మహిళ అనుమానాస్పద మృతి
కురిచేడు: మండలంలోని పేరంబొట్లపాలెం గ్రామంలో మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ సంఘటన మంగళవారం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శివ తెలిపారు. ఎస్సై శివ తెలిపిన వివరాల మేరకు.. యన్నం కల్పన (25) మంగళవారం ఉదయం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ముందురోజు పుట్టింటి నుంచి వచ్చిన కల్పన మరునాడు మృతి చెందటంతో ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. కుటుంబ కలహాలు కూడా లేవని, ఎందుకు ఆత్మహత్య చేసుకుందో పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. మృతురాలికి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని త్రిపురాంతకం సీఐ జి.అస్సాన్ పరిశీలించారు. అనంతరం మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం దర్శిప్రభుత్వ వైద్యశాలకు పంపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని ఎస్సై తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment