ఆటలు మానసికోల్లాసానికి దోహదం | - | Sakshi
Sakshi News home page

ఆటలు మానసికోల్లాసానికి దోహదం

Published Thu, Oct 24 2024 12:45 AM | Last Updated on Thu, Oct 24 2024 12:45 AM

ఆటలు

ఆటలు మానసికోల్లాసానికి దోహదం

ఏకేయూ వీసీ ప్రొఫెసర్‌ డీవీఆర్‌ మూర్తి

ఒంగోలు: ఆటలు మానసికోల్లాసాన్ని, విద్యార్థుల్లో ఉత్సాహాన్ని పెంపొందిస్తాయని ఏకేయూ వీసీ ప్రొఫెసర్‌ డీవీఆర్‌ మూర్తి అన్నారు. స్థానిక ఏకేయూ ఆవరణలో బుధవారం నిర్వహించిన అంతర కళాశాలల పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డీవీఆర్‌ మూర్తి మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడల్లో కూడా విద్యార్థులు ఆసక్తి కనబరచాలన్నారు. ఉన్నత స్థాయి చదువుల్లో క్రీడా కోటా కింద అడ్మిషన్లు లభిస్తాయని చెప్పారు. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేందుకు క్రీడలు ఉపయోగపడతాయని ఏకేయూ ప్రిన్సిపాల్‌ రాజమోహన్‌ అభిప్రాయపడ్డారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ నిర్మలామణి మాట్లాడుతూ ఆటల పోటీల ద్వారా ఐకమత్యం, క్రీడా స్ఫూర్తి అలవడుతుందని చెప్పారు. పోటీల్లో తొలిరోజైన బుధవారం తైక్వాండో (మెన్‌, ఉమెన్‌), ఫెన్సింగ్‌ (మెన్‌, ఉమెన్‌) పోటీలు నిర్వహించారు. పోటీలను సీడీసీ డీన్‌ సోమశేఖర్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ విభాగం డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ ఐ.దేవీవరప్రసాదవ్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగం సమన్వయకర్త డాక్టర్‌ మండే హర్షప్రీతమ్‌దేవ్‌ కుమార్‌ తదితరులు పర్యవేక్షించారు. ఈ పోటీల్లో ఎంపికై న వారు నవంబరు 6వ తేదీనుంచి 9వ తేదీ వరకు అమృత్‌సర్‌లోని గురునానక్‌ దేవ్‌ యూనివర్శిటీ (తైక్వాండో), జమ్మూలోని యూనివర్శిటీ ఆఫ్‌ జమ్మూలో (ఫెన్సింగ్‌) అంతర్‌ యూనివర్శిటీల పోటీల్లో ఏకేయూ తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు.

విజేతల వివరాలు:

తైక్వాండో మెన్‌: 54 కేజీల విభాగంలో జి.భాస్కర్‌, 63 కిలోల విభాగంలో ఎం.రంజిత్‌

తైక్వాండో ఉమెన్‌: 57 కేజీల విభాగంలో కె.గిరిజారెడ్డి, 62 కేజీల విభాగంలో ఎం.శైలజ

ఫెన్సింగ్‌ మెన్‌: కె.నవీన్‌కుమార్‌రెడ్డి

ఫెన్సింగ్‌ ఉమెన్‌: ఆర్‌.విజయలక్ష్మి

No comments yet. Be the first to comment!
Add a comment
ఆటలు మానసికోల్లాసానికి దోహదం1
1/1

ఆటలు మానసికోల్లాసానికి దోహదం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement