బడి వదిలి..పని బాటకు..
ఆరు నెలల బాబు పాలనలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ తిరోగమనంలో పయనిస్తుంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలను పునర్జీవం పోసి కార్పొరేట్‌ను తలదన్నేలా తీర్చిదిద్దారు. అమ్మఒడి పథకంతో ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగింది. కానీ కూటమి ప్రభుత్వ తీరులో ఆరు నెలల్లో వేలాది మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. ఓ పక్క అమ్మకు వందనం అందక, మరో పక్క ఉపాధి లేక పిల్లలను చదివించుకోలేక తల్లిదండ్రులు పిల్లలను పనులకు తీసుకెళుతున్నారు. దీంతో ఈ ఆరు నెలల కాలంలో 30,813 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి డ్రాపౌట్స్‌గా తేలారు.
పిల్లలకు మనం ఏదైనా ఆస్తి ఇస్తున్నాం అంటే అది కేవలం ఒక్క విద్య మాత్రమే. అందుకే ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా అభివృద్ధి చేసి మంచి విద్య అందించడమే వైఎస్సార్ సీపీ ప్రభుత్వ లక్ష్యం.
● 2019–2024 మధ్య కాలంలో నాటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన మాటలివి
ఒంగోలు సిటీ: ప్రభుత్వ విద్యా వ్యవస్థకు 2019–2024 మధ్య కాలం స్వర్ణయుగం. అరకొర వసతులతో కునారిల్లుతున్న ప్రభుత్వ విద్యా వ్యవస్థను గాడిలో పెట్టి కార్పొరేట్‌ను తలదన్నేలా పాఠశాలను తీర్చిదిద్దారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరిగి..నో అడ్మిషన్ బోర్డులు పెట్టిన సందర్భాలూ ఉన్నాయి. డ్రాపౌట్స్ క్రమంగా తగ్గిపోయారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ప్రతి నెలా వేల సంఖ్యలో విద్యార్థులు పాఠశాలలను వీడుతున్నారు.
ఆరు నెలల్లో 30 వేల మంది..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు జిల్లాలోని 38 మండలాల్లో సుమారు 3.15 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. కానీ డిసెంబర్ 20 నాటి ఆ సంఖ్య 2,83,190కి పడిపోయింది. దీంతో ఆరు నెలల్లోనే సుమారు 30 వేల మందికి పైగా విద్యార్థులు డ్రాపౌట్ అయ్యారు. ప్రతి నెలా ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్స్ సంఖ్య పెరిగిపోతోంది. ఒక్కో మండలం నుంచి వందలాది మంది విద్యార్థులు పాఠశాలలను వీడుతున్నారు.
ఒక్క పైసా కూడా ఇవ్వలేదే..
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో తల్లుల ఖాతాల్లో ఠంచన్‌గా అమ్మఒడి నగదు జమయ్యేది. దీంతో తల్లిదండ్రులకు ఆర్థిక కష్టాలు తప్పి పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలలకు పంపారు. అమ్మఒడే కాదు..ప్రతి విద్యార్థికి కొత్త యూనిఫాం, షూ, సాక్స్‌లు, టై, బెల్టు అందజేశారు. జగనన్న గోరుముద్దను మధ్యాహ్న భోజనంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేశారు. కానీ కూటమి ప్రభుత్వంలో అంతా తలకిందులైంది. ఎన్నికల సమయంలో అమ్మకు వందనం పేరుతో ప్రతి విద్యార్థికి రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చి..అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు పైసా కూడా ఇవ్వలేదు. దీంతో తల్లిదండ్రులకు ఆర్థిక కష్టాలు వెంటాడి..పిల్లలను పాఠశాలలకు మాన్పించి తమతో పాటు పనులకు తీసుకువెళుతున్నారు.
డ్రాపౌట్స్‌పై ప్రత్యేక క్యాంపులేవి..?
గతంలో సచివాలయ ఉద్యోగులతో పాటు విద్యా శాఖాధికారులు గ్రామాల్లో పర్యటించి డ్రాపౌట్స్‌పై నిఘా ఉంచేవారు. బడిఈడు పిల్లలు బయట కనిపిస్తే వెంటనే వారిని పాఠశాలల్లో చేర్పించి తల్లిదండ్రులతో మాట్లాడేవారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తిగా అటకెక్కించేసింది.
ఫీజులు కట్టలేక మరికొందరు..
గత ప్రభుత్వంలో అమ్మఒడి అందడంతో కొంత మంది ప్రైవేట్ పాఠశాలల్లో చేరారు. ఈ కానీ సంవత్సరం ప్రారంభం నుంచి ఒక్క పైసా కూడా రాకపోవడంతో వారు పాఠశాలలకు దూరమయ్యారు. ఇదే అదునుగా ప్రైవేట్ పాఠశాలలు భారీగా ఫీజులు పెంచి దోచుకుంటున్నారు. గత ఐదేళ్లలో అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి విద్యా వ్యవస్థకు పునర్జీవం పోస్తే..ప్రస్తుతం చంద్రబాబు విద్యా వ్యవస్థను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో క్రమంగా తగ్గుతున్న విద్యార్థులు ఆరు నెలల్లో 30,813 మంది విద్యార్థులు డ్రాపౌట్ చంద్రబాబు నిర్వాకంతో ప్రభుత్వ పాఠశాలలకు గ్రహణం చదువు మాన్పించి పనులకు పంపుతున్న తల్లిదండ్రులు డ్రాపౌట్స్‌పై కొరవడిన పర్యవేక్షణ
తల్లికి వందనం ఏది
ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం పేరుతో రూ.20 వేల చొప్పున ఇస్తామని చెప్పారు. కానీ ఆరు నెలలుగా ఒక్క రూపాయి ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో ఏటా ఠంచన్‌గా అమ్మఒడి అందింది. చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలి. – వి.సరోజ
Comments
Please login to add a commentAdd a comment