వాయిదాలతో నెట్టుకొస్తున్న టీడీపీ న్యాయవాదులు
- కేసు విచారణ జరగకుండా మొదటి నుంచి లోకేష్ యత్నాలు
- కౌంటర్ దాఖలు చేయాలని స్వయంగా ఏసీబీ కోర్టు ఆదేశాలని పట్డించుకోని లోకేష్
- యువగళం ముగింపు రోజు మీడియా ఛానెళ్ల ఇంటర్వ్యూలలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన లోకేష్
- చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించారని.. రిమాండ్ విధించడం తప్పంటూ ఏసీబీ న్యాయమూర్తిపై దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు
- అధికారులకు రెడ్ బుక్ పేరుతో బెదిరింపులు
- లోకేష్ రెడ్ బుక్ బెదిరింపులపై ఏసీబీ కోర్టులో రెండు నెలల క్రితం సీఐడీ పిటీషన్
- కౌంటర్ దాఖలు చేస్తే అడ్డంగా దొరికిపోతామనే భయంతో వాయిదాలు
- స్వయంగా ఏసీబీ కోర్టు నుంచి లోకేష్‌కి నోటీసులు జారీ
- ఏసీబీ కోర్టు ఆదేశాలని సైతం లెక్కచేయని లోకేష్
- నేటి విచారణలో మరోసారి వాయిదా కోరిన టీడీపీ లాయర్లు
5:39 PM, Feb 28th, 2024
పవన్ ప్రకటించిన 4 స్థానాల్లో అసంతృప్తి రగులుతోంది: రాయలసీమ బలిజ సంఘం
- పవన్ కల్యాణ్‌కు ఇచ్చిన 24 సీట్లలో కాపులు, బలిజలు ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు
- అందుకే కాపుల్లోనూ అసంతృప్తి ఉంది
- పవన్‌తో కాపులు, బలిజలకు పూర్తిస్థాయిలో న్యాయం జరగదు
- టీడీపీ హైకమాండ్‌తో మాట్లాడాలంటే కాపులు, బలిజలు యజ్ఞాలు చేయాల్సిన పరిస్థితి ఉంది: టీడీపీ నేత ఓవీ రమణ
4:54 PM, Feb 28th, 2024
మాగుంట వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి రియాక్షన్
- ఎంపీ మాగుంట వ్యాఖ్యలు పై ఎంపీ విజయసాయిరెడ్డి స్పందన
- రాజకీయ నేతలు ఎన్నికల సమయాల్లో రకరకాల కారణాల తో పార్టీ మారుతుంటారు
- వైస్సార్సీపీ లో ఆత్మగౌరవ సమస్య ఎప్పటికి తలెత్తదు
- పార్టీ మారే వారు అన్ని పార్టీలలో వుంటారు
- టీడీపి నుండి ఎంపీ కేశినేని నాని వైస్సార్సీపీ లో చేరారు...టీడీపీ లో నేతలకు ఆత్మగౌరవం లేదనుకోవాలా....?
- మాగుంట వ్యాఖ్యలు సరైనది కాదు
- వైస్సార్సీపీ లో చిన్న కార్యకర్త నుండి రాష్ట్ర స్థాయి నేత వరకు ఎనలేని గౌరవమర్యాదలు ఉంటాయి..
- పార్టీ మారే వారికి ఎవరికారణాలు వారికి ఉండొచ్చు
3:56 PM, Feb 28th, 2024
ఓవైపు సభ.. మరోవైపు జనసేన నిరసన
- తాడేపల్లి గూడెంలో టీడీపీ-జనసేన ఉమ్మడి సభ
- సభ నాడే జనసేన లో పెల్లుబికిన నిరసన జ్వాలలు
- ఏలూరులో జనసేన పార్టీ కార్యాలయంలో జనసైనికుల నిరసన
- తాడేపల్లిగూడెం లో బహిరంగ సభ ను బాయ్ కాట్ చేసిన ఏలూరు జనసేన పార్టీ నాయకులు
- నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని నిరసన
- నిరసనలో పాల్గొన్న జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు
- ఏలూరు సీటు జనసేనకు కేటాయించాలని నినాదాలు
- ఏలూరు నియోజకవర్గంలో జనసేన బలంగా ఉందని, పునరాలోచించాలని డిమాండ్
3:48 PM, Feb 28th, 2024
టీడీపీ- జనసేన ‘జెండా’కు డుమ్మా!
- తాడేపల్లిగూడెం తెలుగుజన విజయకేతనం సభకు కృష్ణాజిల్లా నేతలు డుమ్మా
- సభకు దూరంగా అవనిగడ్డ టీడీపీ శ్రేణులు
- మండలి బుద్ధప్రసాద్ కు టిక్కెట్ పై స్పష్టత ఇవ్వనందుకు సభను బాయ్ కాట్ చేసిన టీడీపీ క్యాడర్
- పెడన టిక్కెట్ టీడీపీకి కేటాయించడంతో అసంతృప్తితో రగిలిపోతున్న జనసేన నేతలు,శ్రేణులు
- ఉమ్మడి సభకు డుమ్మాకొట్టిన పెడన జనసేన నేతలు,కార్యకర్తలు
3:12 PM, Feb 28th, 2024
టీడీపీ ఓవరాక్షన్.. మాచర్లలో ఉద్రిక్తత
- పల్నాడు జిల్లా మాచర్లలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఓవరాక్షన్
- 28వ వార్డులోని ఇళ్లకు జెండాలు కొడుతున్న తెలుగుదేశం నాయకులు
- వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఇంటికి తెలుగుదేశం జెండా కట్టిన తెలుగుదేశం నాయకులు
- కట్టిన తెలుగుదేశం జెండా తీసేయాలని చెప్పిన కౌన్సిలర్ ఆయన భర్త మస్తాన్
- మస్తాన్ తో వాదనకు దిగి దాడికి పాల్పడిన తెలుగుదేశం నాయకులు
- వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై రాళ్లు రువ్విన తెలుగుదేశం నాయకులు
- వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు గాయాలు.. ఆస్పత్రికి తరలింపు
2:43PM, Feb 28th, 2024
నేను అలిగానని ప్రచారం చేస్తున్నారు: మాజీ మంత్రి బాలినేని
- ఈ ఐదు సంవత్సరాల లో ఎంప్లాయిస్ ఇబ్బంది పడ్డారు, కానీ, సియం మిమ్మల్ని గుండేల్లో పెట్టుకొన్నారు
- పీఆర్‌ఎసీ విషయంలో సీఎంతో మాట్లాడతా
- కొంతమంది నేను అలిగాను అని ప్రచారం చేస్తున్నారు
- నేను ప్రజలకోసమే ప్రశ్నిస్తా
- ఉన్న విషయం ఉన్నట్టుగా చెపుతా
- ఐదు సార్లు ఎమ్మెల్యే, రెండు సార్లు మంత్రిగా పని చేసా
- అవసరం అయితే రాజకియాలు మానుకొంటాను కాని ప్రశ్నించడం మానుకోను.
- డబ్బులు లేకనే మీకు పీఆర్‌సీ ఇవ్వలేదు.. త్వరలోనే వస్తాయి
- నిధులు కోసమే సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిశారు
- మీ వల్ల ఎమ్మెల్సీ అయిన అశోక్ బాబు మీ కోసం పోరాడలేదు
- మాగుంట శ్రీనివాస్ రెడ్ది కోసం పోరాడాను
- ఆయనతో పాటు టీడీపీలోకి పోవాలనుకోలేదు
- చిత్త శుద్దితో ఉంటే ఎవరు ఏమి మాట్లాడినా లెక్కచెయ్యక్కర్లేదు
- పార్టీ లో ఉండి ద్రోహం చేసే వ్యక్తి ని కాదు
- వైఎస్ రాజశేఖరరెడ్డి గారు చెప్పిన మాటలే నాకు ఆదర్శం
ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్ది ఆసక్తికర వ్యాఖ్యలు
2:18PM, Feb 28th, 2024
చంద్రబాబు అధికారం కోసమే.. : గొల్లపల్లి ఫైర్
- నన్ను మెడ పట్టి టీడీపీ నుంచి గెంటేశారు
- వైఎస్ జగన్ అక్కున చేర్చుకున్నారు
- ఉంటే ఉండు పోతే పో అన్నట్లు చూశారు
- అధికారం కోసం చంద్రబాబు మౌన మునిగా మారారు
- లోకేష్ దుర్మార్గపు ఆలోచనతో టీడీపీని నడిపిస్తున్నాడు
2:05PM, Feb 28th, 2024
వైఎస్సార్‌సీపీలో చేరిన గొల్లపల్లి సూర్యారావు
- టీడీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి గొల్లపల్లి
- ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో పార్టీలో చేరిన సూర్యారావు.
- నిబద్ధతతో పనిచేసినందుకు టీడీపీ అవమానించిందని ఆగ్రహం
- చంద్రబాబు నన్ను మెడ పట్టి గెంటేసినంత పనిచేశారు.
- సీఎం జగన్ నన్ను అక్కునచేర్చుకున్నారు.
1:40PM, Feb 28th, 2024
వాలంటీర్లు కుటుంబంలో ఒక భాగస్వామి: విడదల రజిని
- వాలంటీర్లు సేవా గుణం కలిగిన వారు.
- వాలంటీర్ అనగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుర్తుకు వస్తారు.
- వాలంటీర్ల వ్యవస్థ దేశంలోనే ఇది ఒక గొప్ప వ్యవస్థ.
- దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వలంటీర్ వ్యవస్థపై డిబేట్ జరుగుతుంది.
- వాలంటీర్లు కుటుంబంలో ఒక భాగస్వామి.
- ప్రతిపక్షాలు మిమ్మల్ని ఎప్పుడూ గుర్తించలేదు.
- ప్రతిపక్షాలు ఈ వ్యవస్థను తొలగించాలని చూస్తోంది.
1:15 PM, Feb 28th, 2024
టీడీపీ అభ్యర్థికి షాకిచ్చిన జనసేన నేతలు..
- వంగలపూడి అనితకు షాక్ ఇచ్చిన జనసేన నేతలు.
- పొత్తులో భాగంగా జనసేన నేతల ఇంటికి వెళ్లిన అనిత.
- తనకు మద్దతు తెలపాలని జనసేన నాయకులను కోరిన అనిత
- అనితకు మద్దతు ఇచ్చేది లేదని స్పష్టం చేసిన జనసేన నేతలు.
- గతంలో ఎమ్మెల్యేగా తమపై తప్పుడు కేసులు పెట్టారన్న జనసేన నాయకులు.
- గెలిచిన తర్వాత తమను మళ్లీ వేధించరన్న గ్యారెంటీ ఏమిటన్న నేతలు
12:30 PM, Feb 28th, 2024
టీడీపీలో రెండు టికెట్లపై పంచాయితీ..
- చిత్తూరు జిల్లా టీడీపీలో రెండు టికెట్లపై పంచాయితీ
- చంద్రబాబు నివాసానికి క్యూకట్టిన శ్రీకాళహస్తి, సత్యవేడు నేతలు
- నారా లోకేష్‌ను కలిసేందుకు శ్రీకాళహస్తి, సత్యవేడు నేతల ప్రయత్నం
- శ్రీకాళహస్తి టికెట్‌ను ఎస్సీవీ నాయుడుకు ఇవ్వాలంటోన్న అనుచరులు
- సత్యవేడు సీటును హెలెన్‌కు కేటాయించాలని కార్యకర్తల డిమాండ్
12:00 PM, Feb 28th, 2024
టీడీపీకి మాజీ మంత్రి గొల్లపల్లి గుడ్ బై రాజీనామా
- టీడీపీకి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు రాజీనామా
- పార్టీ కష్టపడితే అవమానించారని లేఖ
- రాజోలు టికెటివ్వలేదని ఆవేదన
- త్వరలో భవిష్యత్ కార్యాచరణ
- పొత్తులో భాగంగా టికెట్ జనసేనకు కేటాయించిన టీడీపీ
11:40 AM, Feb 28th, 2024
మా సంగతి ఏంటి బాబు?
- చంద్రబాబు ఇంటికి అసంతృప్త నేతలు
- ఇన్నాళ్లు ఆశ పెట్టి ఇప్పుడు టికెట్ లేదంటావా?
- వేర్వేరు సమావేశాలు నిర్వహించిన చంద్రబాబు
- అనంతపురం పార్లమెంటు స్థానం ఇవ్వాలని కోరిన జేసీ పవన్
- బీకే పార్ధసారధిని అనంతపురం నుంచి పోటీ చేయాలని చెప్పినట్టు ప్రచారం
- చంద్రబాబును కలిసిన శంకర్ యాదవ్, తిప్పేస్వామి
- ఇప్పుడు టికెట్ ఇవ్వలేనని చెప్పేసిన చంద్రబాబు
- కదిరి, హిందూపురం ఎంపీ సీటు కోరిన చాంద్ బాషా
- చంద్రబాబుతో అర్ధగంటపాటు భేటీ అయిన మాజీ మంత్రి నారాయణ
- ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురించి చర్చ
11:15 AM, Feb 28th, 2024
తంబళ్లపల్లిలో వెన్నుపోటా?
- చంద్రబాబును కలిసిన శంకర్ యాదవ్
- ఎలాంటి హామీ చంద్రబాబు ఇవ్వలేదంటున్న పార్టీ నేతలు
- పార్టీకోసం పని చేస్తే తర్వాత చూసుకుందామని సూచన
- టికెట్లు ఇచ్చేశాం, ఇప్పుడేం చేయలేనంటున్న చంద్రబాబు
10:30 AM, Feb 28th, 2024
వైఎస్సార్‌సీపీకి మాగుంట రాజీనామా
- ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి వైఎస్సార్‌సీపీకి రాజీనామా.
- టికెట్ నిరాకరించడంతో వైఎస్సార్‌సీపీకి మాగుంట రాజీనామా.
- 2014లో ఒంగోలు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఓడిపోయిన మాగుంట.
- 2019 ఎన్నికల్లో ఒంగోలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గెలిచిన మాగుంట.
- 2024 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నాయకత్వం టికెట్ నిరాకరించడంతో రాజీనామా.
10:00 AM, Feb 28th, 2024
చంద్రబాబు గుంపును చూసి భయపడే ప్రసక్తే లేదు: వెల్లంపల్లి శ్రీనివాస్
- సీఎం జగన్ చూసి ప్రతిపక్షాలకు వణుకు పుట్టి అందరూ కలిసి వస్తున్నారు.
- చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు ధైర్యం ఉంటే సింగల్‌గా పోటీ చేయండి.
- గుంపుల్లా వచ్చిన ఎవరేం చేయలేరు.
- సీఎం జగన్‌ను ఎదుర్కొనే సత్తా చంద్రబాబు, పవన్‌కు లేదు.
- సీఎం జగన్ ప్రజలతో పొత్తులో ఉన్నారు.
- చంద్రబాబు ఎప్పుడు పొత్తులతోనే పోటీ చేస్తాడు.
- ప్రజలకు మంచి చేసే వాడికి పొత్తులు ఎందుకు.
- మా టార్గెట్ కుప్పం.. అక్కడి నుండే గెలుచుకొని వస్తాం
- వారిద్దరికీ ఏ నియోజకవర్గం నుండి నిలబడాలో క్లారిటీ లేదు.
- కుప్పం, మంగళగిరి కచ్చితంగా ఓడిపోతారు.
- చంద్రబాబు గుంపును చూసి భయపడే పరిస్థితి లేదు.
09:30 AM, Feb 28th, 2024
భీమవరంలో కుర్చీ మడతేసిన పవన్
- జనసేన అధినేత పవన్ భీమవరంలో కుర్చీ మడతేశారు.
- భీమవరం కాదు పిఠాపురం నుంచి పవన్ పోటీ?
- పిఠాపురారంలో కాపుల ఓట్లు 91వేలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచే పవన్ పోటీ!
- భీమవరంలో 80వేల కాపు ఓట్లు ఉన్నాయి.
09:00 AM, Feb 28th, 2024
టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై సంచలన కామెంట్స్..
- బాలకృష్ణను హీరోయిన్లను వేధిస్తాడు.
- అర్ధరాత్రి తప్పతాగి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిటిస్టులపై వేధింపులు.
- అర్ధరాత్రి హీరోయిన్లు డోర్ కొట్టడం బాలకృష్ణకు అలవాటు.
- ఇప్పటికే రాధిక ఆప్టే, విచిత్ర, తదితరులను వేధించిన బాలయ్య.
- సినిమాల్లో స్త్రీ జనోద్ధారకుడిగా ఫోజులు.. అసలు రూపం మాత్రం ఇలా..
పేరుకేమో తెరపై అతను హీరో.. కానీ తెరచాటున మహిళల్ని లైంగికంగా వేధించే కామాంధుడు.
— YSR Congress Party (@YSRCParty) February 27, 2024
అవుట్ డోర్ షూటింగ్స్‌లో అర్ధరాత్రి తప్పతాగి హీరోయిన్లతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ల రూము దగ్గరికి వెళ్లి డోర్ కొట్టడం నందమూరి బాలకృష్ణకి అలవాటు. ఇప్పటికే రాధిక ఆప్టే, విచిత్ర తదితర హీరోయిన్లు తమని… pic.twitter.com/j04KVVUpBH
08:40 AM, Feb 28th, 2024
టీడీపీలో చల్లారని టికెట్ల చిచ్చు
- బాబుకు నిద్రలేని రాత్రిళ్లు!.. టీడీపీలో చల్లారని టికెట్ల చిచ్చు
- ఉండిలో రామరాజుకు సహకరించేది లేదన్న శివరామరాజు
- అవనిగడ్డ సీటు బుద్ధప్రసాద్‌కు ఇవ్వకపోవడంపై కేడర్ నిరసనలు
- పి.గన్నవరంలో మహాసేన రాజేశ్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ శ్రేణుల దాడి
- నిడదవోలు సీటుపై శేషారావు వర్గం ఆగ్రహజ్వాలలు
- కృష్ణాలో 4 నియోజకవర్గాల్లో తమ్ముళ్ల సిగపట్లు
- చంద్రబాబు వారించినా వెనక్కితగ్గని సీనియర్లు
08:15 AM, Feb 28th, 2024
కేశినేని నానితో టీడీపీ నేత గొల్లపల్లి భేటీ..
- ఎంపీ కేశినేని నాని కార్యాలయంలో కీలక నేతల భేటీ
- ఎంపీలు మిథున్ రెడ్డి, కేశినేని శ్రీనివాస్(నాని)తో భేటీ అయిన మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గొల్లపల్లి సూర్యారావు
- టీడీపీని వీడే ఆలోచనలో గొల్లపల్లి సూర్యారావు
- తెలుగుదేశం పార్టీలో సామాజిక అన్యాయం జరగడం లేదు.
- ముఖ్యమంత్రి జగన్ విధానాలు చాలా బాగున్నాయంటూ మెచ్చుకున్న సూర్యారావు
- వైస్సార్‌సీపీలోనే సామాజిక న్యాయం జరుగుతుందన్న సూర్యారావు
- ఎన్నికల్లో సామాజిక వర్గాల కూర్పు, సీనియర్ ,జూనియర్లకు అవకాశాలు కల్పిస్తున్న వైఎస్సార్‌సీపీ
- మెజారిటీ సామాజిక వర్గాలకు న్యాయం చేయడంతో ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందన్న గొల్లపల్లి.
07:40 AM, Feb 28th, 2024
లోకేష్ రెడ్ బుక్ బెదిరింపు కేసుపై నేడు విచారణ
- ఏసీబీ కోర్టులో నేడు మరోసారి లోకేష్ రెడ్ బుక్ బెదిరింపుల కేసు విచారణ
- గత రెండు నెలలగా ఏసీబీ కోర్టులో వాయిదాలు కోరుతూ వచ్చిన లోకేష్ న్యాయవాదులు
- కేసు విచారణ జరగకుండా మొదటి నుంచి లోకేష్ యత్నాలు
- యువగళం ముగింపు రోజు మీడియా ఛానెళ్ల ఇంటర్వ్యూలలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన లోకేష్
- చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించారు.
- రిమాండ్ విధించడం తప్పంటూ ఏసీబీ న్యాయమూర్తిపై దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు
- అధికారులకి రెడ్ బుక్ పేరుతో బెదిరింపులు
- లోకేష్ రెడ్ బుక్ బెదిరింపులపై ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్
- సీఐడీ పిటిషన్‌పై ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయకుండా లోకేష్ నాన్చుడు ధోరణి.
- రెడ్ బుక్ అంశంపై సీఐడీ నోటీసులని పట్టించుకోని లోకేష్
- స్వయంగా ఏసీబీ కోర్టు నుంచి నారా లోకేష్‌కు నోటీసులు జారీ
- ఏసీబీ కోర్టు ఆదేశాలని సైతం లెక్కచేయని లోకేష్
- ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయకుండా వాయిదాలు కోరుతూ వచ్చిన టీడీపీ లాయర్లు
07:25 AM, Feb 28th, 2024
కార్యకర్తల గురించి సీఎం వైఎస్ జగన్ ట్వీట్
- ఏ రాజకీయ పార్టీ కార్యకర్త అయినా తమ నాయకుడి గురించి కాలర్ ఎగరేసి చెప్పే పరిస్థితి ఉన్నప్పుడే ఆ పార్టీకి గౌరవం ఉంటుంది
- నేడు దేశ రాజకీయాల్లో విశ్వసనీయత ఉన్న ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీ మాత్రమేనన్న మాట రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో వినిపిస్తోంది.
- ఇప్పుడు మన కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్ళి, గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశామని ధైర్యంగా చెప్పే పరిస్థితి ఉంది
- రాష్ట్రంలోని 87 శాతం కుటుంబాలకు మన ప్రభుత్వంలో మంచి చేయగలిగామని చెప్పేందుకు గర్వపడుతున్నాను.
ఏ రాజకీయ పార్టీ కార్యకర్త అయినా తమ నాయకుడి గురించి కాలర్ ఎగరేసి చెప్పే పరిస్థితి ఉన్నప్పుడే ఆ పార్టీకి గౌరవం ఉంటుంది. నేడు దేశ రాజకీయాల్లో విశ్వసనీయత ఉన్న ఏకైక పార్టీ @YSRCParty మాత్రమేనన్న మాట రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో వినిపిస్తోంది.
— YS Jagan Mohan Reddy (@ysjagan) February 27, 2024
ఇప్పుడు మన కార్యకర్తలు ప్ర… pic.twitter.com/imHhONIv7h
07:00 AM, Feb 28th, 2024
YSRCP కీలక సమావేశంలో సీఎం జగన్ వ్యాఖ్యలు
► రానున్న 45 రోజులపాటు కీలకం
►మనం చేసిన మంచి పనులు.. చేసే మంచిని ప్రజలకు చెప్పండి..
►రాజకీయాల్లో విశ్వనీయత ముఖ్యం
►చంద్రబాబుకు విశ్వసనీయత లేదు
►2014లో చంద్రబాబు అది చేస్తాం ఇది చేస్తాం అంటూ హామీలిచ్చారు
►సాధ్యపడని హామీలను కూడా మేనిఫెస్టోలో పెట్టారు
►అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారు
►చంద్రబాబు ఇచ్చిన దొంగ హామీలు నాకు ఇంకా గుర్తుంది
►రైతు రుణాలు మాఫీ చేస్తానన్నాడు, బంగారం లోన్లు తీరుస్తానన్నాడు
►సాధ్యం కాని హామీలు ఇచ్చి మోసం చేశాడు
►అసలు అమలు సాధ్యం కాని హామీలు ఎలా ఇచ్చాడో చంద్రబాబుకే తెలియాలి
►ఒక హామీ ఒక నాయకుడు ఇచ్చాడంటే దానికి విశ్వసనీయత ఉండాలి
►తప్పుడు హామీలు ఎప్పుడు మనం ఇవ్వలేదు, ఇవ్వం కూడా
►మనం ఏది ఇవ్వగలమో.. అది చెబుతున్నాం
► 99 శాతం హామీలన్నింటిని నెరవేర్చాం
►దేశంలో విశ్వసనీయత ఉన్న ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీ
► మోసం ఎప్పుడూ నిలబడదు
► 2019లో మనం అమలు చేయగలిగే హామీలిచ్చాం
►ప్రజలకు గుర్తుండిపోయేలా 2019 మేనిఫెస్టో తెచ్చాం
► రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 151 నియోజకవర్గాల్లో విజయం సాధించాం
►మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయగలరా? అని అడిగారు
►ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేసి తీరతామని ఆనాడు చెప్పా
►ఇది చెప్పాం .. ఇది చేశాం అని ఇంటింటికి వెళ్లి చెప్పగలుగుతున్నాం
►మన పథకాలతో 87 శాతం పైచిలుకు కుటుంబాలకు సంక్షేమం అందిచాం
►కుప్పంలో 93 శాతం కుటుంబాలకు మేలు చేశాం
►కుప్పంలో 87 వేల ఇళ్లు ఉంటే.. 83 వేల ఇళ్లకు మంచి జరిగింది
► కుప్పంలో 45 వేల కుటుంబాలకు రూ.1,400 కోట్లు ఇచ్చాం
►రాష్ట్రవ్యాప్తంగా జగన్ బటన్ నొక్కడం.. పేదల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేశాం
► ఏకంగా రూ.2 లక్షల 55 వేల కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాలో జమ చేశాం
► మనం చేసిన మంచి చూసి ప్రత్యర్థుల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి
►57 నెలల్లో పూర్తి ప్రక్షాళన జరిగింది.. సంక్షేమ పాలన అందించాం
► పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం
►గతంలో వెయ్యి రూపాయలు ఉన్న ఫించన్.. 3 వేలకు చేశాం
► పేదలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుబాటులోకి తెచ్చాం
► ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి తెచ్చాం
► లంచాలు వివక్ష లేకుండా ప్రతీ ఇంటికి సంక్షేమం అందించాం
► నాడు-నేడు ద్వారా స్కూళ్ల రూపురేఖలు మార్చేశాం
►దిశ యాప్‌తో మహిళలకు భద్రత కల్పించాం
►దిశ యాప్‌తో పోలీసులు త్వరగా స్పందిస్తున్నారు
►ఫోన్ చేస్తే చాలూ మహిళలకు రక్షణ దొరుకుతోంది
►ఆరోగ్యశ్రీని అత్యుత్తమ స్థాయిలో విస్తరించాం
► లంచాలకు, వివక్షలకు తావు లేకుండా సంక్షేమ పాలన అందించాం
► ఇవాళ జరుగుతోంది కులాల మధ్య యుద్ధం కాదు
► ఓసీల్లో కూడా నిరుపేదలు ఉన్నారు
► పేదలు ఓవైపు ఉంటే.. పెత్తందారులు మరోవైపు ఉన్నారు
► జగన్ ఎప్పుడూ పేదల వైపే ఉంటాడు
►జగన్ గెలిస్తే పేదవాడికి న్యాయం జరుగుతుంది
►మీ జగన్ ఉంటే పేదవాడు బాగుపడతాడు
►జగన్ ఉంటే లంచాలు లేకుండా బటన్‌లు కొనసాగుతాయి
► జగన్ ఉంటేనే విలేజ్ క్లినిక్‌లు పని చేస్తాయి
►జగన్ రాకుంటే మళ్లీ జన్మభూమిలదే రాజ్యమవుతుంది
►45 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి
►వైఎస్సార్‌సీపీలో టికెట్ల ఎంపిక దాదాపు పూర్తైంది
► ఇప్పుడు ప్రకటించిన పేర్లే దాదాపుగా ఫైనల్ లిస్ట్
►దాదాపుగా టికెట్లు కన్‌ఫామ్ చేసినట్లే
►సంక్షేమం కొనసాగాలంటే జగనే సీఎంగా ఉండాలి
►జగన్ చేయగలిగింది మాత్రమే చెబుతాడు
►చంద్రబాబు మాత్రం ఎలాంటి అబద్ధం అయినా చెబుతాడు
►చంద్రబాబు మాత్రం తన అవసరాల కోసం ఎవరినైనా మోసం చేస్తాడు
►ప్రతీ ఒక్కరూ రెట్టించిన ఉత్సాహంతో ఓటర్లలోకి వెళ్లండి
►ప్రతీ ఒక్కరూ ప్రతీ ఇంటికి వెళ్లి జరిగిన మంచిని చెప్పండి
►జరిగిన మంచిని బాగా చెప్పగలిగితేనే విజయం సాధిస్తాం
►నా స్థాయిలో నేను చేయగలిగినదంతా చేశా
►ఇప్పుడు మీ వంతు..చేసిన మంచిని ఓటర్లకు చెప్పండి
06:50 AM, Feb 28th, 2024
నేడు టీడీపీ-జనసేన ఉమ్మడి సభ
- నేడు టీడీపీ – జనసేన ఉమ్మడి సభకు హాజరయ్యేవారు వేలల్లోనే
- ఏడు ఎకరాల్లో వేదిక, రెండు హెలిప్యాడ్‌లు, వీఐపీ రెస్ట్ రూమ్‌లు
- మిగతా 15 ఎకరాల్లో కార్యకర్తల కోసం 22 గ్యాలరీలు
- ఒక్కో గ్యాలరీలో 1,500 కుర్చీలు.. వచ్చేది 33 వేల మందే
06:40 AM, Feb 28th, 2024
మైలవరంలో శవరాజకీయాలు.. వాట్సాప్ వార్
- టీడీపీలోకి సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్
- వ్యతిరేకిస్తున్న దేవినేని ఉమా వర్గం
- తాజాగా.. ఐవీఆర్‌ఎస్ సర్వేలో వసంత పేరిట సర్వే
- నోటా నొక్కాలంటూ వాట్సాప్‌లో ప్రచారం
- ఇటీవలె పుల్లారావు అనే కార్యకర్త మృతి
- ఉమాకు టికెట్ దక్కదన్న ఆవేదనతోనే చనిపోయాడంటూ ఉమా వర్గీయుల ప్రచారం
- అనారోగ్యంతో చనిపోయాడంటున్న మరో వర్గం
- శవరాజకీయాలు మొదటి నుంచి అలవాటేనంటూ మరో వర్గం వాట్సాప్‌లో కౌంటర్
- పుల్లారావు తనయుడి ఆడియో రికార్డింగ్ పేరిట వాట్సాప్‌లో ఓ క్లిప్ వైరల్
06:30 AM, Feb 28th, 2024
టీడీపీలో టికెట్లపై సస్పెన్స్..!
- నిడదవోలు, రాజమండ్రి రూరల్ టికెట్ల పై సస్పెన్స్ కంటిన్యూ
- రెండు, మూడు రోజుల్లో అధికారికంగా అభ్యర్థుల ప్రకటన
- కడియపులంకలో జనసైనికులతో కందుల దుర్గేష్ భేటీ
- రాజమండ్రి రూరల్ సీటు గోరంట్ల బుచ్చయ్య కు ఖరారు
- తనకెందుకు ఇవ్వడం లేదని కందుల దుర్గేష్ ఆగ్రహం
- నిడదవోలులో పోటీ చేయాలని కందుల దుర్గేష్ కు జనసేన సూచన
- నిడదవోలు సీటును జనసేన కు ఇవ్వడం పై టీడీపీ శ్రేణుల ఆగ్రహం
- ఇలాగయితే ఓటు బదిలీ పక్కనబెట్టి మొత్తానికి మొత్తం మునుగుతామంటున్న రెండు పార్టీల నేతలు
Comments
Please login to add a commentAdd a comment