నలుగురు జిల్లా క్రీడాకారులు
జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీలకు
ఒంగోలు: జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీలకు జిల్లా నుంచి నలుగురు క్రీడాకారులు ఎంపికై నట్లు ప్రకాశం జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జి.నవీన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్న వీరు ఈపీ, ఫాయల్ విభాగాల్లో ప్రతిభ చాటారు. పుత్తూరి అంబరీష్ – ఈపీ విభాగం (సిల్వర్), వి.లోకేష్ సాయి–ఈపీ విభాగం (బ్రాంజ్), ఎస్‌కే ఆసీఫా–ఈపీ విభాగం (బ్రాంజ్), క్రిష్టంశెట్టి ప్రణీత–ఫాయల్ విభాగం (బ్రాంజ్ మెడల్) సాధించారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న ఈ నలుగురు క్రీడాకారులు ఈనెల 31 నుంచి జనవరి 3వ తేదీ వరకు కేరళ రాష్ట్రం కన్నూర్ పట్టణంలోని ముండయాడ్ ఇండోర్ స్టేడియంలో జరిగే 35వ సీనియర్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో సత్తా చాటనున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులను అసోసియేషన్ జిల్లా వ్యవస్థాపక, రాష్ట్ర అధ్యక్షుడు వి.నాగేశ్వరరావు, కోచ్‌లు బి.భరత్, ఆర్.విజయలక్ష్మి, డి.రాజు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment