మహాత్మా మన్నించు..
విచ్చలవిడిగా మద్యం విక్రయాలు
బుధవారం మహాత్మా గాంధీ జయంతి. మాంసం, మద్యం విక్రయాలు పూర్తిగా నిషిద్ధం. అయినప్పటికీ పల్లెల్లోని బెల్ట్ షాపుల్లో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు సాగాయి. పట్టణాల్లో ఉండే మందుబాబులు సైతం సమీప పల్లెల్లో బెల్ట్ షాపులకు వెళ్లి మద్యం కొనుగోలు చేశారు. మండల కేంద్రమైన పామూరులోని కేబీ థియేటర్ సమీపంలో బుధవారం ఓ యువకుడు మద్యం ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం విక్రయిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. అలాగే కురిచేడు పట్టణంలోని వినుకొండ రోడ్డులో ప్రభుత్వ మద్యం దుకాణం సమీపంలోని ఓ కూల్ డ్రింక్ షాపులో మద్యం విక్రయిస్తుండగా పోలీసులు దాడి చేశారు. మద్యాన్ని సీజ్ చేసి నిందితుడిని స్టేషన్‌కు తరలించారు. గత నెలలో పెద్దారవీడు మండలం మద్దలకట్ట వద్ద ఓ వ్యక్తి నుంచి 35 మద్యం సీసాలు, గత నెల 16న రాచర్ల మండలం రాచర్ల ఫాం సమీపంలో అక్రమంగా నిల్వ ఉంచిన 50 క్వార్టర్లు, గత ఆదివారం అర్ధవీడు మండలంలోని గన్నేపల్లిలో ఒకరిని అరెస్టుచేసి 100 క్వార్టర్ సీసాలు, అదే రోజున కంభం మండలంలోని చిన్న కంభంలో ఓ బెల్టుషాపులో 40 క్వార్టర్ సీసాలు, 3 ఫుల్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపుల దందా జోరుగా సాగుతోంది అనేందుకు ఈ ఘటనలే నిదర్శనం.
అంతా టీడీపీ సానుభూతిపరులే..
Comments
Please login to add a commentAdd a comment