సాక్షి, కరీంనగర్: హిందువులకు నేడు పండగ రోజని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. అయోధ్య కోసం పోరాడిన కర సేవకుల మీద కాల్పులు జరిపారని, సరయు నదిలో గుట్టలుగా శవాలు తేలాయని అన్నారు. అయోధ పోరాటంలో తాను కూడా ఉండటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు. నేడు అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్ప నెరవేరిందని పేర్కొన్నారు.
కర సేవకుల బలిదానాలు వృథాగా పోలేదని అన్నారు. కరసేవకుల కుటుంబాలకు ఇన్నేళ్లకు అసలైన పండుగ వచ్చిందన్నారు. అయిదు వందలవందల ఏళ్ల స్వప్నం నెరవేరడం ఆషామాషీ కాదని చెప్పారుజ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై దాడి జరగలేదన్న బండి సంజయ్.. ప్రజల దృష్టి మరల్చడానికే ఆయన ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రామమందిర నిర్మాణాన్ని ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. అయోధ్యకు రాహుల్ ఎందుకు రాలేదని నిలదీశారు.
ఆలయ నిర్మాణంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, వామపక్షాలు ఎందుకు దూరంగా ఉన్నాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ వల్ల హిందువుల మనోభావాలు దెబ్బ తిన్నాయన్నారు. రాముడు అయోధ్యలోనే పుట్టాడని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. రాముడిపై ప్రశ్నిస్తున్న వారు దేశ పౌరులేనా?. నాస్తికులు, హేతువాదులు రాజ్యాంగాన్ని అవమానిస్తారా?.అని మండిపడ్డారు. మీ కుటుంబ సభ్యులను అడగండి.. రాముడు అయోధ్యలో పుట్టాడో లేదో తెలుస్తుందని అన్నారు. ఈ దేశం తిండి తింటూ ఇక్కడి దేవుళ్లను విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చదవండి: Ayodhya Ram Mandir: అయోధ్యలో కన్నుల పండుగగా రామమందిర ప్రారంభోత్సవం
Comments
Please login to add a commentAdd a comment