ప్రశ్నిస్తే అక్రమ కేసులా? కుట్రలతో గొంతు నొక్కుతారా? | Illegal Cases Against Ysrcp Social Media Activists By Chandrababu Govt | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

ప్రశ్నిస్తే అక్రమ కేసులా? కుట్రలతో గొంతు నొక్కుతారా?

టీడీపీ వాళ్ల అసభ్యకరమైన పోస్టులకు చర్యలేవి?: అంబటి

  • అసభ్యకరమైన పోస్టులు ఎవరు పెట్టినా చర్యలు తీసుకుంటాం అని చెప్పారు. మాజీ మంత్రి అంబటి
  • కానీ టీడీపీ వాళ్లు ఎవరు అసభ్యకరమైన పోస్టులు పెట్టినా వారిపై ఎలాంటి చర్యలూ లేవు:  అంబటి
  • మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌  జగన్‌పై మంత్రి నారా లోకేష్‌.. ఆయన నిర్వహణలోని ఐటీడీపీ, టీడీపీ సోషల్‌ మీడియా పెడుతున్న అసభ్య పోస్టింగ్స్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కంప్లయింట్ ఫైల్ చేస్తున్నాం: అంబటి
2024-11-19 16:38:30

పట్టాభిపురం పీఎస్‌లో మాజీ మంత్రి అంబటి ఫిర్యాదు

  • గుంటూరు పట్టాభిపురం పీఎస్‌లో మాజీ మంత్రి అంబటి ఫిర్యాదు
  • జగన్‌, కుటుంబసభ్యులపై టీడీపీ సోషల్‌ మీడియా పోస్టులు
  • పోస్టులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ నేతలు
     
2024-11-19 12:09:10

గన్నవరంలో వైఎస్సార్‌సీపీ నాయకులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు

ఆరుగురు వైఎస్సార్‌సీపీ నాయకులను తెల్లవారు జామున అరెస్ట్ చేసిన పోలీసులు
ఓలుపల్లి రంగా, మేచినేని బాబు,సూరపనేని అనిల్‌తో పాటు మరో ఇద్దరు అరెస్ట్
కంకిపాడు పోలీస్ స్టేషన్ కి తరలింపు.
ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో సమాధానం చెప్పని పోలీసులు
పోలీసులు తీరుతో ఆందోళనలో కుటుంబ సభ్యులు

2024-11-19 08:03:15

కూటమి మూకలపై చర్యలు తీసుకోవాలి

  • వైఎస్సార్‌సీపీ నేతలపై వారు అసభ్యకర పోస్టులు పెడుతున్నారు
  • తిరుపతిలో పోలీసులకు వైఎస్సార్‌సీపీ నేతలు భూమన, నారాయణస్వామి, రోజా, ఎంపీ గురుమూర్తి, మేయర్‌ శిరీష, చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, నూకతోట
  • రాజేష్‌ ఫిర్యాదు దీనిని తీసుకునేందుకు ఆసక్తి చూపని పోలీసులు
  • ప్రివిలేజ్‌ మోషన్‌ మూవ్‌ చేయాల్సి ఉంటుందని నేతల హెచ్చరిక
  • కూటమి మూకల అసభ్యకర పోస్టులివే..
    ‘‘రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్‌.. అర్జునుడు కాదు,  భస్మాసురుడు. బాబాయిని చంపేసి, తల్లి, చెల్లిని తరిమేసి, జనాన్ని నానా హింసలు పెడుతున్న జగనాసుర పాలన అంతం కావాలి’’.. అంటూ వంగలపూడి అనిత ప్రతిపక్షంలో ఉన్నపుడు పోస్టు పెట్టారు.
  • ప్రతి మంగళవారం అప్పుపుడితేనే సర్కారు ఊపిరి పీల్చుకునే దుస్థితి! 2023–24లో 52 మంగళవారాలు ఉంటే 49 వారాలు  ఏపీ అ ప్పు తెచ్చింది’ అంటూ లోకేశ్‌ పోస్టు చేశారు.
  • ‘‘ట్వంటీ ట్వంటీ ఫోర్‌.. జగనన్న నో మోర్‌.. 2024 సైకో పోతాడు.. సైకిల్‌ వస్తుంది’’.. అంటూ ప్రస్తుత శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్న పాత్రుడు అప్పట్లో పోస్టు చేశారు.
  • ‘‘రాష్రానికి రెండు కళ్లు అయిన అమరావతి, పోలవరాన్ని నిర్వీర్యం చేసిన దుర్మార్గ వైకాపా ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేందుకు జనం సిద్ధంగా ఉన్నారు. జగన్‌ పనైపోయింది. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి.. అమరావతిని నాశనం చేశాడు. ఇప్పుడు జగన్‌ కన్ను వైజాగ్‌­పై పడింది. వైజాగ్‌ను దోచేయడానికి పక్కా ప్రణాళికతో వస్తున్నాడు.. పిచ్చోడొస్తున్నాడు తస్మాత్‌ జాగ్రత్త..’’ అంటూ ప్రస్తుత మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పోస్టు పెట్టారు.
  • ‘సిగ్గనేది ఏడిస్తేగా సాక్షి పింజరికి..’’ అంటూ అంజన్‌.పి అనే వ్యక్తి పోస్టు చేశారు.
  •  ‘‘నిత్య దరిద్రస్వామి కొత్త దేశం, ఇంగ్లాండ్‌ పక్కన దీవిలో..’’ అంటూ  అంజన్‌.పి అనే వ్యక్తి పోస్టు చేశారు.
  • ‘‘ఖైదీ నంబర్‌ 6093’’ ఐడీపైన మార్నింగ్‌ మోటివేషన్‌ బై 11 రెడ్డి బ్రో’’ అంటూ మరో వ్యక్తి పోస్టు చేశారు. 
2024-11-19 08:00:40

ఒంగోలు: నేడు విచారణకు హాజరుకానున్న ఆర్జీవీ

నేడు ఒంగోలు రూరల్ సర్కిల్ కార్యాలయంలో విచారణకు హాజరు కానున్న ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ
ఎక్స్‌లో లోకేష్ ,చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటో లను మార్ఫింగ్ చేసి పోస్ట్ చేశారన్న ఆరోపణలు పై ఒంగోలు రూరల్ సర్కిల్ పరిధిలోని మద్దిపాడు పీఎస్‌లో వర్మ పై కేసు నమోదు
టీడీపీ కార్యకర్త రామలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐటి చట్టం క్రింద కేసు నమోదు చేసి, వర్మకి నోటీసులు ఇచ్చిన పోలీసులు
నేడు 12 గంటల సమయంలో రామ్ గోపాల్ వర్మ ఒంగోలు రూరల్  సర్కిల్‌ కార్యాలయానికి వచ్చే అవకాశం

2024-11-19 07:25:28

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై ఫిర్యాదు 

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై చర్యల జనసేన టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి కణితి కిరణ్‌ కుమార్‌ ఫిర్యాదు
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌పై దువ్వాడ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు
సోషల్‌ మీడియా యాక్టివిస్టుపై కేసు 
సోషల్‌ మీడియా యాక్టి­­­వి­స్టులపై టీడీపీ కూటమి అక్కసు వెళ్లగక్కు­తూనే ఉంది
ఎక్కడికక్కడ కేసులు పెడుతూనే ఉంది.
మంత్రాలయం నియోజక­వర్గం కౌతాళం పోలీస్‌స్టేషన్‌లో వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా యాక్టివిస్టు బగ్గు జయరామ్‌పై కేసు నమోదు

2024-11-19 07:21:09

మీరు మా ఆదేశాలను ఉల్లంఘించారు.. పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

వర్రా రవీందర్‌రెడ్డిని మా ముందు హాజరుపరచాలని చెప్పాం
మీరేమో ఇంకెక్కడో ఆయన్ను హాజరుపరిచారు
ఇందుకు ప్రాథమిక ఆధారాలున్నాయి
దీనిపై వివరణ ఇవ్వండి.. పూర్తి వివరాలతో కౌంటర్‌ వేయండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం.. విచారణ 20కి వాయిదా

వర్రా రవీందర్ రెడ్డి తరఫున న్యాయవాది వాదనలు
ఈ నెల తొమ్మిదో తేదీన జరిగిన విచారణలో రవీంద్ర రెడ్డి తమ నిర్బంధంలో లేరని పోలీసులు కోర్టుకు తెలిపారు
12వ తేదీన అతన్ని సంబంధిత కోర్టు ముందు హాజరు పరిచామని తెలిపారు
తప్పుడు వివరాలతో పోలీసులు కోర్టును తప్పుదోవ పట్టించారు
12వ తేదీన రవీందర్ రెడ్డి తదితరులను తమ ముందు హాజరు పరచాలని హైకోర్టు ఆదేశిస్తే... పోలీసులు కింది కోర్టులో హాజరు పరిచామని చెప్పారు
అక్రమ నిర్బంధంలో పోలీసులు రవీందర్ రెడ్డిని కొట్టారు
ఈనెల ఎనిమిదో తేదీనే రవీంద్ర రెడ్డిని పోలీసులు తమ నిర్బంధంలోకి తీసుకున్నారు
రూల్ ఆఫ్ లా అంటే పోలీసులకు ఎంత మాత్రం గౌరవం లేదనేందుకు ఈ కేసు మంచి ఉదాహరణ
హైకోర్టు ముందు రవీందర్ రెడ్డిని హాజరు పరచకుండా కిందికోర్టులో హాజరు పరచడం అంటే హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమే
ఇది కచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందే వస్తుంది

2024-11-19 07:13:32

ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌పై నాలుగు కేసులు నమోదు

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో నాలుగు కేసులు నమోదు
ఇలాంటి కేసులకు బెదిరేది లేదన్నారు.
కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై తమ గళం వినిపిస్తూనే ఉంటాం

 

2024-11-19 07:05:17
Advertisement
 
Advertisement
 
Advertisement