మార్కాపురం మెడికల్ కళాశాలను ప్రభుత్వమే నిర్మించాలి
ఒంగోలు టౌన్: మార్కాపురంలో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మెడికల్ కళాశాలను కూటమి ప్రభుత్వమే పూర్తి చేయాలని మార్కాపురం మెడికల్ కళాశాల పరిరక్షణ కమిటీ సోమవారం కలెక్టర్ తమీమ్ అన్సారియాకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కమిటీ కన్వీనర్ అందె నాసరయ్య మాట్లాడుతూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మార్కాపురంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెడికల్ కళాశాల నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిలిపివేయడం దారుణమన్నారు. ప్రైవేట్ భాగస్వామ్యంలో మెడికల్ కళాశాల నిర్మించి నిర్వహించాలని కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విద్యా సంవత్సరమే కళాశాలను ప్రారంభించాలని గత ప్రభుత్వం నిర్ణయించి వైద్య అధ్యాపకులను, డాక్టర్లను నియమించిందన్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రొఫెసర్లు, అధ్యాపక డాక్టర్లను, సిబ్బందిని వెనక్కి పంపించిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment