ఖాళీ బిందెలతో మహిళల నిరసన
కంభం: మండలంలోని ఎల్‌కోట పంచాయతీలోని సూరేపల్లి ఎస్సీ కాలనీలో రెండు నెలలుగా నీళ్లు రావడం లేదని ఆగ్రహించిన మహిళలు కంభం– మార్కాపురం రోడ్డుపై ఖాళీ బిందెలతో బుధవారం నిరసనకు దిగారు. గత రెండు నెలలుగా బోరు మరమ్మతులకు గురికావడంతో నీటి సమస్య తలెత్తిందని, అధికారులకు ఎన్ని పర్యాయాలు విన్నవించినా పట్టించుకోవడం లేదని మహిళలు వాపోయారు. నీళ్ల కోసం నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే రోడ్డును దాటుకొని సుమారు కిలోమీటరు దూరంలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయం వద్దకు వెళ్లి బోరు నీళ్లు పట్టుకొని రావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వృద్ధులు, మహిళలు రోడ్డు దాటి నీళ్లు తెచ్చుకోవాలంటే ఇబ్బందులు పడుతున్నారని, ఉన్నతాధికారులు స్పందించి గ్రామంలోని ఎస్సీ కాలనీలో నీటి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment