ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి
ఒంగోలు అర్బన్: జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సింగిల్ విండో ద్వారా మెరుగైన సేవలందించాలని, నిర్దేశిత సమయంలో వారి సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రకాశంభవనంలో బుధవారం జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మన జిల్లా పారిశ్రామిక రంగంలో మొదటిస్థానంలో ఉండేలా కృషి చేయాలన్నారు. జిల్లాలో పరిశ్రమల స్థాపన ద్వారా స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. సింగిల్ విండో ద్వారా జిల్లాలో 2023 నవంబర్ నుంచి ఇప్పటివరకు పరిశ్రమ ఏర్పాటుకు 2939 దరఖాస్తులు అందగా వాటిలో 2924 దరఖాస్తులు ఆమోదించామన్నారు. నిబంధనల మేరకు లేని ఒక్క దరఖాస్తును తిరస్కరించామన్నారు. పెండింగ్‌లో ఉన్న 14 దరఖాస్తుల్లో ఏపీపీసీబీ ఈఈ వద్ద 10, ఏపీఐఐసీ వద్ద ఒక దరఖాస్తు, ఫ్యాక్టరీ శాఖలో 1, గ్రౌండ్ వాటర్‌కు సంబంధించి మరొకటి, లీగల్ మెట్రాలజీ వద్ద ఒకటి ఉన్నాయని వివరించారు. పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. పరిశ్రమల ప్రోత్సాహకాలకు సంబంధించి 399 దరఖాస్తులు రాగా వాటిలో 384 దరఖాస్తులు రూ.6.95 కోట్ల ప్రోత్సాహకాలకు సిఫార్సు చేసామన్నారు. పీఎం విశ్వకర్మ యోజన కార్యక్రమం కింద జిల్లాలో 59.277 ధరఖాస్తులు రాగా స్టేజ్ 1లో 54038 దరఖాస్తులు పరిష్కరించామన్నారు. స్టేజ్ 2లో 42,737 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు వివరించారు. దీపావళి పండుగ నేపథ్యంలో బాణాసంచా తయారీ కేంద్రాల వద్ద ఎటువంటి ప్రమాదాలకు తావు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు సక్రమంగా ఉన్నాయా లేదా నిరంతరం పరిశీలించాలని ఆదేశించారు. కార్యక్రమంలో పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ శ్రీనివాసరావు, డీఆర్‌డీఏ పీడీ వసుంధర, ఉప రవాణా కమిషనర్ సుశీల, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ రాఘవరెడ్డి, ఎల్‌డీఎం రమేష్, ఏపీఐఐసీ జెడ్‌ఎం మదన్‌మోహన్, ఏపీఎస్‌ఎఫ్‌సీ బ్రాంచ్‌మేనేజర్ శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ ఎస్ వెంకటేశ్వర్లు, గ్రౌండ్‌వాటర్ డీడీ విద్యాసాగర్, అగ్నిమాపక శాఖ అధికారి శ్రీకాంత్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ తమీమ్ అన్సారియా
Comments
Please login to add a commentAdd a comment