ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది | KTR Comments On Rahul Gandhi: telangana | Sakshi
Sakshi News home page

ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది

Published Tue, Sep 10 2024 1:36 AM | Last Updated on Tue, Sep 10 2024 1:36 AM

KTR Comments On Rahul Gandhi: telangana

రాహుల్‌గాందీపై మాజీ మంత్రి కేటీఆర్‌ ధ్వజం... రాజ్యాంగ పరిరక్షణ అంటూనే ప్రజాస్వామ్యం ఖూనీ 

కాంగ్రెస్‌కు చెంపపెట్టులా ఫిరాయింపులపై హైకోర్టు తీర్పు

 

సాక్షి, హైదరాబాద్‌: పార్టీ ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ వైఖరిని చూసి ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు విమర్శించారు. రాజ్యాంగ పరిరక్షణ అంటూనే మరోవైపు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని సోమవారం ‘ఎక్స్‌’వేదికగా మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కాంగ్రెస్‌ పారీ్టకి, ఈ విషయంలో హైకోర్టు ఇచి్చన తీర్పు చెంపపెట్టు లాంటిదని వ్యాఖ్యానించారు. ఫిరాయింపులపై ఫిర్యాదు అందిన మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని గతంలోనే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా స్పీకర్‌ పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణను స్పీకర్‌ పట్టించుకోకపోవడంతో తాము కోర్టును ఆశ్రయించామని చెప్పారు.  

ఉప ఎన్నికలు ఖాయం 
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతాయని, బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ పారీ్టలో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్‌రావుల పదవులు ఊడటం ఖాయమని కేటీఆర్‌ అన్నారు. న్యాయస్థానాల్లో, ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్‌ పారీ్టకి శిక్ష తప్పదని చెప్పారు. బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్‌ కాంగ్రెస్‌ బీ ఫామ్‌పై సికింద్రాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడాన్ని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ అంటే కాంగ్రెస్‌ లెక్కలేనితనానికి దానం నాగేందర్‌ ఉదంతం ఓ నిదర్శనంగా పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపాలని గతంలో సీఎం రేవంత్‌ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్‌ గుర్తు చేశారు. ప్రజలను మోసగించిన తరహాలోనే, పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలకు ఇచి్చన హామీలపైనా రేవంత్‌ చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు.

రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టేలా తీర్పు: హరీశ్‌రావు
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై హైకోర్టు ఇచి్చన తీర్పు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టే విధంగా ఉందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు రావడం ఖాయమని, బీఆర్‌ఎస్‌ గెలుపు కూడా తథ్యమని పేర్కొన్నారు. హైకోర్టు తీర్పుకు అనుగుణంగా అసెంబ్లీస్పీకర్‌ 4 వారాల్లో నిర్ణయం తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని ఆశిస్తున్నామన్నారు. ఫిరాయింపులపై హైకోర్టు తీర్పు చరిత్రాత్మకమని మాజీ మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌ వేర్వేరు ప్రకటనల్లో అభివర్ణించారు. కాంగ్రెస్‌ పార్టీకి నైతికత ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడేలా రాహుల్‌ గాంధీ చర్యలు తీసుకోవాలన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement