మార్కాపురం టౌన్: పాఠశాలకు వెళుతున్నానని చెప్పిన తన కుమారుడు కనిపించడం లేదని తల్లి మరియమ్మ ఫిర్యాదు మేరకు ఎస్సై సైదుబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టణంలోని డ్రైవర్స్ కాలనీకి చెందిన మరియమ్మ కుమారుడు ఇల్లూరి రూపస్(16) మండలంలోని వెలుగొండ గురుకుల పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. దసరా సెలవులకు ఇంటికి వచ్చి ఈ నెల 25న తిరిగి గురుకుల పాఠశాలకు వెళుతున్నానని చెప్పి వెళ్లాడు. కానీ పాఠశాలకు వెళ్లలేదు. ఎక్కడ వెతికినా ఆచూకీ దొరక్కపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment