
AP Elections Political Latest Updates Telugu..
06:59PM. Feb 29th, 2024
24 సీట్లతో కక్కుర్తి పడి.. పవన్ అలా.. : గ్రంధి శ్రీనివాస్
- పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో టీడీపీ-జనసేనలకు షాక్
- ఇరు పార్టీల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 300 మంది కార్యకర్తలు..
- టీడీపీ జనసేన కార్యకర్త లకు పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్
ప్రభుత్వ విప్ గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ..
- జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీడీపీ , జనసేన పార్టీల నుండి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు
- ఐదు సంవత్సరాల కాలంలో యనమదుర్రు డ్రైన్ పై తొమ్మిది బ్రిడ్జిలను నిర్మించాము
- కులం మతం ప్రాంతం పార్టీ తేడా లేకుండా అందరికీ సంక్షేమాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నారు
- గతంలో జన్మభూమి కమిటీలద్వారా టీడీపీ నేతలు పేదలను దోచుకున్నారు
- 3,50,000 కోట్లు పేదల ఖాతాల అవినీతి లేకుండా చేరువు చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి
- మాటిస్తే మడమ తిప్పని నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి
- 600 హామీలు ఇచ్చి ప్రజలను దగా చేసిన నాయకుడు చంద్రబాబు
- డ్వాక్రా రుణమాఫీ నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ అంటూ ప్రజలను మోసం చేశాడు..చంద్రబాబు
- వెన్నుపోటు కి అబద్ధాలకి అసత్యాలకి, దగాకీ, మోసానికి నిలువుటద్దంచంద్రబాబు
- విశ్వసనీయతకు నిలువుటద్దం సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి
- 600 హామీలలో చంద్రబాబు ఎన్ని హామీలు నెరవేర్చారో ప్రజలకు చెప్పాలి....
- హైదరాబాద్ నేనే డవలప్ చేశాను అంటూ సొంత డబ్బా కొట్టుకునే వ్యక్తి చంద్రబాబు
- ఇచ్చిన హామీలను నెరవేర్చాను అని ఓటు అడిగే దమ్ము చంద్రబాబుకు లేదు
- మీ ఇంట్లో మేలు జరిగితేనే నాకు ఓటేయండి అని ధైర్యంగా అడుగుతున్న దేశం లోనే మొదటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి
- మెంటల్ ఇన్‌బ్యాలెన్స్‌తో తో పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నాడు
- 24 సీట్లతో కక్కుర్తి పడి.. చంద్రబాబు కాళ్ల దగ్గర ఇలా పడి ఉన్నాడు.. ఇది ఏంటని జనసేన కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు
- యువ రక్తం కావాలంటూ మరో వైపు పవన్ కల్యాణ్ 75 ఏళ్ల ముసలోడు చంద్రబాబుని కావాలంటున్నాడు
- ప్రశ్నిస్తానని అన్న పవన్ కల్యాణ్ చంద్రబాబు ఎన్ని తప్పులు చేసిన ప్రశ్నించలేదు
- పవన్ కల్యాణ్ కి దృష్టిదోషం ఉంది
- సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమం ఆయన కళ్ళకు కనపడటం లేదు
- పవన్ కల్యాణ్ ఒక మానసిక రోగిలా మారిపోయాడు
- పవన్ కల్యాణ్ నాలుగో పెళ్ళాం నాదెండ్ల మనోహర్.. అని ప్రజలు అనుకుంటున్నారు
- నాదెండ్ల మనోహర్ కి మీకు ఉన్న సంబంధం ఏంటి..
- పవన్ కల్యాణ్ వచ్చాక రాజకీయాల్లో తిట్ల పోకడలు వచ్చాయి..
- చంద్రబాబు పవన్ అధికారం లోకి వస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉంటాయా...?
- వీళ్ళకి ఓటు వేయకపోతే వారిని పాతాళానికి తొక్కేస్తారా ...? మక్కెల్లి ఇరగ తీస్తా తొక్కేస్తారా అంటూరా...?
- పేదల భవిష్యత్తుకు మేము ఇది చేస్తామని చెప్పటం లేదు పవన్ కల్యాణ్*
- జగన్మోహన్ రెడ్డి మీద ఈర్ష ద్వేషాలతోటి పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నాడు
- కాంగ్రెస్ పార్టీ ఎన్ని కేసులు పెట్టినా.. దడవని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి
- జగన్మోహన్ రెడ్డిని రోజు తలుచుకుంటూ తట్టుకోలేక విషం కక్కుతున్నారు
- పవన్ కల్యాణ్ ని సీఎం చేసుకోవాలని... జనసేన కార్యకర్తలు అనుకున్నారు
- జనసేన కార్యకర్తల ఆశలన్నీ కూడా అడియాసలు చేశాడు
- పవన్ కల్యాణ్ తల తీసుకెళ్లి చంద్రబాబు పాదాల దగ్గర పెట్టి కాపులను అవమానించాడు..
- పార్టీ కార్యకర్తల అభీష్టాలు కూడా గౌరవం ఇవ్వని వ్యక్తి పవన్ కల్యాణ్
- ఆత్మాభిమానం ఉన్నవారు ఎవరూ కూడా పవన్ కల్యాణ్ వెంట నడవరు...
- జనసేన నుండి పవన్ వైఖరికి విసిగిపోయిన కార్యకర్తలు,నాయకులు మా పార్టీలోకి వస్తే సాధారణంగా ఆహ్వానిస్తాం
06:38PM. Feb 29th, 2024
లోకేష్ దుర్మార్గాలను బయటపెడతా: గొల్లపల్లి సూర్యారావు
- చంద్రబాబు, నారా లొకేష్‌పై గొల్లపల్లి సూర్యారావు కీలక వ్యాఖ్యలు
- టీడీపీని వీడి తాజాగా వైఎస్సార్‌సీపీలో చేరిన సూర్యారావు
- తీవ్ర అవమానం జరగడం వల్లే బయటకు వచ్చానంటూ వ్యాఖ్య
- టీడీపీ పార్టీలో చంద్రబాబు ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు
- టీపీపీలో పనిచేసిన మాకు ఒక జెండాను కూడా ఇవ్వలేదు
- పార్టీ శ్రేయస్సు కోసం భారీగా ఖర్చుచేసి.. పార్టీ కోసం కష్టపడ్డ నాకు చంద్రబాబు అన్యాయం చేశారు
- సీనియర్ అని చూడకుండా నిర్లక్ష్యం చేశారు
- ఆయన కొడుకు లోకేష్ దుర్మార్గమైన ఆలోచనలతో ‘లోకేష్ రాజ్యాంగం’ తేవాలని కలలు కంటున్నారు
- త్వరలోనే లోకేష్ దుర్మార్గపు ఆలోచనలు బయటపెడతా
- టీడీపీలో దళితులకు అన్యాయం జరుగుతోంది
- కష్టపడి పనిచేసిన నన్ను.. చంద్రబాబు లోకేష్ అవమానకర పరిస్థితిలో మెడ పట్టుకుని బయటికి గెంటేశారు
06:21PM. Feb 29th, 2024
500 కోట్లా?.. ఈనాడుపై ఎమ్మెల్యే తోపుదుర్తి ఫైర్
- ఈనాడు అసత్య కథనాలపై ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మండిపాటు
- నేను 500 కోట్లు సంపాదించానట్టు ఈనాడు అసత్య ప్రచారం: ఎమ్మెల్యే ప్రకాష్
- ఖాళీ బాండు పైన సంతకం పెట్టి పంపిస్తా వాటిని మీరే అమ్మండి: ఎమ్మెల్యే ప్రకాష్
- నాకు నిజంగా 500 కోట్లు ఆస్తులు ఉంటే వాటిని అమ్మి నా నియోజకవర్గంలో ప్రతి ఇంటికి 50వేల రూపాయలు చంద్రబాబు చేతులపై పంచాలి: ఎమ్మెల్యే ప్రకాష్
- బహిరంగ సవాల్ విసిరిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.
06:08PM. Feb 29th, 2024
20 శాతం జనాభా ఉన్న కాపులకు 24 సీట్లా?: కొడాలి నాని
- చంద్రబాబు జెండాను పవన్ మోస్తున్నారు
- 20 శాతం జనాభా ఉన్న కాపులకు 24 సీట్లా?
- 3 శాతం ఉన్న వర్గానికి 31 సీట్లా?
- చంద్రబాబును సీఎం చేయడమే పవన్ లక్ష్యం
- చంద్రబాబు-పవన్ చేతిలో మోసపోయేందుకు ఎవరూ సిద్ధంగా లేరు
- జగన్‌ను పవన్ కల్యాణ్ తొక్కేయడం కాదు.. చంద్రబాబును 80 లక్షల పాదాలు పాతాళానికి తొక్కాయి
- పవన్ ఓటు బ్యాంకుతో గెలవాలనే స్థితికి చంద్రబాబు చేరుకున్నాడు
05:30PM. Feb 29th, 2024
టీడీపీ+ జనసే=0
- పవన్ కల్యాణ్ అంటే వ్యక్తిగతంగా గౌరవం ఉంది, కానీ..
- సినిమా నటుడిగానే ఆయన్ని గౌరవిస్తా
- పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికిరాడని గతంలోనే చెప్పాను
- చంద్రబాబు కోసం పవన్ ఇప్పుడు పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు
- పవన్‌ను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టే...
- పవన్ కల్యాణ్ ఎవరిని బెదిరిస్తున్నాడు?
- ఎవరినైనా ఎదిరించగలిగే శక్తి జగన్ అని జనసేన కార్యకర్తలే చెబుతారు
- చంద్రబాబు జైలుకు వెళ్తే పవన్ బాధపడ్డాడట
- ప్రజా నాయకుడు వంగవీటి రంగాను నడిరోడ్డుతో చంపినప్పుడు బాధ అనిపించలేదా?
- స్నేహం చేస్తే చచ్చేవరకు నాది స్నేహం అన్నాడు.. బీజేపీ, సీపీఐ-సీపీఎంలతో స్నేహం ఏమైంది?
- పవన్ నాలుగో పెళ్ళాం నాదెండ్ల మనోహర్
- జనసేన కార్యకర్తలు, కాపు సోదరులు పునరాలోచించుకోండి
- ఇప్పుడున్న రాజకీయాల్లో పవన్ కల్యాణ్ ఆటలో అరటిపండు మాత్రమే
- కొన్నాళ్ళకు పవన్ కల్యాణ్ తో పొత్తు పెట్టుకున్నందుకు చంద్రబాబే తల పట్టుకునే పరిస్థితి ఎదురవుతుంది..
- జనసేన ప్లస్ తెలుగుదేశం ఈక్వల్ టు జీరో
- పవన్ కల్యాణ్ మాట్లాడే సరికే జనం ఖాళీ అయిపోయారు .. ఇంక మీరు గెలవగలిగేదేముంది?
- టీడీపీ జనసేనలతో పొత్తు ఉందని ఇప్పటివరకు బిజెపి స్పష్టం చేయలేదు
- పవన్ కల్యాణ్ నాలుగో పెళ్ళాం నాదెండ్ల మనోహరే
- చంద్రబాబుకు పవన్ కల్యాణ్ కు మొగుడు జగన్మోహన్ రెడ్డి
- జెండా సభకు నారా లోకేష్ దూరంగా ఉండటంపై అంబటి సంచలన వ్యాఖ్యలు
- పిల్లిని సంకన పెట్టుకుని వెళ్లకూడదనే లోకేషన్ సభకు రానివ్వలేదు
- చంద్రబాబు అన్ని తెలిసినవాడు కావడం వల్లే లోకేష్ ను సభకు వద్దన్నారు
- లోకేష్ టీడీపీకి అపశకునం.. లోకేష్ వచ్చిన తర్వాతే టీడీపీ పరిస్థితి దారుణంగా దిగజారిపోయింది
04:55PM. Feb 29th, 2024
జనసేన, టీడీపీలదే లూటింగ్ టీమ్: వైవీ సుబ్బారెడ్డి
- పవన్ కల్యాన్‌పై ఉత్తరాంధ్ర వైఎస్సార్‌సీపీ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలు
- సినిమా డైలాగ్ లు చెప్పినంత ఈజీ కాదు రాజకీయాలు..
- వచ్చే ఎన్నికల్లో ఏపీలో జరిగేది క్లాస్ వార్, క్యాస్ట్ వార్ కాదు..
- జనసేన, టీడీపీలదే లూటింగ్ టీమ్..
- లూటి చేసిన దానికి స్కిల్ స్కాం ఒక ఉదాహరణ..
- 175 సీట్లు గెలవడం కోసమే వైఎస్సార్‌సీపీలో మార్పులు
03:45PM. Feb 29th, 2024
నగరి నియోజకవర్గంలో టీడీపీ అసమ్మతి సెగ
- టీడీపీ అభ్యర్థిగా గాలి భాను ప్రకాశ్‌కు టికెట్ కేటాయించడంపై అసంతృప్తి
- టీడీపీ నేత, సిద్దార్ధ ఇంజనీరింగ్ కాలేజీ అధినేత అశోక్ రాజు పార్టీకి రాజీనామా
- గాలి ముద్దు కృష్ణమ నాయుడి కుటుంబ తగాదాల వల్లే 2019 ఎన్నికల్లో టిడిపి ఓడిపోయింది.
- గాలి భానుప్రకాష్కు టికెట్ ఇవ్వడం వల్లే రాజీనామా
- రాయలసీమ జిల్లాల్లో క్షత్రియ కోటాలో నగరి నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన అశోక్ రాజు
- 2019 ఎన్నికల తరువాత కష్టపడ్డ తెలుగు దేశం పార్టీ నాయకులకు,కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలపలేదు
- చంద్రబాబు నాయుడు ఏకపక్ష నిర్ణయం వల్లే పార్టీకి రాజీనామా చేస్తున్నా
- నగరి నియోజకవర్గంలో గాలి భానుప్రకాష్ స్మగ్లింగ్ పాల్పడే వారితో, అసాంఘిక, సంఘ విద్రోహ కార్యకలాపాలు చేసే వారితో సావాసం చేస్తున్నాడు
- అతని ధోరణి నచ్చకే రాజీనామా
- చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకోలేదు
- నన్ను వైఎసస్సార్‌సీపీ సానుభూతి పరుడని కూడా ప్రచారం చేశారు
- ఎన్నికల్లో గాలి భానుప్రకాష్‌కు పనిచేయలేకే పార్టీకు రాజీనామా
03:30PM. Feb 29th, 2024
తాడేపల్లి
పవన్ జీవితంలో ఏనాడూ ఎమ్మెల్యే కూడా కాలేడు: నందిగం సురేష్, ఎంపీ
- సీఎం జగన్ అనే పేరు వింటేనే చంద్రబాబు, పవన్ కి భయం పుడుతోంది
- అందుకే నిన్నటి సభలో 200 సార్లు జగన్ పేరు ప్రస్తావించారు
- పావలా బిళ్ల కింద పడితే గోలగోల చేసినట్టే పవన్ మాట్లాడారు
- ఎవరి సలహాలు వద్దనటం వలనే చివరికి చంద్రబాబు పంచన చేరాల్సి వచ్చింది
- పవన్తో సినిమాలు తీయటానికి కూడా ఏ నిర్మాత ముందుకు రావటం లేదు
- ఎమ్మెల్యే కాలేక, సినిమాలు ఆఫర్లు లేక పవన్ ఫ్రస్టేషన్‌లో ఉన్నారు
- చంద్రబాబు, పవన్లు జెండాలు మార్చుకుని ఊపుకునే స్థితికి వెళ్లారు
- వివేకా హత్య వెనుక చంద్రబాబు ఉన్న సంగతి పవన్ కి తెలుసు
- తన స్వార్ధం కోసం కన్నతండ్రిపై కూడా పవన్ నీచంగా మాట్లాడారు
- ఊసకాళ్లతో ఉండే పవన్ తాడేపల్లిలో జగన్ ఇంటిని బద్దలు కడతాడంట
- గత ఎన్నికల్లో పవన్ ని రెండు చోట్లా జగన్ ఓడించి పాతాళంలోకి తొక్కారు
- 14 ఏళ్ల తన పాలనలాగే మళ్లీ చేస్తానని చంద్రబాబు చెప్పగలరా?
- తన వలన మేలు జరిగితేనే ఓటెయ్యమని సీఎం జగన్ ధైర్యంగా చెప్తున్నారు
- తన అభిమానులు, జగన్ ఒకేలా పవన్కి కనిపిస్తున్నారు
- అందుకే తనను ఎవరూ ప్రశ్నించవద్దని అంటున్నారు
- మళ్లీ జగన్ గురించి విమర్శలు చేస్తే పవన్ని రాజకీయంగా ఎలా తొక్కాలో మాకు తెలుసు
- డిపాజిట్టు కూడా రాని సీట్లు పవన్కి చంద్రబాబు ఇచ్చారు
విజయవాడ
03:15PM. Feb 29th, 2024
ఎన్నికల్లో మళ్ళీ విజయం సాధిస్తాం: జీడీ నెల్లూరు సమన్వయకర్త కృపా లక్ష్మీ కామెంట్లు
- సీఎం జగన్ మహిళలను రాజకీయంగా ప్రోత్సహిస్తున్నారు
- ఎస్సిలకు ఎవ్వరు ఇవ్వని ప్రాధాన్యం సీఎం జగన్ ఇస్తున్నారు
- నాపై జగనన్న పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా
- విద్యావంతులు, యువత, మహిళలను జగనన్న ప్రోత్సహిస్తున్నారు
- జీడీ నెల్లూరు వైఎస్సార్‌సీపీ పార్టీ కంచుకోట
- సీఎం జగన్ ప్రతి కుటుంబానికి మేలు చేశారు
- సీఎం జగన్ కి ఓటేసి ప్రజలు రుణం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు
- మా కుటుంబం ఎన్నో ఏళ్లుగా వైఎస్సార్‌సీపీ కుటుంబంతో నడుస్తోంది
- మా తండ్రి నారాయణ స్వామిని తొలి దళిత ఉప ముఖ్యమంత్రిని చేసిన ఘనత జగనన్నది
- ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీ లకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది జగనన్న
- వైఎస్ జగన్‌తో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం
- జీడీ నెల్లూరులో భారీ మెజారిటీ తో విజయం సాధిస్తాం
03:00PM. Feb 29th, 2024
విజయవాడ:
టీడీపీ-జనసేన జెండా సభ అట్టర్ ప్లాప్.. మంత్రి కొట్టు సత్యనారాయణ
- చంద్రబాబుకి... పవన్ కల్యాణ్‌కి మాత్రం సమన్వయం ఉంది
- టీడీపీ-జనసేన నేతల మధ్య సమన్వయం లేదు.. ఎవరిదారి వారే అన్నట్లుగా ఉంది
- 30 వేల మందికి ఏర్పాట్లు చేసి ఆరు లక్షల మంది అంటే ఎలా?
- సాయంత్రం 6 గంటల వరకు జనం లేక సభే ప్రారంభం కాలేదు
- అవినీతి అనకొండ అని గూగుల్ లో చూస్తే చంద్రబాబు అని వస్తుంది కానీ పవన్ కిమాత్రం చంద్రబాబు చాలా గొప్పగా కనిపిస్తున్నారు
- పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మా సామాజిక వర్గం చాలా నొచ్చుకుంటోంది
- చంద్రబాబు వెనకాల పవన్ చేతులు కట్టుకుని నిలబడటం... వెనకాలే వెళ్లడం ఏంటి?
- టీడీపీకి తలొగ్గాలన్న పవన్ మాటలు విని సభకి వచ్చిన కాపులు సిగ్గుతో చచ్చిపోయారు
- అయిదు సంవత్సరాలగా ప్రజలు సంతోషంగా ఉంటే పవన్ కే తెలియటం లేదు
- చంద్రబాబు అయిదేళ్ల రాక్షస పాలనని వదిలించుకోవడానికి ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చినా పవన్ కళ్యాన్‌కి బుద్ది రాలేదు
- నా పాలనలో మేలు జరిగితేనే ఓటు వేయండని జగన్ అంటున్నారు
- చంద్రబాబు పాలన అద్బుతం అని పవన్ అంటున్నారు
- పవన్కి సూటిగా సవాల్ విసురుతున్నా
- 2014 నుంచి 2019 మా అయిదేళ్ల పాలన చూసి ఓటు వేయండని చెప్పడానికి మీరు సిద్దంగా ఉన్నారా
- మా అయిదేళ్ల పరిపాలన చూసి ఓటు వేయండని చంద్రబాబు, పవన్, పప్పు చెప్పగలరా
- నీకు 24 సీట్లు ఇచ్చింది చంద్రబాబు కాదా?
- చంద్రబాబుని అద:పాతాళానికి తొక్కేస్తానని పవన్ వామనుడి కధ చెప్పారేమో
02:45PM. Feb 29th, 2024
అంబేద్కర్ కోనసీమ జిల్లా
జనసేన ఇన్‌ఛార్జిల్లో అలుముకున్న అసంతృప్తి
- అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మారుతున్న రాజకీయ సమీకరణాలు
- తెలుగుదేశం, జనసేన అభ్యర్థుల ప్రకటన తర్వాత వేడేక్కిన అసమ్మతి
- టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు
- పీ. గన్నవరంలో మహాసేన రాజేష్ కు సహకరించని టీడీపీ, జనసేన కేడర్
- పవన్ కల్యాణ్ నిర్ణయం కోసం కొత్తపేట నేత బండారు శ్రీనివాస్ ఎదురుచూపులు
- ముమ్ముడివరంలో దాట్ల బుచ్చిబాబుకే మల్లాడి కృష్ణారావు మద్దతు ... వేచి చూసే ధోరణిలో జనసేన
- అమలాపురం, రామచంద్రాపురం అభ్యర్థులపై ఇంకా రాని స్పష్టత
- జనసేన ఇంచార్జ్ ల్లో అలుముకుంటున్న అసంతృప్తి
01:55PM. Feb 29th, 2024
నెల్లూరు:
ఉదయగిరి టీడీపీ లో చల్లారని అసంతృప్తి జ్వాలలు
- మాజీ ఎమ్మెల్యే బొల్లినేనిని కాదని.. ఎన్‌ఆర్‌ఐ కాకర్ల సురేష్‌కి టికెట్ ఇవ్వడంపై కార్యకర్తలు ఆగ్రహం
- కలిగిరిలో కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు ఆత్మీయ సమావేశం
- హాజరైన నియోజకవర్గ ముఖ్య నేతలు
- ఉదయగిరి అభ్యర్థిత్వంపై అధిష్టానం పునరాలోచించుకోవాలని కార్యకర్తల డిమాండ్..
01:50PM. Feb 29th, 2024
పవన్ వ్యాఖ్యలకు మంత్రి రోజా కౌంటర్
- పవన్ కల్యాణ్ ఫ్రస్టేషన్ పీక్స్‌కి చేరింది
- 30 సీట్లు కూడా తెచ్చుకోలేని పవన్ ఇష్టమొచ్చినట్లు మట్లాడుతున్నాడు
- చంద్రబాబు మాయలో పవన్ పడిపోయారు
- 24 సీట్లు తీసుకొని... కార్యకర్తలకు పవన్ అన్యాయం చేశారు
- రిషికొండలో అద్భుతమైన భవనం నిర్మిస్తున్నాం
- ముఖ్యమంత్రి రిషికొండలో ఉండాలని కమిటి నిర్ణయించింది
- క్యాంప్ ఆఫీసు కాకపోతే.. టూరిస్టు ప్లేస్ గా ఉంటుంది
01:20PM. Feb 29th, 2024
టీడీపీ, జనసేన సభలో కేవలం జగన్ నామస్మరణే చేశారు: పేర్ని నాని
- వారికి ఎందుకు ఓటేయాలో బాబు, పవన్ చెప్పలేకపోయారు
- ప్రజల క్షేమం, రాష్ట్ర క్షేమం చంద్రబాబు పవన్‌కు పట్టదు
- కాపుల ఆత్మగౌరవాన్ని పెంచే ఒక్కమాట కూడా చెప్పలేదు
- పవన్ సినిమా డైలాగ్‌లు బట్టీకొట్టారు
- పవన్‌కు చేతనైతే సీఎం జగన్‌పై చేసిన ఆరోపణలు నిరూపించాలి
- సీఎం జగన్ వద్ద బేరాలు ఉండవు
- యుద్ధం చూపిస్తానన్న పవన్ 2014, 2019లో ఏం చేశారు
- 2019లో పవన్ అమరావతి ఒక కులానికే రాజధాని అన్నారు
- ఇవాళ అమరావతే రాజధాని అంటున్నారు
- పవన్ తనను నమ్ముకున్న వాళ్లను నట్టేట ముంచుతున్నారు
- పవన్ వామనుడు కాదు శల్యుడు, శికండిలాంటి వాడు
- వివేకా హత్య నిందితులు పవన్, చంద్రబాబుతో అంటకాగుతున్నాడు
- పవన్ సభలో అన్నీ సొల్లు కబుర్లే చెప్పాడు
01:14PM. Feb 29th, 2024
టీడీపీ, జనసేన జెండా సభ అట్టర్ ప్లాప్ : మంత్రి కొట్టు సత్యనారాయణ
- పవన్ కు సవాల్ విసురుతున్నా
- టీడీపీ పాలన చూసి ప్రజలు ఓటు వేయాలని పవన్ అడగాలి
- పవన్ నిర్ణయాలతో కార్యకర్తలు నీరుగారిపోయారు
- కాపులను, కార్యకర్తలను పవన్ నట్టేట ముంచారు
- సభలో వారి అజెండా ఏంటో చెప్పలేకపోయారు
- పవన్ కు కాసులపై ఆశ తప్ప.. ఆశయం లేదు
- జగన్ ని అధ: పాతాళానికి తొక్కేయడానికి మీరెవరు?
- టీడీపీ జెండా మోయడమే జనసేన పార్టీ అజెండా
01:08PM. Feb 29th, 2024
ఉదయగిరిలో పోటీ చేసి తీరుతా : బొల్లినేని
- 14 ఏళ్లుగా ఉదయగిరి ఇన్ఛార్జిగా పని చేశా
- టీడీపీ క్యాడర్ మద్దతు నాకే ఉంది
- చంద్రబాబు దృష్టికి కార్యకర్తల అభిప్రాయం తీసుకెళ్తా
- ఆఖరి ప్రయత్నంగా చంద్రబాబును కలుస్తా
- చంద్రబాబు వద్దు అన్నా పోటీ చేయడం ఖాయం
01:05PM. Feb 29th, 2024
చిరంజీవి కనీసం ఒకచోటైనా గెలిచాడు...పవన్ రెండు చోట్ల ఓడిపోయిన వ్యక్తి : ఎంపీ కేశినేని నాని
- పవన్ తెలంగాణాలో ఉంటూ ఏపీలో గెస్ట్ రోల్
- జనసైనికుల అభిమానాన్ని బాబుకు ప్యాకేజ్ గా అమ్మేశాడు
- చంద్రబాబు దగ్గర ముష్టి 24 సీట్లు తీసుకున్నాడు
- చంద్రబాబు, లోకేష్ రాష్ట్రానికి చీడ పురుగులు
- స్పెషల్ ప్యాకేజీ ఇస్తే ఫస్ట్ లిస్టు, మామూలు ప్యాకేజ్ ఇస్తే రెండో లిస్టులో సీట్లు ఇస్తున్నాడు
- ఏం ప్యాకేజ్ లేని వాళ్లకు సీట్లు లేవు
- సీట్లు అమ్మడంలో లోకేష్ నంబర్ వన్
01:00PM. Feb 29th, 2024
గుమ్మనూరు ఫ్యామిలీకి టికెట్ కేటాయింపు పై తర్జనభర్జన
- ఆలూరు, గుంతకల్లులో జయరాం టికెట్ పై టిడిపి కేడర్ లో అసంతృప్తి
- రెండో విడతలో ఎంత మంది సీనియర్లకు తగ్గుతున్న ఆశలు
- సీనియర్ల సీట్ల పై ఎటూ తేల్చుకోలేకపోతున్న టీడీపీ అధిష్ఠానం
- ఎచ్చెర్ల, పెందుర్తి, దెందులూరు, మైలవరం, పెనమలూరు, గురజాల సీట్ల పై రాని క్లారిటీ
- కళా, బండారు, చింతమనేని, దేవినేని, యరపతినేని టికెట్ల పై అస్పష్టత
12:59PM. Feb 29th, 2024
- వైఎస్సార్‌సీపీలో చేరిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్
- సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఇంతియాజ్
12:30PM. Feb 29th, 2024
చంద్రబాబుపై మండిపడుతున్న బ్రాహ్మణ సంఘాలు
- సరిపల్లి రాజేష్(మహాసేన రాజేష్)కు పి గన్నవరం టికెట్ ఇవ్వడంపై బ్రాహ్మణుల నిరసన
- బ్రాహ్మణులను కించపరిచిన రాజేష్‌కు టికెట్ ఎలా ఇస్తారు?
- చంద్రబాబుకు వ్యతిరేకంగా బ్రాహ్మణ సంఘాల నిరసన
- బ్రాహ్మణులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్
12:10PM. Feb 29th, 2024
విజయవాడ
మరోసారి అధికారంలోకి వచ్చేది వైఎస్సార్‌సీపీనే: దేవినేని అవినాష్
- గంగానమ్మగుడి రోడ్డు 22వ డివిజన్ లో 4వ రోజు గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం
- తూర్పు నియోజకవర్గంలో రూ. 650 కోట్ల తో అభివృద్ధి పనులు , రూ. 950 కోట్ల సంక్షేమ పథకాలు అమలు చేశాం
- సీఎం జగన్‌లాంటి నాయకుడు భవిష్యత్‌లో లేకుంటే ఇబ్బందులు పడతారని ప్రజలు అనుకుంటున్నారు
- మరోసారి అధికారంలో సీఎం జగన్ ప్రభుత్వమే
- పేదలకు ఏ సమస్య వచ్చినా మేము అందుబాటులో ఉంటున్నాం
- కరోనా సమయంలో ఒక్క టీడీపీ నాయకుడు అయిన బయటకి వచ్చారా ?
- తాడేపల్లి టీడీపీ జనసేన మీటింగ్ చూశాక చంద్రబాబుకి వచ్చిన కష్టం ఎవరికి రాకూడదు
- చంద్రబాబు గతంలో చిరంజీవికి చేసిన మోసం మర్చిపోలేము
- పవన్ కల్యాణ్‌కి చంద్రబాబు ఇచ్చిన కౌగిలి విష కౌగిలిలా ఉంది
12:02PM. Feb 29th, 2024
అనంతపురం:
బయటపడ్డ కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు ప్రలోభాలు
- టీడీపీ కార్యక్రమాలకు వచ్చే వారికి డబ్బు పంపిణీ చేస్తున్న అమిలినేని సురేంద్ర బాబు వర్గీయులు
- డబ్బు ఇచ్చి జనసమీకరణ చేసిన అమిలినేని సురేంద్ర బాబు
- కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్ర బాబు కు కళ్యాణదుర్గం టిక్కెట్ ఖరారు చేసిన చంద్రబాబు
- తొలిసారిగా కళ్యాణదుర్గం వచ్చిన అమిలినేని సురేంద్ర బాబు
- డబ్బు, మద్యం పంపిణీ చేసిన అమిలినేని సురేంద్ర బాబు వర్గీయులు
- వైరల్‌గా మారిన టీడీపీ డబ్బు మద్యం పంపిణీ దృశ్యాలు
12:00PM. Feb 29th, 2024
ఇటు అభివృద్ధి, అటు సంక్షేమం ప్రజలకు అందిస్తూ ముందుకు సాగుతున్నాం: తిరుపతి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి భూమన అభినయ్‌రెడ్డి
- తిరుపతి 46 డివిజన్‌లో స్థానిక మహిళలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న భూమన అభినయ్ రెడ్డి
- గత నాయకులు రాజకీయ అవసరాల కోసం జీవకోన అభివృద్ధిని గాలికి వదిలేశారు, కానీ తాము అధికారంలోకి వచ్చాక జీవకోన రూపురేఖలు మార్చాం
- గతంలో మీరు ప్రయాణించే రోడ్లు ఇరుకాటి సంధులతో ఇబ్బందికరంగా ఉండేవి, ఇప్పుడు విస్తరణ చేపట్టి చేసి సీసీ రోడ్లు నిర్మించాం, దీంతో ట్రాఫిక్ సమస్యలు తీరాయి.
- అలాగే ప్రజలకి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాం, నగరాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దాం, కేవలం రెండున్నర సంత్సరాల కాలంలోనే 18మాస్టర్ ప్లాన్ రోడ్లు, 7ఫ్రీ లెఫ్ట్‌లు, 5స్లిప్ వేలను వేసి నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మార్చాం, భవిష్యత్తులో మరో 14 మాస్టర్ ప్లాన్ రోడ్లు నిర్మించాం
- జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయి,
- ఇటు అభివృద్ధి.. అటు సంక్షేమం ప్రజలకు అందిస్తూ ముందుకు సాగుతున్నాం.
- ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని అభ్యర్థిస్తున్నా
11:32AM, Feb 29th, 2024
- కోనసీమ: పి.గన్నవరం టీడీపీ, జనసేనలో విభేదాలు
- అయినవిల్లి వినాయకుడి టెంపుల్‌లో పూజలు చేసి, ఎన్నికల ప్రచారం ప్రారంభించిన మహాసేన రాజేష్
- టీడీపీ అభ్యర్థి రాజేష్ ఎన్నికల ప్రచారానికి ఇరు పార్టీ నేతల డుమ్మా
11:02AM, Feb 29th, 2024
తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన సభ అట్టర్‌ఫ్లాప్: మంత్రి అమర్నాథ్
- సిద్ధం సభకు వచ్చిన జనాభాలో 10 శాతం కూడా రాలేదు
- టీడీపీ, జనసేన కూటమి వల్ల క్యాష్ ట్రాన్స్‌ఫర్ అయ్యిందే తప్ప, ఓటు కాదు
- కాపుల్లో బలం ఉంద్న పవన్.. 24 సీట్లకే ఎందుకు పరిమితం అయ్యారు?
- కాపుల ఓట్ల కోసం పవన్‌ను చంద్రబాబు వాడకుంటున్నారు
10:31AM, Feb 29th, 2024
రైతులకు సంబంధించి ఇచ్చిన హామీని సీఎం జగన్ నెరవేర్చారు: మంత్రి కాకాణి
- నాలుగు విడతల్లో 67,500 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసాం
- 57 నెలల పరిపాలనలో రైతులకు చేసిన లబ్దిని వారికీ గర్వంగా చెబుతున్నాం
- ప్రకృతి విపత్తులు వల్ల నష్టపోయిన రైతులకు గత ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వకపోతే వాటిని కూడా మా ప్రభుత్వమే ఇచ్చింది
- ప్రభుత్వం నిర్ణయించిన దాని కన్నా ఎక్కువ ధరకు దాన్యాన్ని రైతులు అమ్ముకునేలా చర్యలు తీసుకుంటున్నాం
- బేషరతుగా రుణమాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు.. మాట తప్పి వారిని మోసం చేశారు
- చంద్రబాబు హయాంలో ఒక్క రైతైనా సంతోషంగా ఉన్నారా..? అయన దరిద్రుడు కాబట్టే కరువు కాటకాలు విలయతాండవం చేసాయి
- నీరు చేట్టు పథకం పేరుతో టీడీపీ నేతలు 50 వేల కోట్లు దోచుకున్నారు
- పిచ్చి, ఉన్మాదం దాటి పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నాడు
- నేను పిచ్చోడ్ని.. నన్ను నమ్మొద్దు అన్నట్లుగా నిన్నటి సభలో పవన్ మాట్లాడారు
- చంద్రబాబు, పవన్ వామనావతారం ఎత్తి కార్యకర్తలను తొక్కేస్తున్నారు
10:10AM, Feb 29th, 2024
వారి అజెండా ఏమిటో ప్రజలకు చెప్పలేకపోయారు: మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ఱ
- తాడేపల్లిగూడెంలో జరిగిన టీడీపీ-జనసేన సమావేశంలో వారి అజెండా ఏంటో చెప్పలేకపోయారు
- కాసుల కోసం ఆశ, ఆశయం లేని పవన్ కల్యాణ్ పార్టీని నడుపుతున్నాడు
- నిన్నటి సభలో చంద్రబాబు జూనియర్ ఆర్టిస్ట్‌గా మిగిలిపోయారు
- స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అత్యధిక ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్‌దే
- జగన్‌ని అధఃపాతాళానికి తొక్కేయడానికి మీరెవరు?
- ప్రజాస్వామ్యవాదులంతా ఆలోచించాల్సిన సమయం వచ్చింది
- జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించేందుకే తాడేపల్లిగూడెంలో సభ పెట్టారు
- ప్రజాస్వామ్యంలో యుద్ధాలు చేయాల్సిన అవసరం ఉండదు
- టీడీపీ జెండా మోయడమే జనసేన పార్టీ అజెండా
- జనసేన పార్టీ క్యాడర్‌లో ఆత్మస్థైర్యాన్ని పవన్ పాడు చేస్తున్నాడు
9:27AM, Feb 29th, 2024
కాకినాడ:
పవన్ కల్యాణ్‌కు కాపు ఉద్యమ నేత ముద్రగడ లేఖ
- రెండు పర్యాయాలు కిర్లంపూడి వస్తానని మీరు నాకు కబురు పంపారు
- ఎలాంటి కోరికలు లేకుండా మీతో కలుస్తానని చెప్పడం జరిగింది
- అన్ని వర్గాలకు న్యాయం చేయాలని ఆశించి మీతో కలిసి సేవ చేయాలనుకున్నాను
- కానీ మీరు నన్ను కలవడానికి మీకు ఎన్నో చోట్ల అనుమతులు అవసరం
- మీ నిర్ణయాలు మీ చేతుల్లో లేవు
- పవర్ షేరింగ్ అనేది లేదని అర్ధమైంది
- మీ 24 సీట్ల కోసం నా అవసరం రాదు.. రాకూదనే భగవంతున్ని కోరుకుంటున్నాను
- మీలా గ్లామర్ ఉన్నవాన్ని కాకపోచ్చు
- ప్రజల్లో పరపతి లేకపోవడం వల్ల మీ దృష్టిలో లాస్ట్ గ్రేడ్ వ్యక్రిగా, తుప్పు పట్టిన ఇనుములా గుర్తించారు
8:30 AM, Feb 29th, 2024
చంద్రబాబు, లోకేష్‌లు అవమానించారు: ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి
- టీడీపీలో ఉన్నాన్నాళ్లు ఛీత్కారాలు ఎదుర్కొన్నా
- అందుకే నాలుగేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్నాను
- టీడీపీలో కుట్రలు, కుతంత్రాలతో రాజకీయాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది
- అయితే తన అనుచరులు, కార్యకర్తలు తిరిగి రాజకీయ ప్రవేశం చేయాలంటున్నారు
- ఆ సమయంలో ఎవరితో పోరాటం చేశానో అలాంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తనకు స్నేహహస్తం అందించారు
- సీఎం వైఎస్ జగన్ ఆహ్వానం మేరకు తాను వైఎస్సార్‌సీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నా
7:30 AM, Feb 29th, 2024
తుస్సుమన్న టీడీపీ–జనసేన (టీజే) తొలి బహిరంగ సభ
- 6 లక్షల మంది వస్తారని ఊదరగొట్టిన నేతలు
- కిందా మీదా పడి 40–50 వేల మందికే పరిమితం
- పొత్తుకు తమ మద్దతు లేదని స్పష్టం చేసిన ఇరు పార్టీల కేడర్
- రెండు పార్టీలకు పట్టున్న జిల్లాలో సభ పెట్టినా నిరాశే
- తక్కువ స్థలంలో జనం కిక్కిరిసేలా చేసి పోటెత్తినట్లు చూపాలని వ్యూహం
- ఆ మేరకు కూడా ఆయా పార్టీల శ్రేణులు రాక బెడిసిన స్కెచ్
- ఖాళీగా కనిపించిన సగం గ్యాలరీలు.. బాబు ప్రసంగానికి స్పందన కరువు
7:25 AM, Feb 29th, 2024
టీడీపీలో రాజీనామా ప్రకంపనలు
- మాజీ మంత్రి గొల్లపల్లి రాజీనామాతో కోనసీమ టీడీపీలో కష్టాలు
- పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్న ఉండి శివరామరాజు
- అదే దారిలో పయనించనున్న మండలి బుద్ధప్రసాద్
- ప్రత్యామ్నాయం చూసుకుంటున్న బూరగడ్డ వేదవ్యాస్
- తుది నిర్ణయం తీసుకుంటానన్న మాజీ ఎమ్మెల్యే బొల్లినేని
- ఐవీఆర్‌ఎస్ సర్వేపై అనంతలో వెల్లువెత్తిన నిరసనలు
- ఫలించని చంద్రబాబు బుజ్జగింపులు
7:20 AM, Feb 29th, 2024
175 స్థానాల్లో గెలుపే లక్ష్యం: విజయసాయిరెడ్డి
- ప్రజల నుంచి మంచి స్పందన ఉంది
- 3న జరగాల్సిన సిద్ధం సభ 10కి మార్పు
- రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాల్లో వైఎస్సార్‌సీపీ గెలుపొందడం ఖాయం
7:10 AM, Feb 29th, 2024
కేంద్ర వాణిజ్య శాఖ గణాంకాల్లో బట్టబయలైన బాబు మాటల బురిడీ
- బాబు హయాంలో కంటే సీఎం జగన్ హయాంలో రాష్ట్రంలో మూడు రెట్లు పెరిగిన వాస్తవ పెట్టుబడులు
- 2014–18 మధ్య రాష్ట్రంలోకి వచ్చి న పెట్టుబడులు రూ.32,803 కోట్లే
- 2019 నుంచి 2023 జూన్ వరకు వచ్చి న పెట్టుబడులు రూ.1,00,103 కోట్లు
- రెండేళ్లు కరోనా ఉన్నా భారీ పెట్టుబడులను ఆకర్షించిన జగన్ సర్కారు.. 2022లో రూ.45,217 కోట్ల పెట్టుబడులు తేవడం ద్వారా దేశంలోనే అగ్రస్థానం
7:05 AM, Feb 29th, 2024
వైఎస్సార్‌సీపీ ఎనిమిదో జాబితా విడుదల..
- అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ఐదుగురు సభ్యులతో కూడిన ఎనిమిదో జాబితా విడుదల
- గుంటూరు.. కిలారు రోశయ్య
- పొన్నూరు.. అంబటి మురళి
- ఒంగోలు ఎంపీ.. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
- కందుకూరు.. బుర్రా మధుసూదన్ యాదవ్
- జి.డి. నెల్లూరు.. కల్లత్తూరు కృపాలక్ష్మి.
7:00 AM, Feb 29th, 2024
ఏసీబీ కోర్డు: స్కిల్ స్కాంలో లక్ష్మీనారాయణ పిటీషన్‌పై ముగిసిన వాదనలు
- లక్ష్మీనారాయణ పిటీషన్‌పై తదుపరి విచారణ మార్చి5 కి వాయిదా... అదే రోజు ఆదేశాలిస్తామన్న ఏసీబీ కోర్టు
- స్కిల్ స్కామ్ కేసులో అప్రూవర్‌గా మారడానికి అనుమతి కోరుతూ ఏసీబీకోర్టులో ఏసీఐ ఎండీ చంద్రకాంత్ షా పిటీషన్
- చంద్రకాంత్ షా పిటిషన్‌పై చంద్రబాబు కౌంటర్ దాఖలు చేయకుండా ఏ-2 నిందితుడు లక్ష్మీనారాయణచే పిటిషన్
- చంద్రకాంత్ షా పిటీషన్లో జతచేసిన డాక్యుమెంట్లు ఇవ్వాలని పిటీషన్‌లో పేర్కొన్న లక్ష్మీనారాయణ
- స్కిల్ కేసులో తాను కూడా ముద్దాయిగా ఉన్నందున డాక్యుమెంట్లు ఇవ్వాలని లక్ష్మీనారాయణ తరపు న్యాయవాదుల వాదనలు
- పిటీషన్‌లో చంద్రకాంత్ షా జతచేసిన డాక్యుమెంట్లు లక్ష్మీనారాయణకి ఇవ్వాల్సిన అవసరం లేదని వాదనలు వినిపించిన సీఐడీ అదనపు పీపీ జ్యోతి
- ఈ దశలో చంద్రకాంత్ షా స్టేట్ మెంట్ రికార్డు చేయకుండా అడ్డుకునే ప్రయత్నాలలో భాగమే లక్ష్మీనారాయణ పిటీషన్ అన్న అదనపు పీపీ
- చంద్రకాంత్ షా పిటీషన్లో జతచేసిన డాక్యుమెంట్లు ఇవ్వాలంటూ ఏ2 నిందితుడు, మాజీ ఐఎఎస్ లక్ష్మీనారాయణ పిటీషన్ చెల్లదని సీఐడీ తరపు వాదనలు
- ఇరువర్గాల వాదనలు ముగియడంతో మార్చి 5న తదుపరి ఆదేశాలు జారీచేస్తామన్న ఏసీబీ కోర్టు
- బోగస్ ఇన్వాయిస్‌లతో నిధులు స్వాహా చేశారని ఆధారాలతో సహా ఇప్పటికే పిటీషన్‌లో పేర్కొన్న చంద్రకాంత్ షా
- స్కిల్ కేసులో చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడైన ఏ-22 నిందితుడు యోగేష్ గుప్తా నిధుల అక్రమ తరలింపులో కీలక పాత్రగా పేర్కొన్న చంద్రకాంత్ షా
- స్కిల్ కేసులో ఏ-26 నిందితుడు సావన్ కుమార్ జజూతో కలిసి యోగేష్ గుప్తా 2016 లో తనని కలిసారన్న చంద్రకాంత్ షా
- డిజైన్ టెక్, స్కిల్లర్ కంపెనీలకి సాఫ్ట్ వేర్ సమకూర్చినట్లుగా బోగస్ ఇన్వాయిస్‌లు ఇవ్వాలని వారు కోరినట్లు పేర్కొన్న చంద్రకాంత్ షా
- ఏసీఐ కంపెనీ తరపున స్కిల్లర్ కంపెనీకి 18 బోగస్ ఇన్వాయిస్‌లు, డిజైన్ టెక్‌కి రెండు బోగస్ ఇన్వాయిస్‌లు ఇచ్చానన్న చంద్రకాంత్ షా
- బోగస్ ఇన్వాయిస్‌లు ఇచ్చినందుకు రూ.65 కోట్లు తన కంపెనీ ఖాతాలో నిధులు జమచేశారని వాంగ్మూలం
- అవే నిధులని సావన్ కుమార్ చెప్పిన పలు డొల్ల కంపెనీలకి మళ్లించానని చంద్రకాంత్ షా పిటీషన్
- ఆ రూ.65 కోట్ల నిధులనే టీడీపీ ఖాతాలోకి చేరినట్లుగా ఇప్పటికే సీఐడీ గుర్తింపు
6:50 AM, Feb 29th, 2024
లోకేష్ రెడ్ బుక్ బెదిరింపుల కేసు.. మరోసారి వాయిదా
- ఏసీబీ కోర్టులో లోకేష్ రెడ్ బుక్ బెదిరింపుల కేసు విచారణ మరోసారి వాయిదా
- కౌంటర్ దాఖలు చేయడానికి మళ్లీ సమయం కోరిన టీడీపీ లాయర్లు
- మార్చి 11 కి విచారణ వాయిదా
- గత రెండు నెలలగా ఏసీబీ కోర్టులో వాయిదాలతో నెట్టుకొస్తున్న టీడీపీ న్యాయవాదులు
- కేసు విచారణ జరగకుండా మొదటి నుంచి లోకేష్ యత్నాలు
- కౌంటర్ దాఖలు చేయాలని స్వయంగా ఏసీబీ కోర్టు ఆదేశాలని పట్డించుకోని లోకేష్
- యువగళం ముగింపు రోజు మీడియా ఛానెళ్ల ఇంటర్వ్యూలలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన లోకేష్
- చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించారని.. రిమాండ్ విధించడం తప్పంటూ ఏసీబీ న్యాయమూర్తిపై దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు
- అధికారులకు రెడ్ బుక్ పేరుతో బెదిరింపులు
- లోకేష్ రెడ్ బుక్ బెదిరింపులపై ఏసీబీ కోర్టులో రెండు నెలల క్రితం సీఐడీ పిటీషన్
- కౌంటర్ దాఖలు చేస్తే అడ్డంగా దొరికిపోతామనే భయంతో వాయిదాలు
- స్వయంగా ఏసీబీ కోర్టు నుంచి లోకేష్‌కి నోటీసులు జారీ
- ఏసీబీ కోర్టు ఆదేశాలని సైతం లెక్కచేయని లోకేష్
- నేటి విచారణలో మరోసారి వాయిదా కోరిన టీడీపీ లాయర్లు
6:40 AM, Feb 29th, 2024
ఓవైపు సభ.. మరోవైపు జనసేన నిరసన
- తాడేపల్లి గూడెంలో టీడీపీ-జనసేన ఉమ్మడి సభ
- సభ నాడే జనసేన లో పెల్లుబికిన నిరసన జ్వాలలు
- ఏలూరులో జనసేన పార్టీ కార్యాలయంలో జనసైనికుల నిరసన
- తాడేపల్లిగూడెం లో బహిరంగ సభ ను బాయ్ కాట్ చేసిన ఏలూరు జనసేన పార్టీ నాయకులు
- నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని నిరసన
- నిరసనలో పాల్గొన్న జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు
- ఏలూరు సీటు జనసేనకు కేటాయించాలని నినాదాలు
- ఏలూరు నియోజకవర్గంలో జనసేన బలంగా ఉందని, పునరాలోచించాలని డిమాండ్
6:30 AM, Feb 29th, 2024
టీడీపీ ఓవరాక్షన్.. మాచర్లలో ఉద్రిక్తత
- పల్నాడు జిల్లా మాచర్లలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఓవరాక్షన్
- 28వ వార్డులోని ఇళ్లకు జెండాలు కొడుతున్న తెలుగుదేశం నాయకులు
- వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఇంటికి తెలుగుదేశం జెండా కట్టిన తెలుగుదేశం నాయకులు
- కట్టిన తెలుగుదేశం జెండా తీసేయాలని చెప్పిన కౌన్సిలర్ ఆయన భర్త మస్తాన్
- మస్తాన్ తో వాదనకు దిగి దాడికి పాల్పడిన తెలుగుదేశం నాయకులు
- వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై రాళ్లు రువ్విన తెలుగుదేశం నాయకులు
- వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు గాయాలు.. ఆస్పత్రికి తరలింపు.