మద్యం వద్దు.. మంచినీళ్లు కావాలి
● ఐద్వా ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద నిరసన
కనిగిరి రూరల్: మద్యం నూతన పాలసీని వ్యతిరేకిస్తూ.. మద్యం వద్దు.. మంచి నీళ్లు కావాలి అనే నినాదంతో బుధవారం ఐద్వా ఆధ్వర్యంలో స్థానిక గాంధీ విగ్రహం వద్ద మహిళలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘ నాయకురాలు బషీరా మాట్లాడుతూ మద్యం నూతన పాలసీతో ప్రజలు నాశనం అవుతారన్నారు. సూపర్ సిక్స్ పథకాలపై బాకా ఊది అధికారంలోకి వచ్చిన చంద్రబాబు .. 100 రోజులు దాటినా వాటి అమలుపై దృష్టి సారించక పోవడాన్ని తీవ్రంగా మండిపడ్డారు. నిత్యవసర ధరలు నింగినంటాయని, సామాన్య, మధ్య తరగతి ప్రజలు కూటమి ప్రభుత్వ పాలనతో బతికే స్థితిలో లేరని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఐద్వా నాయకులు శాంత కుమారి, రత్తమ్మ, ఎలీశమ్మ, వెంకటమ్మ, లాల్బీ, రమణమ్మ, ఆదిలక్ష్మీ, సీఐటీయూ నాయకురాలు పీసీ కేశవరావు, నరేంద్ర, ఏడుకొండలు, పిచ్చయ్య, టోపి వలి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment