చిన్నారుల దత్తత ప్రక్రియ త్వరితగతిన చేపట్టాలి
● మహిళా శిశు సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సూర్యకుమారి
ఒంగోలు సిటీ: శిశుగృహంలోని చిన్నారుల దత్తత ప్రక్రియ త్వరితగతిన చేపట్టాలని, వారిని దత్తత తల్లిదండ్రుల చెంతకు చేర్చి వారికి ఒక కుటుంబం ఏర్పరచాలని మహిళా శిశు సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సూర్యకుమారి సూచించారు. ఒంగోలులోని మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుపుతున్న బాలసదనం, శిశుగృహాలను సందర్శించడం మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ సూర్యకుమారి మాట్లాడుతూ వారు ఎప్పుడు వచ్చారు, ఎందువల్ల వచ్చారు అని తెలుసుకొని వారిని తల్లిదండ్రుల చెంతకు త్వరితగతిన చేరేలా చర్యలు తీసుకోవాలని అక్కడి అధికారులకు సూచించారు. బాలసదనంలోని పిల్లలు ఎవరూ ఖాళీగా ఉండకూడదని, ప్రతి విద్యార్థి స్కూలుకి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం బాలసదనం చిన్నారులతో క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. వారితో క్రిస్మస్ తాత వేషధారణ వేయించి కేకు పిల్లలచే కట్ చేసి క్రిస్మస్ పండుగ ప్రాముఖ్యత చిన్నారులకు తెలియజేశారు. కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీవో లక్ష్మీ ప్రసన్న, మహిళ శిశు సంక్షేమశాఖ ప్రాజెక్టు డైరెక్టర్ హెన సుజన్, జిల్లా బాలల సంరక్షణ అధికారి పి.దినేష్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment