సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ తీరుతో తెలంగాణ అప్పుల పాలైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. కేంద్రాన్ని బూచిగా చూపి మళ్ళీ విద్యుత్ చార్జీలు పెంచే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, జీతాలు, పెన్షన్స్ ఇచ్చే పరిస్థితి లేదని ధ్వజమెత్తారు. కమిషన్ల కోసం.. మూడు రూపాయలకు దొరికే విద్యుత్‌ని.. ఆరు రూపాయలకు కొనుగోలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
భద్రాద్రి పవర్ ప్లాంట్ అనేది అతిపెద్ద కుంభకోణమని, నష్టం వస్తుందని తెలిసి ఇండియాబుల్స్ వదిలేస్తే...బినామీ వక్తులతో పెట్టుబడులు పెట్టించారని విమర్శించారు. నిజామాబాద్ జిల్లాలో బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ గుండాల దాడులను ఖండించారు. కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ భూములను టీఆర్ఎస్ కౌన్సిలర్లు కబ్జా చేసి వెంచర్లు వేస్తున్నారని దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల కోసం ఏర్పాటు చేసిన రామగుండం ఎరువుల కర్మాగారంను మూసివేసే కుట్ర చేస్తున్నారని చెప్పారు.
చదవండి: Hyderabad: బోర్డ్ తిప్పేసిన ఐటీ సంస్థ.. రోడ్డున పడ్డ 800 మంది ఉద్యోగులు
Comments
Please login to add a commentAdd a comment