
AP Elections Political Latest Updates Telugu..
06:05 PM, Jan 16, 2024
టిడిపి మెడకు చుట్టుకున్న స్కిల్ స్కాం
- చంద్రబాబు కేసుతో ఇరుకునపడ్డ తెలుగుదేశం
- ఎన్నికల ముందు పెద్దషాక్ తగిలిందని టిడిపి నేతల అంతర్మథనం
- కేసు కొట్టేస్తారన్న ఊపులో భారీ ర్యాలీలు జైలు నుంచి చేశామని ఆవేదన
- ఇంత చేసినా.. రిమాండ్ సరైందని కోర్టు చేప్పిందని టిడిపి నేతల ఆందోళన
సుప్రీంకోర్టు ఏం చెప్పింది.?
- చంద్రబాబు అరెస్టు, రిమాండ్ విషయంలో జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు
- అవినీతి నిరోధక కేసుల్లో గవర్నర్ అనుమతి అవసరం అన్న జస్టిస్ అనిరుద్ధ బోస్
- అయితే ఐపీసీ సెక్షన్ల నమోదు చేసిన అభియోగాలు కొనసాగుతాయని స్పష్టం చేసిన జస్టిస్ బోస్
- గవర్నర్ అనుమతి తీసుకొని అవినీతి నిరోధక చట్టం కూడా అమలు చేయవచ్చన్న జస్టిస్ బోస్
- జస్టిస్ అనిరుద్ధ బోస్ అభిప్రాయంతో విభేధించిన జస్టిస్ బేలా త్రివేది
- చంద్రబాబు కేసులో 17ఏ అవసరం లేదు, అది వర్తించదన్న జస్టిస్ బేలా త్రివేది
- స్కిల్ స్కాంలో చంద్రబాబును ఐపీసీ, పీసీ యాక్ట్ రెండింటి ప్రకారం విచారించాల్సిందే అన్న జస్టిస్ బేలా త్రివేది
- భిన్న అభిప్రాయాల నేపధ్యంలో కేవలం 17ఏ వర్తిస్తుందా లేదా అనే విషయాన్ని తేల్చడానికి… సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు నివేదన
- చంద్రబాబు అరెస్టు, రిమాండ్ సమర్ధించిన ఇద్దరు న్యాయమూర్తులు… చంద్రబాబుకు ఊరట ఇవ్వడానికి నిరాకణ
- చంద్రబాబు అరెస్టు విషయంలో సీఐడీ తీసుకున్న నిర్ణయాలను సమర్ధించిన ఇద్దరు న్యాయమూర్తులు
- రిమాండ్ విషయంలో ఏసీబీ కోర్టు నిర్ణయాన్ని పూర్తిగా సమర్ధించిన ఇద్దరు న్యాయమూర్తులు
- చంద్రబాబు అరెస్టు విషయంలో ఎలాంటి రాజకీయ కక్ష్య సాధింపు లేదని స్పష్టం చేసిన ఇద్దరు న్యాయమూర్తులు
- చంద్రబాబు అరెస్టు విషయంలో ఏపీ ప్రభుత్వం ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోలేదని ఇద్దరు న్యాయమూర్తుల స్పష్టీకరణ
- స్కిల్ స్కాం కేసులో సీఏం హోదాలో చంద్రబాబు అవినీతి, నమ్మక ద్రోహం పాల్పడినట్లు తీవ్రమైన అభియోగాలున్నాయన్న ఇద్దరు న్యాయమూర్తులు
- చంద్రబాబు అరెస్టు, రిమాండ్ విషయంలో ఏపీ ప్రభుత్వం నిర్ణయం చట్ట ప్రకారమే ఉందన్న ఇద్దరు న్యాయమూర్తులు
- 17ఏ వర్తింపు విషయంలో ఒక న్యాయమూర్తి అనుకూలంగా మరో న్యాయమూర్తి వ్యతిరేకమైన అభిప్రాయం
- చంద్రబాబుపై ఉన్న అభియోగాలను కొట్టేసేందుకు నిరాకరించిన ఇద్దరు న్యాయమూర్తులు
- గవర్నర్ అనుమతి తీసుకుని పీసీ యాక్ట్లో సైతం విచారణ చేయవచ్చన్న జస్టిస్ అనిరుద్ధ బోస్
- రాజకీయ కక్ష్య సాధింపు అని చంద్రబాబు చేసిన ఆరోపణలను కొట్టి పారేసిన ఇద్దరు న్యాయమూర్తులు
- ఎలాంటి ఆధారాలు లేవన్న చంద్రబాబు వాదనను తొసిపుచ్చిన ఇద్దరు న్యాయమూర్తులు
- స్కిల్ స్కాంలో సెక్షన్ 409 ప్రకారం చంద్రబాబును విచారించేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
- సెక్షన్ 409 ప్రకారం నేరం రుజువైతే చంద్రబాబుకు జీవితఖైదు శిక్షపడే అవకాశం
- సెక్షన్ 409ను కొట్టేయాలని చంద్రబాబు చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఇద్దరు న్యాయమూర్తులు
- సెక్షన్ 120బీ కొనసాగుతుందని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
- సెక్షన్ 10బీ ప్రకారం నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని చంద్రబాబుపై పెట్టిన అభియోగాలను కొట్టేయడానికి నిరాకరించిన ఇద్దరు న్యాయమూర్తులు
- చంద్రబాబుపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేసేందుకు నిరాకరించిన ఇద్దరు న్యాయమూర్తులు
- చంద్రబాబును విచారించేందుకు పూర్తి ఆధారాలున్నాయని అభిప్రాయపడ్డ సుప్రీంకోర్టు
- స్కిల్ స్కాంలో చంద్రబాబును విచారించేందుకు ఏసీబీ కోర్టుకు విచారణ పరిధి ఉందని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
- ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించడం సబబే అన్న ఇద్దరు న్యాయమూర్తులు
05:45 PM, Jan 16, 2024
కిం కర్తవ్యం.? ఎన్నికలొచ్చాయి.. మన వాదన నెగ్గలేదు: టిడిపిలో అంతర్మథనం
- ఈ నెల 18న గుడివాడలో చంద్రబాబు సభ
- ఇవ్వాళ సుప్రీంకోర్టులో చంద్రబాబుకు షాక్
- ఇప్పటివరకు సుప్రీంకోర్టుపై నమ్మకం పెట్టుకున్న తెలుగుదేశం
- పక్కాగా కేసు అని సుప్రీంకోర్టు అని తేల్చిచెప్పడంతో కిమ్మనకుండా మిగిలిపోయిన క్యాడర్
- ఇవ్వాళ అంతా సోషల్ మీడియాలో రుసరుసలు
- వచ్చే వంద రోజులు ఎన్నికల కాలం
- ప్రజలకు ఏం చెబుదాం? చంద్రబాబు అమాయకుడు అని ఒప్పించలేం కదా.!
- గుడివాడ సభకు ముందే తగ్గిన నీరసపడ్డ టిడిపి
05:30 PM, Jan 16, 2024
ఆ రకంగా పొత్తు కోసం ప్రయత్నాలు
- బీజేపీ మాజీమంత్రి కామినేని శ్రీనివాస్ తో నాదెండ్ల మనోహర్ భేటీ
- గుంటూరు జిల్లా తెనాలిలో ఆత్మీయ సమావేశం యడ్లపాటి వెంకట్రావు నివాసంలో కామినేని, నాదెండ్ల అల్పాహారం
- యడ్లపాటి వెంకట్రావుకు నివాళి అర్పించడానికే వచ్చాం
- ఇది రాజకీయ భేటీ కాదు... కేవలం ఆత్మీయ సమావేశమే
- ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేసేది బీజేపీ - జనసేన - టీడీపీ ముఖ్యనేతలు చూసుకుంటారు : కామినేని శ్రీనివాస్
05:15 PM, Jan 16, 2024
పండగకు రాజకీయం అంటగడతారా?
- వామపక్షాలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఫైర్
- భారతీయ సంస్కృతి సాంప్రదాయాలంటే కమ్యూనిస్టులకు ఎందుకంత చులకన?
- దేశంలో కమ్యూనిస్టులు చైనా వేడుకలు జరపాలని అనుకుంటున్నారా?
- విశాఖ వేదికగా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తే తప్పేంటి? : జీవీఎల్
05:00 PM, Jan 16, 2024
రేపు సుప్రీంకోర్టులో బాబు మరో కేసు
- రేపు సుప్రీంకోర్టులో చంద్రబాబు ఫైబర్ నెట్ కేసు విచారణ
- పిటిషన్ ను విచారించనున్న జస్టిస్ బోస్, జస్టిస్ త్రివేది ధర్మాసనం
04:15 PM, Jan 16, 2024
తెనాలి సీటుపై టీడీపీ-సేన మధ్య వార్
- టీడీపీ-జనసేన మధ్య సీట్ల వార్ మొదలైంది
- గుంటూరులో తెనాలి సీటుపై సస్పెన్స్
- తెనాలి సీటు నాదే అంటున్న జనసేన నేత నాదేండ్ల మనోహర్
- ప్రజా పాదయాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న టీడీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్
- ఆలపాటితో సమావేశమైన టీడీపీ కార్యకర్తలు
- తెనాలి సీటు జనసేనకిస్తే పనిచేసే ప్రసక్తేలేదని తేల్చి చెప్పిన కార్యకర్తలు
03:30 PM, Jan 16, 2024
ప్రజా కోర్టులో చంద్రబాబుకు శిక్ష తప్పదు: మంత్రి అమర్నాథ్
- ఎల్లో మీడియా చంద్రబాబుకు ఊరట కలిగిందని తప్పుడు ప్రచారం చేస్తున్నాయి.
- సుప్రీం కోర్టులో చంద్రబాబుకు ఎలాంటి ఊరట లభించలేదు.
- 17 A సెక్టన్ అమలులోకి రాకముందు ఉన్న కేసు స్కిల్ డెవలప్మెంట్ కేసు.
- మేము ఎక్కడ తప్పు చేయలేదని చంద్రబాబు మాట్లాడడం లేదు..
- నేను అవినీతికి పాల్పడలేదని చంద్రబాబు చెప్పడం లేదు..
- చంద్రబాబుకు స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధం లేదని ఏక్కడ చెప్పలేదు.
- 2015లో ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు దొరికినప్పుడు సెక్షన్-8 అమల్లో ఉందని తప్పించుకొనే ప్రయత్నం చేశారు.
- బెయిల్ మీద తిరుగుతున్న దొంగ చంద్రబాబు.
- ఎల్లో మీడియా ప్రచారంతో ప్రజలను తప్పుతోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.
02:45 PM, Jan 16, 2024
చంద్రబాబుకు మంత్రి అంబటి కౌంటర్
- స్కిల్ స్కాం కేసులో సుప్రీంకోర్టు తీర్పులపై స్పందించిన మంత్రి అంబటి రాంబాబు
- నేరస్తుడిని ఏ న్యాయస్థానం కాపాడదంటూ కామెంట్స్
"నేరస్తుడిని"
— Ambati Rambabu (@AmbatiRambabu) January 16, 2024
ఏ న్యాయస్థానమూ కాపాడదు! @ncbn
02:30 PM, Jan 16, 2024
బాబు గోబెల్స్ ప్రచారానికి తెర పడింది: పొన్నవోలు సుధాకర్ రెడ్డి
- సుప్రీంకోర్టు ఉత్తర్వులను స్వాగతిస్తున్నాం
- చంద్రబాబు పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఎక్కడా అనుమతించలేదు
- రాజకీయ కక్ష అంటూ చంద్రబాబు చేసిన వాదనను సుప్రీంకోర్టు తీసిపుచ్చింది
- కొన్ని అబద్దాలను ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని చంద్రబాబు ప్రచారం చేయించారు
- అసలు చంద్రబాబును అరెస్ట్ చేస్తారా అంటూ ఊగిపోయారు
- నేరం బయటపడేసరికి గవర్నర్ అనుమతి అంటూ సాంకేతిక కోణాలు వెతికారు
- ఇన్నాళ్లు చేసిన విష ప్రచారం తప్పని తేలిపోయింది
- సుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబు తీరు తేటతెల్లమయింది
- ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నానికి సుప్రీంకోర్టు తీర్పుతో అడ్డుకట్ట పడింది
- బాబు గోబెల్స్ ప్రచారానికి, ఎల్లో మీడియా అసత్యాలకు తెరపడింది
02:10 PM, Jan 16, 2024
చంద్రబాబుకు దక్కని ఊరట
- 17ఏ అమలు విషయంలో మాత్రమే భిన్నాభిప్రాయాలు
- మిగతా అన్ని అంశాల్లో ఇద్దరు న్యాయమూర్తులది ఒకటే తీర్పు
- అసలు కేసును కొట్టేయాలన్న (క్వాష్ చేయాలన్న) వాదన అసమంజసం, దీనిని తిరస్కరించింది సుప్రంకోర్టు
- ఇప్పుడయినా గవర్నర్ అనుమతి తీసుకోవచ్చన్న సుప్రీంకోర్టు సూచన ఏం చెబుతుందంటే.. నేరం జరిగింది, దర్యాప్తును కూడా పక్కాగా చేయమని మాత్రమేనని స్పష్టమవుతోంది
- ఈ కేసులో సెక్షన్ 409 కొనసాగుతుంది, నేరం రుజువయితే యావజ్జీవ ఖైదు చంద్రబాబుకు తప్పదు
- అలాగే ఈ కేసులో 120B కూడా కొనసాగుతుంది.
- అంటే ఈ కేసులో IPC మరియు PC act (అవినీతి నిరోధక చట్టం) రెండూ కొనసాగుతాయి
- మొత్తమ్మీద ఈ కేసులో చంద్రబాబుకు ఎలాంటి ఊరట దక్కలేదు
02:00 PM, Jan 16, 2024
బాబుకు ఇది భారీ భంగపాటే
- సుప్రీంకోర్టు తీర్పుపై న్యాయనిపుణులు
- ఇక ఈ కేసు నుంచి తప్పించుకోవడం అసాధ్యం
- రిమాండ్ సబబే, విచారణ కొనసాగుతుంది
- ఈ కేసుకు ఎలాంటి రాజకీయ కక్షను ముడిపెట్టలేం
- రిమాండ్‌ను తప్పుపట్టలేమని సుప్రీంకోర్టు స్పష్టం చెప్పింది
- ఈ కేసులో నేరం జరిగింది, నిధుల మళ్లింపు జరిగింది, విశ్వాస ఘాతుకం చోటు చేసుకుంది
- అరెస్ట్‌పై అభ్యంతరాన్ని లేవనెత్తుతూ కేసు కొట్టేయాలన్న వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది
01:50 PM, Jan 16, 2024
జస్టిస్ బేలా త్రివేది
- చంద్రబాబు పిటిషన్‌కు 17ఏ వర్తించదు
- 2018లో వచ్చిన సవరణ ఆధారంగా చేసుకుని కేసును క్వాష్ చేయలేం
- 2018లో వచ్చిన సవరణ కేవలం తేదీకి సంబంధించినది మాత్రమే
- అవినీతి నిరోధక చట్టానికి 17ఏను ముడిపెట్టలేం
జస్టిస్ బోస్
- ఈ కేసులో 17ఏ వర్తిస్తుంది
- చంద్రబాబు కేసులో విచారణకు ముందే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సింది
- గతంలో జరిగిన దర్యాప్తును ఈ అరెస్ట్‌కు వర్తింపజేయరాదు
- అయినా చంద్రబాబుకు విధించిన రిమాండ్ ఆర్డర్‌ను కొట్టేయలేం
- అనుమతి లేనంత మాత్రాన రిమాండ్ ఆర్డర్ నిర్వీర్యం కాదు
01:42 PM, Jan 16, 2024
చంద్రబాబుకు బిగ్ షాక్
- రిమాండ్ సబబే.. క్వాష్ కొట్టేయలేం
- సుప్రీంకోర్టులో దక్కని ఊరట
- రిమాండ్ విధించే అధికారం ట్రయల్ కోర్టుకు ఉందన్న సుప్రీంకోర్టు
- రిమాండ్ సమంజసమేనని తేల్చిచెప్పిన ఇద్దరు న్యాయమూర్తులు
- 17ఏ సెక్షన్‌కు రిమాండ్‌ను ముడిపెట్టలేమని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
- 17ఏ సెక్షన్ వర్తింపు విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు
- తదుపరి నిర్ణయం కోసం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు నివేదన
- ముగ్గురు లేదా అయిదుగురు జడ్జిల బెంచ్ ???
12:35 PM, Jan 16, 2024
స్కిల్ కేసు.. కాసేపట్లో సుప్రీంకోర్టు తీర్పు
- స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై కాసేపట్లో తీర్పు వెలువరించనున్న సుప్రీంకోర్టు
- ఈ కేసులో 52 రోజులపాటు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడిపిన చంద్రబాబు
- ప్రస్తుతం బెయిల్ మీద బయట
- అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఏ తనకు వర్తిస్తుందని..ఆ సెక్షన్ ప్రకారం గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనను అరెస్ట్ చేయడం అక్రమమని సుప్రీంలో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్
- ఈ పిటిషన్‌పై జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారణ
- చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, హరీశ్ సాల్వే, అభిషేక్ మను సింఘ్వీ(కాంగ్రెస్ నేత).. సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ, రంజిత్‌కుమార్‌లు వాదనలు
- ఈ అంశంతో ముడిపడిన రెండు కేసుల విచారణ 17, 19వ తేదీల్లో సుప్రీం కోర్టులో జరగాల్సి ఉంది.
- ఫైబర్‌నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌తో పాటు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు బెయిల్ ఇస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం సవాల్
- ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు వాటికంటే ముందు 17-ఏపై తీర్పు వెలువరించనుంది
12:05 PM, Jan 16, 2024
సీఎం జగన్ కృషితోనే నాసిన్ ప్రాజెక్టు సాకారం: ఎమ్మెల్యే శంకర్ నారాయణ
- సీఎం జగన్ కృషి వల్లే నేషనల్ కస్టమ్స్ అండ్ నార్కోటిక్స్ అకాడమీ (నాసిన్) సాకారం
- నాసిన్ ప్రాజెక్ట్‌కు పెనుకొండ నియోజకవర్గంలో 500 ఎకరాల భూమి కేటాయింపు
- మౌలిక సదుపాయాల కల్పన సీఎం జగన్ కృషి ఫలితమే
- సీఎం జగన్ కృషితో విభజన చట్టం హామీలు అమలవుతున్నాయి
- 2014-19 దాకా సీఎంగా పనిచేసిన చంద్రబాబు.. నాసిన్ ప్రాజెక్టును పట్టించుకోలేదు
11:44 AM, Jan 16, 2024
బలం సరిపోవట్లేదు.. బీజేపీ కావాలి
- చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీలో ప్రధానంగా బీజేపీని ఒప్పించడంపై చర్చ
- ప్రస్తుతం తమకున్న బలం పూర్తిస్థాయిలో ఓట్లు కురిపించలేదని ఒక నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు-పవన్
- ఢిల్లీకి వెళ్లి బీజేపీని ఒప్పించే బాధ్యతను పవన్ కళ్యాణ్‌కు అప్పగించిన చంద్రబాబు
- అడిగినని ఎంపీ సీట్లు ఇచ్చేందుకు తాము సుముఖంగా ఉన్నట్టు చెప్పాలని సూచించిన చంద్రబాబు
- ఈసారి పొత్తు తర్వాత నమ్మకంగా ఉంటామని ఢిల్లీ పెద్దలకు హామీ ఇవ్వాలని సూచన
- ఉమ్మడి మేనిఫెస్టో కు సిద్ధమని అలాగే బిజెపి సూచించే అంశాలను కూడా అందులో పెట్టేందుకు రెడీ అని అంగీకారానికి వచ్చిన చంద్రబాబు
- పొత్తుకు బీజేపీ ఓకే అంటే మొదటి జాబితాలోనే బీజేపీ నేతల పేర్లు ప్రకటించేందుకు సిద్ధమంటున్న చంద్రబాబు
- ఢిల్లీ నుంచి బీజేపీ పెద్దలు వస్తే.. ఉమ్మడి సభలు ఎక్కడెక్కడ నిర్వహించాలనే దానిపై చర్చ
- ఎన్నికల సమీపిస్తున్నాయి ఇక మ్యానిఫెస్టో తొందరగా విడుదల చేయాలని చర్చ
- ఈ నెలలోనే కనీసం మినీ మేనిఫెస్టో విడుదల చేయాలని లక్ష్యం
- వచ్చే ఎన్నికల్లో సీట్ల సర్ధుబాటుపై తెలుగుదేశం జనసేన మధ్య కొలిక్కిరాని చర్చలు
10:42 AM, Jan 16, 2024
ఇసుక బకాసురుడు బాబు
- ఇసుక ఉచితమంటూ ఊడ్చేశారు
- పచ్చ ముఠా లూటీ రూ.10 వేల కోట్లు.. గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలు బేఖాతర్
- ఆర్థిక శాఖ ఆమోదం, మంత్రి మండలి తీర్మానం లేదు
- ‘ప్రత్యేక మెమో’ ముసుగులో యథేచ్ఛగా దోపిడీ
- ఏ1 పీతల సుజాత, ఏ 2 చంద్రబాబు, ఏ 3 చింతమనేని, ఏ 4 దేవినేని ఉమా
- టీడీపీ హయాంలో ‘ఉచిత ఇసుక విధానం’ ముసుగులో పచ్చ ముఠా దోపిడీ
- పూర్తి ఆధారాలతో సహా బట్టబయలు చేసిన సీఐడీ
- కేంద్ర చట్టాలు, గ్రీన్ ట్రిబ్యునల్ విధివిధానాలను ఉల్లంఘించి కేబినెట్ ఆమోదం కూడా లేకుండా ‘ప్రత్యేక మెమో’ ద్వారా చంద్రబాబు లూటీ
- 2016 నుంచి 2019 వరకు ప్రభుత్వ ఖజానాకు రూ.వెయ్యి కోట్ల ఆదాయానికి గండి
- చంద్రబాబు ముఠా ఏకంగా రూ.10 వేల కోట్ల విలువైన ఇసుక దోపిడీ
09:48 AM, Jan 16, 2024
ఊరు మారింది.. సామాన్యుడి కామెంట్స్
- చంద్రబాబు హయాంలో పేదవాడిని పట్టించుకున్న నాథుడే లేడు
- పేదవాళ్ల కోసమే పనిచేస్తున్న సీఎం జగన్
- నేడు కార్పోరేట్ స్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ విధానం.
- పేదల ఇంటి వద్దకే ప్రభుత్వ వైద్య సేవలు
- ఏపీలో పూర్తిగా మారిపోయిన స్కూల్స్
- పండుగకు ఇంటికి వచ్చి స్కూల్స్‌ను చూసి పాత విద్యార్థుల భావోద్వేగం
- ఇది కదా మార్పు అంటే అని సీఎం జగన్‌పై ప్రశంసలు
సంక్రాంతి పండగ వేళ సొంతూరికి వెళ్లి.. మారిన స్కూల్‌ని చూసి అద్దంకిలో ఓల్డ్ స్టూడెంట్స్ భావోద్వేగం..!
— YSR Congress Party (@YSRCParty) January 15, 2024
ఇది కదా మార్పు అంటే..
ఇది కదా అభివృద్ధి అంటే..!#YSJaganDevelopsAP#VooruMarindi #AndhraPradesh pic.twitter.com/2cRxgO1sU7
09:10 AM, Jan 16, 2024
దొంగే దొంగ దొంగా అని అరుస్తున్నటు ఉంది దొంగ ఓట్ల బాబూ!
- బాబు సీఎంగా ఉన్నప్పుడు 2004 ఎన్నికలకు ముందు 92 లక్షల బోగస్ ఓట్లను ఎన్నికల కమిషన్ ఏరి వేసింది!
- గెలుపుపై నమ్మకం లేక 1.5 కోట్ల బోగస్ ఓట్లు చేర్పించి బాబు గెలవాలని చూస్తున్నాడని 2004 ఎన్నికలకు ముందు వైఎస్, మిగిలిన ప్రతిపక్షాలు కలిసి ఆధారాలతో ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేస్తే.. దీనిపై విచారణ జరిపి.. 92 లక్షల బోగస్ ఓట్లని ఎన్నికల సంఘం తొలగించింది.
- కుప్పంలో 47 వేల బోగస్ ఓట్లు ఉన్నాయని 2014 ఎన్నికలకు ముందు నాటి ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ చెప్పారు. 2014లో ఎన్నికల సంఘం కుప్పంలో 18 వేల బోగస్ ఓట్లను తీసేయడంతో బాబుకు మెజారిటీ క్రమేపీ తగ్గుతూ వస్తోంది.
- 2015–17 మధ్య బాబు ప్రభుత్వం వైసీపీ కి చెందిన 50.23 లక్షల ఓట్లు సేవా మిత్ర యాప్‌తో తొలగింపు.. వాటిపై అప్పట్లో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ
- విచారణ జరిపి 2019లో 31.97 లక్షల ఓట్లను జాబితాలో చేర్చిన ఎన్నికల సంఘం
- తొలగించిన 21 లక్షల ఓట్లలో (జనవరి 6 ,2023-ఆగష్టు 30, 2023 మధ్య ) కేవలం 13,061 ఓట్లు (0. 61 శాతం ) విషయంలో మాత్రమే తప్పులు దొర్లాయి
- వాటిని సరిదిద్దాం
- రెండు చోట్లా ఓటు ఉంటే క్రిమినల్ చర్యలు.. సీఈసీ రాజీవ్‌కుమార్, జాన్ 11 2024
08:40 AM, Jan 16, 2024
గెలుపు గంటకు కొత్త కష్టం
- 25 ఏళ్ళక్రితం ప్రకాశం నుంచి ఉత్తరాంధ్రకు వలస వచ్చిన గంటా శ్రీనివాసరావు
- 1999లో టీడీపీ నుంచి అనకాపల్లి లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి గెలుపు
- 2004 లో చోడవరం అసెంబ్లీ నుంచి గెలుపు
- 2009 లో ప్రజారాజ్యం తరపున అనకాపల్లి అసెంబ్లీ నుంచి గెలుపు
- 2014 లో టీడీపీ తరపున భీమిలి నుంచి గెలుపు
- 2019 లో వైఎస్సార్‌సీపీ టికెట్ కోసం ట్రై చేసి కుదరక.. విశాఖ నార్త్ నుంచి పోటీ చేసి గెలుపు
- 2024 లో భీమిలి నుంచి ట్రై చేయాలనుకొంటుంటే .. టీడీపీ నుంచే మోకాలడ్డూ
- జనసేనలోకి గంటా?
- ప్రజా వ్యతిరేకత పోగుట్టుకొనేందుకు ప్రతి ఎన్నికకు నియోజక వర్గాన్ని మారుస్తున్న గంట
- ఈసారి పప్పులు ఉడకడం పాపం కష్టమే
07:37 AM, Jan 16, 2024
బాబు, పవన్ సంకల్ప ఫలితం.. అరాచకం: బహుజన పరిరక్షణ సమితి
- చంద్రబాబు-పవన్ ‘సంకల్ప కలయిక’ ఆయా పార్టీల్లోని అరాచకశక్తుల ఆగడాలకు ‘ఆజ్యం’ పోయనుంది
- అమరావతిని అవినీతికి అడ్డాగా చేసుకుని రూ.లక్షల కోట్లు దోపిడీ
- జైలుపాలైన చంద్రబాబు లాంటి అవినీతిపరుడిని కులవాదులు, పవన్, ఎల్లో మీడియా కాపాడేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటు
- రాజధాని రైతుల ఉసురు తగిలి చంద్రబాబు ఈ ప్రాంతంలో మళ్లీ చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయం
- బాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన పవన్‌కళ్యాణ్ ప్యాకేజీ తీసుకుని బాబు కింద పాలేరులా తయారయ్యాడు
- పురందేశ్వరి బీజేపీ అధ్యక్షురాలా లేక టీడీపీ అధికార ప్రతినిధో తెలియడం లేదు
07:14 AM, Jan 16, 2024
ఎన్నికల వేళ పచ్చ బ్యాచ్‌తో జాగ్రత్త..
- టీడీపీ పెయిడ్ బ్యాచ్ దిగింది.
- ప్రజలారా అప్రమత్తంగా ఉండండి.
- ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం
- మౌత్ పబ్లిసిటీ కోసం టీడీపీ దొంగదారులు
- చంద్రబాబుపై బైరెడ్డి సిద్దార్థ రెడ్డి సెటైర్లు
- చంద్రబాబు మోసాలను ప్రజలు గమనించాలి
- అనైతిక పొత్తులతో కుట్రలు చేస్తున్నారు
- సీఎం జగన్‌పై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరిలకు అసూయ ఉన్నాయి
- రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు లేదు
- రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యేందుకు చంద్రబాబుకు నలుగురు ష్యూరిటీ ఇచ్చారు
- టీడీపీ బాబు ష్యూరిటీ..భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాలు హాస్యాస్పదం
టీడీపీ పెయిడ్ బ్యాచ్ దిగింది.. ప్రజలారా అప్రమత్తంగా ఉండండి..!
— YSR Congress Party (@YSRCParty) January 15, 2024
ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నంలో @JaiTDP
మౌత్ పబ్లిసిటీ కోసం టీడీపీ దొంగదారులు#TDPFakePropaganda #EndOfTDP pic.twitter.com/hrm8bw775f
07:10 AM, Jan 16, 2024
చంద్రబాబు దొడ్డిదారి రాజకీయం
- జనసేన నుంచీ టీడీపీ అభ్యర్థులే
- పవన్ దగ్గరకు టీడీపీ నేతల్ని పంపిస్తున్న చంద్రబాబు
- జనసేన పార్టీ నుంచి తన అభ్యర్థులే ఉండేలా బాబు ప్లాన్!
- పవన్ ను కలిసిన మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్
- విజయవాడ వెస్ట్ సీటు కోసం జలీల్ ఖాన్‌ను పంపిన చంద్రబాబు
- మొన్న పవన్ కల్యాణ్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్యే వేదవ్యాస్
- పెడన సీటు కోసం వేదవ్యాస్‌ను పంపిన చంద్రబాబు
- కొద్ది రోజుల క్రితం పవన్‌ను కలసిన మాజీ ఎంపీ మాగంటి బాబు
- ఎంపీ సీటు జనసేన నుంచి కోరిన మాగంటి బాబు
- తిరుపతి సీటు కోసం పవన్‌ను కలిసిన సుగుణమ్మ
- జనసేనకు అభ్యర్థులు లేక టీడీపీ నేతల్ని పంపుతున్న చంద్రబాబు
- చంద్రబాబు తీరు పట్ల జనసేన నాయకుల్లో అనుమానాలు
- అభ్యర్థులు లేక తామే పవన్ కు పంపుతున్నామని చెప్తున్న టీడీపీ నేతలు
- పార్టీని నమ్ముకుని ఉన్న వారికి పవన్ మొండిచేయి చూపుతారని జనసేనలో చర్చ
07:01 AM, Jan 16, 2024
రాజకీయాల్లో రఘురామ పాత్ర ముగిసినట్లేనా?
- రఘురామను పట్టించుకోని జనం
- ఎంపీగా గెలిచిన నాలుగేళ్ళ తరువాత సొంత నియోజకవర్గం నర్సాపురం వచ్చిన రఘురామ
- ఆయనకోసం ఎక్కడా ఎదురు పడని క్యాడర్, అభిమానులు
- రాజకీయంగా అయన పాత్ర ముగిసినట్లేనా?
- టీడీపీ అనుకూల మీడియాలో వ్యాఖ్యానాలు చేసుకోవడానికి మాత్రమే పనికొస్తారనే చర్చ.
- కనీసం ఈసారి ఎమ్మెల్యే టికెట్ కూడా దక్కదని నరసాపురం ప్రజల మాట
06:59 AM, Jan 16, 2024
రాజ్యసభలో టీడీపీ అడ్రస్ గల్లంతే..
- ఏప్రిల్ 2తో పూర్తికానున్న టీడీపీ సభ్యుడు ‘కనకమేడల’ పదవీకాలం
- వైఎస్సార్‌సీపీ సభ్యుడు వేమిరెడ్డి, బీజేపీ సభ్యుడు సీఎం రమేష్‌ల పదవీకాలం ముగిసేదీ అప్పుడే
- రాష్ట్ర కోటాలో ఖాళీ అయ్యే ఈ మూడు స్థానాలకు ఫిబ్రవరి ఆఖరు లేదా మార్చిలో ఎన్నికలు
- అసెంబ్లీలో సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే ఈ మూడూ వైఎస్సార్‌సీపీ ఖాతాలోకే
- దీంతో రాష్ట్ర కోటాలోని 11 స్థానాలు వైఎస్సార్‌సీపీ పరం
- చివరికి రాజ్యసభలో ఉనికే లేకుండాపోనున్న టీడీపీ
- 41 ఏళ్లలో టీడీపీకి రాజ్యసభలో సభ్యత్వం లేకుండాపోవడం ఇదే తొలిసారి
06:57 AM, Jan 16, 2024
నేడు బాబుకి జడ్జిమెంట్ డే
- స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో నేడు సుప్రీం కోర్టు తీర్పు!
- స్కిల్ కేసులో అరెస్ట్ అయ్యి 52 రోజలు జైల్లో ఉన్న చంద్రబాబు
- మధ్యాహ్నాం ఒంటి గంటకు తీర్పు వెల్లడించిన ద్విసభ్య ధర్మాసనం
- 17ఏ తనకు వర్తిస్తుందని చంద్రబాబు వాదన
- వర్తించదని ఏపీ సీఐడీ వాదనలు
- వాదనలు విని.. తీర్పు రిజర్వ్ చేసిన బెంబ్
06:55 AM, Jan 16, 2024
ఆక్ పాక్ కరివేపాక్.. టీడీపీలో ఆ ఐదుగురికి చెక్
రఘురామరాజు, కోటంరెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి, శ్రీదేవి టికెట్‌లపై టీడీపీలో చర్చ
వీళ్లను భరించడం కష్టమని పార్టీ సీనియర్ల టాక్
ఒకవేళ టికెట్ ఇచ్చి గెలిచినా.. ఎన్నాళ్లుంటారో తెలియని పరిస్థితి అంటున్న సీనియర్లు
టీడీపీలో సుదీర్ఘకాలం నుంచి ఉంటున్న నాయకులకే టికెట్లు ఇవ్వాలని పెరుగుతున్న డిమాండ్
అధికార పార్టీ తరిమేసిన వాళ్లకు మనం ఎందుకు టికెట్లు ఇవ్వడం అంటూ అభ్యంతరాలు
గద్దె రామ్మోహన్ రావు విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి అయితే మంచిదంటున్న ఎమ్మెల్యే అభ్యర్థులు
అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరమే మేలంటున్న టీడీపీ సీనియర్లు