మద్యం మత్తులో విద్యార్థుల ఘర్షణ
మార్కాపురం రూరల్: మద్యం మత్తులో విద్యార్థులు ఘర్షణకు దిగారు. ఈ ఘటన మండలంలోని దరిమడుగు వద్ద బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని మూడు ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన విద్యార్థుఽలు మాటామాటా పెరిగి ఘర్షణకు దిగారు. పిడిగుద్దులతో ఒకరినొకరు తీవ్రంగా కొట్టుకున్నారు. ఒక ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన చైర్మన్ విద్యార్థులను సర్దిచెబుతున్నా వారు వినిపించుకోలేదు. పరిస్థితి అదుపు తప్పుతుందని గమనించిన కళాశాల చైర్మన్ రూరల్ ఎస్సై అంకమరావుకు ఫిర్యాదు చేశారు. ఆయన హుటాహుటిన సిబ్బందితో కళాశాల వద్దకు రావడంతో విద్యార్థులు ఒక్కసారిగా ఎక్కడి వారు అక్కడ నుంచి పరుగులు తీశారు.
Comments
Please login to add a commentAdd a comment